రేణుకాస్వామి అనే తన అభిమానిని హత్య చేసిన కేసులో కన్నడ హీరో దర్శన్ కొంతకాలంగా విచారణ ఖైదీగా బళ్లారి జైలులో వున్నారు. దర్శన్ గత కొన్నిరోజులుగా రాత్రుళ్ళు నిద్రపోవడం లేదని తెలుస్తోంది. తాను చంపిన రేణుకాస్వామి ఆత్మ తనని వెంటాడుతోందని, కలలోకి వచ్చి భయపెడుతోందని, అందువల్ల భయంతో తనకు నిద్ర పట్టడం లేదని దర్శన్ జైలు అధికారులకు చెబుతున్నారని తెలుస్తోంది. తాను ఒంటరిగా ఉండలేకపోతున్నానని, అందువల్ల తనను బెంగళూరు జైలుకి తరలించాలని కోరినట్టు సమాచారం. అర్ధరాత్రి సమయంలో దర్శన్ గట్టిగా కేకలు వేస్తున్నాడని తోటి ఖైదీలు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా దర్శన్ ఆడుతున్న నాటకమని కొందరు అంటున్నారు. బెంగళూరు జైలుకు మారడం కోసమే దర్శన్ ఇవన్నీ చెబుతున్నారని అంటున్నారు. ఒకవేళ రేణుకాస్వామి దయ్యంగా మారినట్టయితే బెంగళూరు జైలుకు రాడా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/darshan-renukaswamy-case-39-186289.html
పోలీసులు ఇప్పటికీ వైసీపీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు వాస్తవమే అనడానికి వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు విడిచిపెట్టడాన్నే చెప్పవచ్చు. వర్రా రాఘవరెడ్డి వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడూ, కూటమి అధికారంలోకి వచ్చిన తరువాతా కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం, జనసేన నేతలు, మహిళా నాయకురాళ్లపై అసభ్య పోస్టులు పెట్టారు.
తూళ్లూరు మండలం వెలగపూడి గ్రామానికి చెందిన మరియమ్మ హత్య కేసులో నిందితుడైన వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు హైకోర్టులో చుక్కెదురైంది.
హైద్రాబాద్ మేయర్ విజయ లక్ష్మి జిహెచ్ ఎంసి ప్రధాన కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో గద్వాల మంగళవారం తనిఖీలు చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులపై ప్రజా వాణిలో ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి.
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో కుప్పం విషయంలో ఆ పార్టీ నేతలు పెచ్చులు మాట్లాడారు. చంద్రబాబును ఆయన సొంత నియోజకవర్గంలోనే ఓడిస్తామంటూ ప్రగల్భాలు పలికారు. 2024 ఎన్నికలలో కుప్పం నియోజకవర్గం వైసీపీ ఖాతాలో పడటం ఖాయమంటూ గప్పాలు కొట్టారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లపై సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి దుష్ప్రచారం చేస్తున్న ఎన్నారై పంచ్ ప్రభాకర్ పై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అల్లు అర్జున్ కు భారీ ఊరట లభించింది. ఎన్నికల సమయంలో ఆయనపై నమోదైన కేసును ఏపీ హైకోర్టు క్వాష్ చేసింది.
తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలకమండలి ఛైర్మన్ గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు బుధవారం (నవంబర్ 6) ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే 17 మంది సభ్యులు కూడా ప్రమాణం చేశారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో బీఆర్ నాయుడు చేత ఈవో శ్యామలరావు ప్రమాణ స్వీకారం చేయించారు.
అమెరికా ఎన్నికలలో పలువురు భారత సంతతికి చెందిన నేతలు విజయం సాధించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో భారత సంతతికి చెందిన కమలాహారిస్ పోటీపడుతున్న సంగతి తెలిసిందే.
నారా లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ అయ్యిందా? జగన్ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అన్ని సరిహద్దులనూ దాటేసి ఇష్టారీతిగా అడ్డగోలుగా వ్యవహరించిన ఒక్కొక్కరిపై చట్ట ప్రకారం చర్యలకు రంగం సిద్ధమైందా అంటే వరుసగా జరుగుతున్న సంఘటనలను బట్టి ఔననే అనాల్సి వస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం (నవంబర్ 6) హస్తిన పర్యటనకు వెడుతున్నారు. అంతకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే మంత్రి వర్గ సమావేశంలో పాల్గొంటారు. కేబినెట్ సమావేశం ముగిసిన తరువాత ఆయన ఢిల్లీకి బయలుదేరి వెడతారు.
రంగారెడ్డి జిల్లా నందిగామలోని కంసన్ హైజెనిక్ పరిశ్రమలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం (నవంబర్ 6) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 17 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
నాగర్ కర్నూల్ కు తాడూరుకు దాదాపు 6 కిలోమీటర్ల దూరంలో ఇంద్రకల్ గ్రామ పొలాల్లో ఉన్న కాకతీయుల కాలం ఇంద్రేశ్వరాలయం శిథిలావస్థలో ఉందని కాపాడి భావి తరాలకు అందించాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈఓ డాక్టర్ ఈమనిశివనాగిరెడ్డి గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.