దళిత బంధు రివర్స్ ఎఫెక్ట్.. కేసీఆర్‌కే బూమ‌రాంగ్‌!?

Publish Date:Mar 30, 2022

Advertisement

దళిత బందు పథకంపై దళితుల కంటే ముఖ్యమంత్రి కేసీఆరే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. అదేంటి, దళితబంధుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశలు పెట్టుకోవడం ఏమిటి? అంటారా, అవును ముచ్చటగా మూడవసారి అధికారంలోకి వచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర సంక్షేమ పథకాలు అన్నిటికంటే, దళితబంధు పైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. అందుకే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతగా సహకరించక పోయినా,అప్పుల్లో అప్పు ఇంకో అప్పు తెచ్చి అయినా,జనంలో  దళితబంధు ఆశలను సజీవంగా ఉంచేందుకు ముఖ్యమంత్రి కొంచెం చాలా ఎక్కువ శ్రద్దే తీసుకున్నారు. నిజంగా ఖర్చు చేస్తారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే, బడ్జెట్’లోనూ నిధులు దండిగా కేటాయించారు. 

అయితే, అదేమిటో కానీ, దళితబందు పథకం ముఖ్యమంత్రి కేసీఆర్’కు,తెరాసకు అంతగా అచ్చివచ్చినట్లు లేదు. హుజురాబాద్ ఉప ఎన్నికలలో ఎలాగైనా ఈటల రాజేందర్’ను ఓడించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబందు పథకాన్ని పైకి తెచ్చారు. ఎన్నికలకు ముందు ఆ నియోజక వర్గంలోనే పైలట్ ప్రాజెక్ట్’ను ప్రారంభించారు. అయినా, హుజురాబాద్’లో ఏమి జరిగిందో వేరే చెప్పనక్కరలేదు. అక్కడి నుంచే దళితబంధు దగాబంధు అనే ముద్ర అయితే పడింది కానీ, ఎన్నికలలో ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస ప్రతిష్టను పైసా ఎత్తుకుడా నిలబెట్టలేక పోయింది. దళితబంధుతో పాటుగా ఏ పథకమూ పనిచేయలేదు. ఇంచుమించుగా రూ. 600 కోట్ల వరకు ఖర్చు  చేసినా, ఫ్యామిలీకి రూ.10 లక్షలు ఇచ్చే దళితబందును ఎరగా వేసినా, చివరకు ఏమి జరగాలో అదే జరిగింది. అయినా, ముఖ్యమంత్రి కేసీఆర్’ మాత్రం దళితబంధు మీద ఆశలు వదులుకోలేదు. అందుకే, ఆశించిన రేంజ్’లో కాకపోయినా, దళితబందు పథకం సజీవంగా ఉంచేందుకు ప్రతి నియోజకవర్గంలో వంద మందికి దళిత బంధు ఇవ్వాలని నిర్ణయించారు. 

అయితే, మళ్ళీ ఇక్కడా ఎదురుదెబ్బలు తప్పడం లేదు. ముఖ్యమంత్రి కేసీఅర్ ఆశలకు సొంత పార్టీ నేతలే గండి కొడుతున్నారనే వార్తాలు వస్తున్నాయి. ఎమ్మెల్యేలు, వేరే ఎవరికో ఇవ్వడం ఎందుకు అనుకుంటున్నారో ఏమో కానీ, అవకాసం ఉన్న మేరకు ఆ పది లక్షలు కూడా తమ ఖాతాలలోనే వేసుకున్నారు.తమ కుటుంబ సభ్యులకో లేందంటే తమ బందువర్గానికో ఇచ్చుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నిజానికి, రాజకీయ లబ్ది కోసమే ఈ పథకం తెచ్చారు కాబట్టి లబ్దిదారుల ఎంపిక జాబితాను ఖరారు చేసే అధికారం ఎమ్మెల్యేలకే ఇచ్చారు. ఎమ్మెల్యేలేమో, అయిన వారితో జాబితా నింపుతున్నారు. ఒక్కొక్క నియోజక వర్గంలో వందమంది లబ్దిదారులను ఎంపిక చేస్తే అందులో 90 మందికి పైగా, కొన్ని నియోజక వర్గాల్లో వందకు వందమంది ఎమ్మెల్యేల బంధువులు కాదంటే అనుచర గణాలే ఉంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలను నిజం చేస్తూ, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య తన తమ్ముడికే దళిత బంధు ఇచ్చేశారు. అదేమంటి, దళితులు అందరికీ దళిత బందు అని ముఖ్యమంత్రి చెప్పలేదా అని బుకాయిస్తున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా రాజయ్య రాచబాటలో అదే పనిచేశారు. ఫ్యామిలీ ఫస్ట్, పార్టీ  నెక్స్ట్, పేదోడు లాస్ట్’ ప్రిన్సిపుల్ ఫాలో అయ్యారనే ఆరోపణలు సోసిఅల మీడియాలో చక్కర్లు  కొడుతున్నాయి.

తెరాస ఎమ్మెల్యేల తీరుతో దలిత బందు లక్ష్యమే కాదు, ముచ్చటగా మూడవసారి అధికారంలోకి రావాలనే ముఖ్యమంత్రి ఆశలకు కూడా గండిపడుతోందని అంటున్నారు. ఎమ్మెల్యేల తీరుతో ఈ పథకం వల్ల టీఆర్ఎస్‌కు వస్తున్న లబ్ది కంటే… నష్టమే ఎక్కువ ఉంటుందని టీఆర్ఎస్ నేతలే ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. దళిత సంఘాలు అయితే, ఇంతవరకు ఎంపిక చేసిన లబ్దిదారుల జాబితాలను రద్దుచేసి  గ్రామ సభల్లో పారదర్శకంగా, అంత్యోదయ (పూరెస్ట్ ఆఫ్ ద పూర్) పద్దతిలో లబ్దిదారుల ఎంపిక చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరో వనక ఇతర సామాజిక వర్గాల నుంచి తమకు కూడా ‘బందు’ కావాలనే డిమాండ్స్ వస్తున్నాయి. అందుకే,దళితబందు వలన  వ్రతం చెడినా ఫలితం దక్కలేదనే మాటే తెరాస వర్గాలో వినవస్తోంది.

By
en-us Political News

  
దేశ రాజధాని ప్రాంతంలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
7.75 లక్షల విలువైన 1,035 కిలోల ఆహార పదార్థాలు సీజ్.!
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
అమెరికా గడ్డపై మరో తెలుగు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ప్రకృతి మారుతున్న తీరు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం సామాన్యుడి బతుకును మరింత ఛిన్నాభిన్నం చేస్తోంది.
దేవీ నవరాత్రుల సందర్భంగా గ్రామంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ డీజే సౌండ్ హోరుకు ఓ పాత ఇందిరమ్మ బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు కూలిపడ్డాయి.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
ఉత్తరాఖండ్‌లో నెలకొన్న దుర్భర రవాణా పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఓ నవవధువు ఎంచుకున్న మార్గం అందరినీ విస్మయానికి గురిచేసింది.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసిపాప.. క్షణాల వ్యవధిలోనే కన్నుమూసింది.
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ దేశం నుంచి అత్యున్నత గౌరవం దక్కింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరో వాతావరణ గండం ఆందోళనకు గురిచేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.