ఇక జగన్ అక్రమాస్తుల కేసుల రోజువారీ విచారణ

Publish Date:Jul 24, 2024

Advertisement

జగన్ అక్రమాస్తుల   కేసుల్లో ఇక రోజు వారీ విచారణ జరగనుంది. సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసులు నత్తనడకన నడుస్తున్న సంగతి తెలిసిందే.   రోజువారీ విచారణ చేపట్టాలంటూ సీబీఐ కోర్టును మంగళవారం తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను సత్వరం పూర్తిచేసేలా సీబీఐ కోర్టుకు ఆదేశాలివ్వాలని కోరుతూ మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య గత ఏడాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఆ ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు రోజువారీ విచారణను కొనసాగించాలని సీబీఐ కోర్టుకు విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది.

అంతే కాకుండా  విచారణ ఏ స్థాయిలో ఉందన్న విషయంపై నివేదిక సమర్పించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల  కేసుల విచారణను నిందితులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని హరిరామజోగయ్య తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్ కుమార్ లతో కూడిన ధర్మాసనం మంగళవారం(జులై 22న)  విచారించింది.తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది.  హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు జగన్ అక్రమాస్తుల కేసుల్లో దాఖలైన డిశ్చార్జి పిటిషన్లపై   రోజువారీ విచారణ కొనసాగుతోంది. అరబిందో, హెటిరోలకు భూకేటాయింపులకు సంబంధించి నమోదైన కేసులో రెండో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్ పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. విజయసాయిరెడ్డి తరపు న్యాయవాది జి. అశోక్ రెడ్డి వాదనలు వినిపించగా తదుపరి విచారణ బుధవారానికి వాయిదా పడింది.
ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో ఇక ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని న్యాయనిపుణులు అంటున్నారు. ఇంత కాలం ముఖ్యమంత్రి హోదా కారణంగా కోర్టు హాజరు నుంచి మినహాయింపు పొందిన జగన్ సీఎం పదవి నుంచి దిగిపోవడంతో అనివార్యంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని అంటున్నారు. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
20 వార్డుల్లో 17 స్థానాలు గెలుపు.!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో పెను తుపాను ముప్పును ఎదుర్కొంటోంది.
​కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ ఎన్నికల కౌంటింగ్‌లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా  కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
 పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.