మహానాడు వేదికపై మోగిన యువగళం.. ఉర్రూతలూగించిన దర్శన్ ప్రసంగం!

Publish Date:May 28, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహానాడు 2026   సరికొత్త చరిత్రకు వేదికైంది. హైబ్రీడ్ పద్ధతిలో జరిగిన ఈ మహానాడులో   తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు పొట్లూరు దర్శిత్  ప్రసంగం అందరినీ ఉర్రూతలూగించింది.   2014 నాటి రాష్ట్ర విభజన పరిస్థితులను గుర్తుచేస్తూ సాగిన ఆయన  ప్రసంగం..  నాడు పరిశ్రమలు, ఉద్యోగాలు లేక ఆంధ్రప్రదేశ్ తీవ్ర అంధకారంలో మునిగిపోయిందనీ.. ఆ సంక్షోభ సమయంలో యువతకు నైపుణ్యాభివృద్ధిని అందించి ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు సృష్టించడమే ధ్యేయంగా బ్రాండ్ సీబీఎన్ ముందుకు వచ్చారని దర్శిత్ కొనియాడారు. అంతర్జాతీయ సంస్థలైన సిమెన్స్ వంటి భాగస్వామ్యాలతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, 2019 నాటికి లక్షలాది మంది విద్యార్థులను ఉన్నత వేతనాలతో కూడిన ఐటీ రంగ ఉద్యోగాల్లో నిలిపిన ఘనత చంద్రబాబుదేనని స్పష్టం చేశారు. ఇండియా స్కిల్ రిపోర్ట్‌లో సైతం ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన ఆ విజన్, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వ హయాంలో ఎలా నిర్వీర్యమైందో కళ్ళకు కట్టినట్లు వివరించారు.

2019  అధికారంలోకి వచ్చిన జగన్   ఐదేళ్ల పాలనలో రాష్ట్ర యువత అనుభవించిన నరకయాతనను దర్శిత్ గణాంకాలతో సహా వెల్లడించారు. చంద్రబాబు నాయుడు 2019కి ముందే 30 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తే..  వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తిగా తుంగలో తొక్కారని విమర్శించారు. ఫలితంగా  ఉపాధి లేక, ఉద్యోగాలు రాక రాష్ట్రంలో ఏకంగా 2,400 మంది యువతీ యువకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఆ 2,400 అనేది కేవలం ఒక సంఖ్య కాదు.. అది 2,400 మంది కన్నతల్లుల కడుపుకోత, ఆ కుటుంబాల కళ్ళ ముందే జరిగిన అంత్యక్రియలు అంటూ దర్శిత్ భావోద్వేగంగా మాట్లాడినప్పుడు మహానాడులో ఉద్వేగ భరిత వాతావరణం నెలకొంది.  కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చంద్రబాబు నాయుడిని 53 రోజుల పాటు అక్రమ స్కిల్ కేసులో జైల్లో పెట్టినప్పటికీ, ఆయన ఆలోచనలను మరియు విజన్‌ను మాత్రం ఆ బంధీఖానా నిర్బంధించలేకపోయిందని దర్శిత్ చెప్పారు.

చంద్రబాబు  అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా కేవలం ఆంధ్రాలోనే కాదు..  ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు విజన్ వల్ల లబ్ధి పొందిన 79 దేశాలలోని తెలుగు యువత రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ కక్ష సాధింపు, రివెంజ్ రాజకీయాలతో విసిగిపోయిన యువత, 2024 ఎన్నికల్లో ఒక అద్భుతమైన, విస్పష్టమైన తీర్పు  ఇచ్చిందని పేర్కొన్నారు.  మాకు రివెంజ్ పాలిటిక్స్ వద్దు.. రిజల్ట్స్ ముఖ్యం, కేసులు కాదు.. మాకు కెరీర్ ముఖ్యం  అని నినదిస్తూ  తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడంలో యువత అత్యంత కీలక పాత్ర పోషించిందన్నారు. గత ప్రభుత్వం కులాలు, ఓట్లు, సీట్ల లెక్కల్లో మునిగిపోతే.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం యువతలోని టాలెంట్, స్కిల్, పొటెన్షియల్‌ను నమ్మిందని, అందుకే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తీసుకున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన మొట్టమొదటి నిర్ణయం  స్కిల్ సెన్సస్ అని కొనియాడారు.

