భారీ డెటా సెంటర్లకు డీడీఎల్ విధానం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం

Publish Date:Apr 24, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్  ఐటీ మరియు డిజిటల్ రంగంలో అగ్రగామిగా నిలిచేందుకు  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు.  రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో..  డేటా సెంటర్ల నిర్వహణలో ఎదురవుతున్న విద్యుత్ సమస్యలను పరిష్కరించడానికి   కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు.   300 మెగావాట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగించే భారీ డేటా సెంటర్లకు సొంతంగా విద్యుత్ పంపిణీ చేసుకునే హక్కును కల్పిస్తూ  డీమ్డ్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ (డీడీఎల్) విధానాన్ని తీసుకువచ్చారు. దీనివల్ల భారీ సంస్థలు ఇకపై ప్రభుత్వ విద్యుత్ పంపిణీ సంస్థలు డిస్కమ్ లపై  ఆధారపడకుండా..  నేరుగా విద్యుత్ కొనుగోలు చేసుకునే వెసులుబాటు కలుగుతుంది.

ఈ కొత్త విధానం మేరకు.. అర్హత కలిగిన డేటా సెంటర్లు తమ ప్రాజెక్టు పరిధిలో సొంత విద్యుత్ నెట్‌వర్క్‌ను నిర్మించుకోవచ్చు. దీనివల్ల అవి నేరుగా విద్యుత్ ఉత్పాదక కేంద్రాల నుండి లేదా నర్జీ ఎక్స్ఛేంజీల నుండి   విద్యుత్తును సేకరించుకోవచ్చు. సాధారణంగా డేటా సెంటర్లు నిరంతరం, నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను కోరుకుంటాయి. ప్రస్తుత గ్రిడ్ వ్యవస్థలో ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులు ఈ భారీ కేంద్రాలకు ఆటంకం కలగకుండా చూడాలన్న ఉద్దేశంతోనే ఏపీ సర్కార్ డీడీఎల్ విధానాన్ని తీసుకువచ్చింది.  ఈ విధానం వల్ల విద్యుత్ ఖర్చు తగ్గడమే కాకుండా, సరఫరాలో నాణ్యత పెరుగుతుంది.

పర్యావరణ హితానికి ప్రాధాన్యతనిస్తూ, ఈ విధానంలో ఒక కీలక నిబంధనను చేర్చారు. ఈ లైసెన్స్ పొందే సంస్థలు తమ మొత్తం విద్యుత్ వినియోగంలో కనీసం 51 శాతం పునరుత్పాదక ఇంధనం   నుండే పొందాల్సి ఉంటుంది. సౌర లేదా పవన విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా అటు పరిశ్రమలకు, ఇటు పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీ రంగానికి  డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.

ఈ విప్లవాత్మక మార్పుకు నాంది పలుకుతూ, ప్రముఖ టెక్ దిగ్గజం  గూగుల్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న భారీ ఏఐ హబ్,  డేటా సెంటర్ క్లస్టర్‌కు ఈ లైసెన్స్ లభించే అవకాశం ఉంది. విశాఖను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  రాజధానిగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ డీడీఎల్ విధానం దోహదపడుతుందని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు.  

అయితే..  ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ డిస్కమ్ లకు రాబడి తగ్గే ప్రమాదం ఉందన్న ఆందోళనలు  వ్యక్తమవుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే కేవలం 300 మెగావాట్ల కంటే ఎక్కువ లోడ్ ఉన్న అతిపెద్ద ప్రాజెక్టులకు మాత్రమే ఈ వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది.  చిన్న, మధ్య తరహా పరిశ్రమలు యధావిధిగా డిస్కంల నుండే విద్యుత్ పొందాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వ సంస్థల ఆదాయానికి పెద్దగా గండి పడకుండా, అంతర్జాతీయ పెట్టుబడులను సాధించవచ్చని ప్రభుత్వం చెబుతోంది. 

By
en-us Political News

  
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రకటనకు సర్వం సిద్ధమైంది.
తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా రంగంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.
తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ పాలనలో మరో కీలక ముందడుగు వేసింది.
కూకట్‌పల్లి పరిధిలో జరిగిన దాడి కేసులో మన్నే క్రిషాంక్ సహా 8మందికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
తెలంగాణ ఉద్యమ కాలంలో సంచలనంగా నిలిచిన మిలియన్ మార్చ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ మెట్రో రైలును ఈ ఏప్రిల్ నెలాఖరుకు తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఖాయమైంది.
అజిత్ దోవల్ రియాద్ పర్యటన, అలాగే విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ యూఏఈ చర్చలు, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఖతార్ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ పర్యటనలన్నీ ఎనర్జీ-సెక్యూరిటీ ప్రణాళికలో భాగమేనని నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్ బుక్ ఫెయిర్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎస్. గోపాలరావు(90) గురువారం కన్నుమూశారు.
పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి మూసివేత, రెడ్ సీ, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో నౌకారవాణాకు అంతరాలు.. ఇవన్నీ కలిసి గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియా.. తన చమురు, గ్యాస్ సరఫరా నిరంతరతను పరిరక్షించుకోవడానికి, అలాగే గల్ఫ్ ప్రాంతంలో ఉన్న ప్రవాస భారతీయుల భద్రతకు చర్యలు తీసుకుంటోంది.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ తన జోరును మరోసారి చాటిచెప్పింది.
బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు అందుకోనున్నారు.
చట్టసభల్లో మహిళ రిజర్వేషన్ బిల్లుపై ఇండియా కూటమి వైఖరిని ప్రజలకు వివరించాలని పార్టీల నేతలకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు పోలీసు అధికారులకు పదోన్నతి కల్పిస్తే.. వారిలో ఒక్క సజ్జనార్ ప్రమోషన్ పట్ల మాత్రమే సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమౌతుండటం ప్రత్యేకత, ప్రాధాన్యత సంతరించుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.