మౌత్ వాష్ వాడుతున్నారా?  దీన్ని ఎక్కువగా వాడితే ఏం జరుగుతుందో తెలుసా?

Publish Date:Apr 25, 2026

Advertisement

 

కాలంతో పాటు అన్ని అలవాట్లు అప్డేట్ అవుతూ ఉన్నాయి.  మొదట వేప పుల్లలతో పళ్లు తోమేవారు,  తర్వాత పేస్ట్ లు వచ్చాయి.  ఆ తరువాత పేస్ట్ లలో ఉప్పు, బొగ్గు, లవంగం వంటివి చేరాయి.  అవి కూడా అయ్యాక మౌత్ వాష్ లు వచ్చాయి.  చాలా పరిశుభ్రతలో బాగంగా మౌత్ వాష్ లు వాడుతుంటారు.  కొందరు పళ్లు తోమే పని లేకుండా మౌత్ వాష్ వాడితే.. మరికొందరు పళ్లు తోమిన తర్వాత కూడా ఇంకా పళ్లు ఎక్కువగా శుభ్రం అవుతాయని అతి శుభ్రతతో మౌత్ వాష్ కూడా వాడతారు. అయితే.. మౌత్ వాష్ వాడే వారికి డాక్టర్లు ఓ చల్లని చావు కబురు చెబుతున్నారు.  మౌత్ వాష్ వాడితే రక్తపోటు సమస్య వస్తుందని అంటున్నారు.  దీని గురించి వైద్యులు చెప్పిన విషయాలు వివరంగా తెలుసుకుంటే..

మౌత్ వాష్.. నోటి ఆరోగ్యం..

నోటిలోని మంచి బ్యాక్టీరియా మానవ శరీరానికి చాలా అవసరం. ఈ బ్యాక్టీరియా ఆహారంలోని నైట్రేట్‌లను నైట్రైట్‌లుగా మార్చడానికి సహాయపడతాయి, ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. నైట్రిక్ ఆక్సైడ్ అనేది రక్తనాళాలను సడలించడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి , రక్తపోటును నియంత్రించడానికి సహాయపడే ఒక ముఖ్యమైన అంశం.

మౌత్ వాష్ వల్ల కలిగే నష్టం..

బలమైన యాంటీసెప్టిక్ మౌత్‌వాష్‌లు నోటిలోని  మంచి బ్యాక్టీరియాను కూడా చంపగలవని నిపుణులు అంటున్నారు. ఇది నైట్రేట్, నైట్రైట్‌గా మారే ప్రక్రియను ప్రభావితం చేస్తుంది , శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలను తగ్గించగలదు. ఇది నేరుగా రక్తనాళాల పనితీరుపై ప్రభావం చూపుతుంది, తద్వారా రక్తపోటును ప్రభావితం చేసే అవకాశం ఉంది. యాంటీ బాక్టీరియల్ మౌత్‌వాష్ వాడకం వల్ల నోటిలోని అవసరమైన బ్యాక్టీరియా 90 శాతం వరకు తగ్గుతుందని కొన్ని అధ్యయనాలలో తేలిందని వైద్యులు కూడా చెబుతున్నారు. కేవలం కొన్ని రోజుల వాడకం కూడా లాలాజలంలో నైట్రేట్ స్థాయిలను తగ్గించగలదని, దీనివల్ల సిస్టోలిక్ రక్తపోటులో స్వల్ప పెరుగుదల ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.

మౌత్ వాష్ ఎక్కువ కాలం ఉపయోగిస్తే..

రోజు ఎక్కువగా మౌత్‌వాష్ ఉపయోగించడం వల్ల దీర్ఘకాలంలో అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మంచి బ్యాక్టీరియాను తగ్గించడం, నైట్రిక్ ఆక్సైడ్‌ను తగ్గించడం, , రక్తనాళాల సరైన పనితీరును దెబ్బతీసే ప్రక్రియ వలనే ఇది జరుగుతుందని అంటున్నారు. దీని ప్రభావాలు అందరిపై తీవ్రంగా ఉండనప్పటికీ, రెగ్యులర్ గా అందులోనూ ఎక్కువగా వాడటం వల్ల ప్రమాదం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.

చిగుళ్ల వ్యాధి, దంత చికిత్స తర్వాత, లేదా దంతాలపై అధికంగా పాచి పేరుకుపోయిన వంటి కొన్ని పరిస్థితులలో మౌత్‌వాష్ వాడకం  అవసరం అవుతుంది. అందువల్ల, మౌత్‌వాష్‌ను అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలని, దానిని రోజువారీ అలవాటుగా చేసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు. నోటి శుభ్రతకు బ్రష్ చేయడమే మంచిదని, దీనికే ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నారు. కాబట్టి మౌత్ వాష్ ఎక్కువగా వాడకూడదు.

                                     *రూపశ్రీ.

