సింహం జాలి..జింక పిల్లకి భయంతోడి సరదా !
Publish Date:Aug 1, 2022
Advertisement
చిన్నప్పటి నుంచి పులి, మేక..సింహం, నక్క..మొసలి, కోతి.. కథలు చదివే వుంటారు. ఇంట్లో పెద్దవాళ్లు చెబితే వినన్నా వినే ఉంటారు. అయితే అడవి మృగాలన్నీ ఎల్లవేళలా అంతే క్రూరంగా ఉంటాయనీ అనలేం. వాటికి తల్లి, పిల్లల ప్రేమ తెలుసు. వాటిలోనూ తోటి చిన్న ప్రాణులపట్ల లోలోపల ఎక్కడో కాసింత జాలీ ఉంటుంది. అవుననే అంటోంది ఈ జింక పిల్లతోడి సింహం. అడవిలో సింహం అలా తిరుగుతూండగా హఠాత్తుగా ఈ చిన్నారి జింక పిల్ల ఎదురయింది. అంతే జింక పిల్లకు చచ్చేంత భయం వేసింది. వేగంగా పరిగెత్తలేదు, దాన్నించి తప్పించుకోనూ లేదు. సింహాంగారికి టిఫిన్ అవుతున్నానని తల్లిని ఒక్కసారి తలచుకుని కళ్లు మూసుకుంది. కానీ చిత్రమేమంటే అది భయ పడినంతగా ఏమీ జరగలేదు. సింహం మాత్రం జింక పిల్ల తల్లి గతంలో తప్పించుకుపోయిందన్న ఆగ్రహం ప్రదర్శించలేదు. దీన్ని తినేసి దాన్ని బాధపెట్టేయాలని సినిమాటిక్‌గానూ ఆలోచించలేదు. దగ్గరికి వెళ్లి ఆ చిన్నారి భయం పోగొ ట్టింది. జింక పిల్ల మాత్రం తన ఒణుకుని వదిలించుకుని సింహం పంజానే చూస్తూ కూచుండి పోయింది. కానీ జింక పిల్ల మాత్రం కాసింత భయంతోనే ఒదిగికూచుంది. ఏ క్షణాన ఏ నక్కబావో వచ్చి ఏ అద్బుత ఆలోచనో సింహం చెవిలో పడేస్తే తానేమైపోతానా అని భయపడుతూనే ఉంది. కానీ ఆ సాయిత్రం చీకటి పడేవరకూ కూడా అలాంటిదేమీ జరగలేదు. సాయిత్రం చీకటిపడేవేళ్లకి మాత్రం సింహానికి తన పిల్లలు గుర్తొచ్చినట్టుంది. ఠక్కున లేచి ఒక్కసారి దూరంగా ఎటో చూసింది. అప్పటిదాకా కాళ్లదగ్గరే భయంతో పడున్న జింక పిల్ల మొహాన్ని పెద్దగా ముద్దాడి మళ్ల కలుద్దామని చాలా హుందాగా వెళిపోయింది. సిం హం కనుమరుగైన కొద్దిసేపటికి ఈ చిన్నారి లేచి ధైర్యం కూడగట్టుకుని నిటారుగా నిలబడి నేను సింహాం తో ఇప్పుడే సరదాగా నాలుగు మాటలు మాటాడి వస్తున్నానని తల్లికి చెప్పేంత ధైర్యం ప్రదర్శిస్తూ తాను ఇంటికి వెళ్లింది!
http://www.teluguone.com/news/content/deer-39-141010.html