రాబోయే రోజుల్లో  స్కిల్ యూనివర్సిటీ  ద్వారా యువతను కేవలం ఉద్యోగాలు వెతుక్కునే వారిగా  కాకుండా, ఉద్యోగాలు సృష్టించే వారిగా  మార్చడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని దర్శిత్ వెల్లడించారు. ఉత్తరాంధ్రను డిజిటల్ గేట్‌వేగా మారుస్తూ గూగుల్, టిసిఎస్, కాగ్నిజెంట్, డెలాయిట్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలను విశాఖకు తీసుకొస్తున్న యువ నాయకుడు నారా లోకేష్ శైలిని అభినందించారు. యువత చేతుల్లో కేవలం సర్టిఫికెట్లు మాత్రమే కాదు..  గౌరవప్రదమైన పే-స్లిప్పులు ఉండాలన్నదే లోకేష్ సంకల్పమన్నారు. గతంలో రాయలసీమను ఫ్యాక్షన్ సీమగా, రాళ్ల సీమగా గుర్తింపు పొందితే.. లోకేష్  ఆ ప్రాంతానికి రాయల్ ఎన్‌ఫీల్డ్ మరియు డిఫెన్స్ యుద్ధ విమానాల తయారీ పరిశ్రమలను తీసుకొచ్చి 'రాయల్ సీమ - రక్షణ సీమ'గా మార్చారని ప్రశంసించారు. పదో తరగతి ఫలితాల ప్రకటనలో కూడా తన ప్రచారం చేసుకోకుండా, పేద విద్యార్థుల చిరునవ్వులనే హైలైట్ చేసిన లోకేష్ సంస్కారానికి, ఐదు పైసల పని చేయకుండా ఐదు వందల రూపాయల పబ్లిసిటీ చేసుకున్న జగన్ మనస్తత్వానికి ఆకాశానికి, పాతాళానికి ఉన్నంత తేడా ఉందన్నారు.

చివరగా..  వైసిపి నేతలు మాట్లాడుతున్న ధర్మ సూత్రాలపై, లోకేష్   రెడ్ బుక్ పై వైసీపీ విమర్శలకు దర్శిత్ మహాభారత ఘట్టాన్ని ఉదహరిస్తూ గూస్‌బంప్స్ తెప్పించే విమర్శలు గుప్పించారు. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు చావు ముంగిట నిలబడి ధర్మం గురించి మాట్లాడినప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానాన్ని గుర్తుచేశారు.  కౌరవ సభలో ద్రౌపదిని వివస్త్రను చేస్తున్నప్పుడు, పాండవులను అవమానిస్తున్నప్పుడు గుర్తురాని ధర్మం.. ఈరోజు నిన్ను కాపాడదు కర్ణా! ధర్మాన్ని నువ్వు పాటిస్తేనే అది నిన్ను కాపాడుతుంది అన్న కృష్ణుడి మాటలను నేటి రాజకీయాలకు అన్వయించారు. గత అసెంబ్లీలో 151 మంది కౌరవుల్లా కూర్చుని చంద్రబాబు నాయుడిని మానసిక క్షోభకు గురిచేసినప్పుడు, నారా భువనేశ్వరిని  అవమానించినప్పుడు, లోకేష్‌ను అవహేళన చేసినప్పుడు వైసిపి నాయకులకు ధర్మం గుర్తురాలేదా అని ప్రశ్నించారు. నాడు గుర్తురాని ధర్మం నేడు నెమరువేసుకుంటే లాభం లేదనీ.. ఎవడి కర్మకు వాడే బాధ్యుడు అన్న భగవద్గీత సూత్రాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా నారా లోకేష్ అమలు చేసి తీరుతారని హెచ్చరించారు.

By
en-us Political News

  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.