By
en-us Political News

  
పురుషుల ఆరోగ్యం విషయంలో చాలామంది నిర్లక్ష్యం చేసే సమస్యల్లో క్యాన్సర్ ఒకటి. ప్రారంభ దశలోనే గుర్తిస్తే చాలా రకాల క్యాన్సర్లను విజయవంతంగా చికిత్స చేయవచ్చు...
భారతదేశంలో టీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక అలవాటుగా , రోజును మొదలుపెట్టడానికి మంచి ఎనర్జీ డ్రింక్ గా కూడా భావిస్తారు. ఉదయం లేవగానే టీ తాగడం, పనిలో బ్రేక్  సమయంలో టీ తాగడం..
మనం తినే ఆహారాన్ని ఎంత ఎక్కువగా ఉడికిస్తే అంత మంచిదని చాలామంది భావిస్తుంటారు. కానీ అధికంగా ఉడికించడం వల్ల కొన్ని పోషకాలు తగ్గిపోయే అవకాశం ఉంటుందని ప్రముఖ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్,
పెళ్లయ్యాక ప్రతి భార్యాభర్త పిల్లలను కనడంపై శ్రద్ద పెడతారు. పిల్లలను కనడం,  అమ్మ నాన్న అనిపించుకోవడం జీవితంలో ఒక మధురమైన అనుభూతిగా భావిస్తారు. అయితే నేటికాలంలో ఆడవారు మాత్రమే కాకుండా...
నేటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అందువల్ల, వైద్యులు క్రమం తప్పకుండా వ్యాయామం చేయమని చెబుతుంటారు.   గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి  చాలామంది..
ప్రోటీన్ శరీరానికి అవసరమైన పదార్థం. శరీరంలో కండరాల నిర్మాణానికి, శక్తికి,కణాల అభివృద్దికి, ఎముకల నిర్మాణానికి ఇలా చాలా విషయాలకు ప్రోటీన్ అవసరం అవుతుంది. శరీరానికి ప్రోటీన్ కోసం చాలా మంది గుడ్లు, పాలు, పాల పదార్థాలు అయిన పనీర్ వంటివి తీసుకుంటారు...
ఏదైనా కొనడానికి వెళ్ళాలని అనుకుంటాం. కానీ తీరా అక్కడికి వెళ్లాకా ఏం తీసుకోవాలని వచ్చామో అదే మర్చిపోతుంటాం. ఇది చాలా మందికి జరుగుతూ ఉంటుంది.  కానీ ఎవరూ దీని గురించి పెద్దగా పట్టించుకోరు....
మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాల్లో మెగ్నీషియం (Magnesium) ఒకటి. ఇది కండరాల పనితీరు, నరాల వ్యవస్థ, గుండె ఆరోగ్యం..
మంచి ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన ఆహారం చాలా అవసరం.  తరచుగా ఏమి తినాలి అనే దానిపై చాలా మంది దృష్టి పెడతారు.  నిజానికి ఆరోగ్యం కోసం ఏం తినాలో అనే కాదు..  ఎప్పుడు తినాలనే విషయం  కూడా అంతే ముఖ్యమని..
డయాబెటిస్ ఉన్నవారిలో సైలెంట్ హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎంత? నార్మల్ షుగర్ లెవల్స్, HbA1c విలువలు, ప్రీ-డయాబెటిస్, డయాబెటిస్ కంప్లికేషన్స్ గురించి డా. హరిచరణ్ వివరించిన పూర్తి సమాచారం...
ఈ రోజుల్లో, ఫిట్‌గా , ఆరోగ్యంగా ఉండటానికి చాలా మంది జిమ్‌కు వెళ్తున్నారు.  శరీరాకృతి మెరుగ్గా కనిపించాలని,  ఫిట్‌నెస్ కోసం చేసే ఈ ప్రయత్నంలో, చాలా మందికి తెలియకుండానే కొన్ని తప్పులు జరుగుతాయి...
అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ సమస్యలను సహజంగా తగ్గించుకోవాలనుకుంటున్నారా? ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణుడు డా. చిట్టిబొట్ల మధుసూదన శర్మ సూచించిన ఆయుర్వేద చిట్కాలు, జీవనశైలి మార్పులు, ఆహార నియమాలు ఈ వీడియోలో తెలుసుకోండి. ఆయుర్వేద ద్రవ్యాల ప్రయోజనాలు, శరీరంలో కొవ్వు తగ్గించే మార్గాలు, ఆరోగ్యకరమైన బరువు నియంత్రణపై ఉపయోగకరమైన సమాచారం అందించబడింది. ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది...
నేటికాలంలో వేగవంతమైన జీవనశైలి , సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల, బరువు పెరగడం ప్రజలకు ఒక పెద్ద సమస్యగా మారుతోంది. ఊబకాయం శారీరక దృఢత్వాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు , అనేక ఇతర తీవ్రమైన అనారోగ్యాల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అధిక బరువు వల్ల ఆరోగ్యానికి ప్రమాదం అని తెలుసుకున్న తర్వాత చాలామంది బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.