తెరమీద ఆయన చూపిన బొమ్మ.. భారతీయ సినిమాకు ప్రాణం పోసింది..!

Publish Date:Feb 15, 2025

Advertisement

 


దాదాసాహెబ్  ఫాల్కే అవార్డ్.. చాలా మంది నటుల కల ఇది.  భారతీయ చలనచిత్ర పితామహుడిగా పిలువబడే దాదాసాహెబ్ ఫాల్కే గుర్తుగా, ఆయన గౌరవార్థం ఈ అవార్డును ఎంపిక చేసిన నటులకు ఇస్తుంటారు.   చలనచిత్ర పరిశ్రమలో దాదాసాహెబ్ తిరుగులేని వ్యక్తి. ఆయన భారతీయ సినిమాను విప్లవాత్మకంగా మార్చారు.  భవిష్యత్ చిత్రనిర్మాతలకు సృజనాత్మక నైపుణ్యాన్ని అందివ్వడంలోనూ,  చలనచిత్ర రంగాన్ని అబివృద్ది చేయడానికి తగిన అణ్వేషనలు జరపడంలోనూ ఈయన వేసిన మొదటి అడుగే తదుపరి వారికి మార్గం చూపింది.  ఫిబ్రవరి 16 వ తేదీన దాదాసాహెబ్ ఫాల్కే మరణించారు.  ఈ సందర్బంగా ఆయన గురించి చాలామందికి తెలియని విషయాలు,  విశేషాలు తెలుసుకుంటే..

 దుండిరాజ్.. దాదాసాహెబ్..

దాదాసాహెబ్ ఫాల్కేగా ప్రసిద్ధి చెందిన ఈయన అసలు పేరు  ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే. ఏప్రిల్ 30, 1870న మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్‌లో జన్మించారు. ఆయనకు చిన్నప్పటి నుంచీ కళలపై ఆసక్తి ఉండేది.   ఈయన చాలా కళలు అభ్యసించారు. విద్య పూర్తి చేసిన తర్వాత ఫోటోగ్రాఫర్ గానూ,  డ్రాఫ్ట్స్‌మన్‌గా పనిచేయడం ప్రారంభించారు. తరువాత ఫాల్కే ప్రింటింగ్ వ్యాపారంలోకి అడుగుపెట్టి బొంబాయిలో  తన సొంత ప్రింటింగ్ ప్రెస్‌ను స్థాపించారు. ఈ అనుభవం ఆయన భవిష్యత్ చిత్రనిర్మాణ వృత్తిని రూపొందించడంలో కీలక పాత్ర పోషించింది.


ఆసక్తికర ప్రయాణం..

1911లో ఫాల్కే "ది లైఫ్ ఆఫ్ క్రైస్ట్" అనే మూకీ చిత్రాన్ని చూశారు. ఇది  ఆయన జీవితాన్ని మార్చేసింది.  చిత్రకళతో ఆయనకు సంబంధం దీని వల్లనే ఏర్పడింది. ఆ చిత్రం ఆయనపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.  చిత్రనిర్మాణంపై ఆయన మక్కువను రేకెత్తించింది.  ఈ ఆకర్షణ, ఈ ఆసక్తితోనే ఆయన చిత్రనిర్మాణంలోకి ప్రవేశించాలని అనుకున్నారు. అయితే ఆ సమయంలో భారతదేశంలో చిత్రనిర్మాణానికి సౌకర్యాలు,  మౌలిక సదుపాయాలు లేవు. అయినా సరే  నిరుత్సాహపడకుండా ఫాల్కే చిత్రనిర్మాణ పద్ధతులు,  పరికరాల గురించి మరింత తెలుసుకోవడానికి లండన్‌కు వెళ్లారు. ఆయన సంపాదించిన  జ్ఞానం, చిత్రనిర్మాణంపై ఆయనకున్న  దృఢ సంకల్పంతో దేశంలో చలనచిత్ర నిర్మాణాన్ని స్థాపించాలనే  లక్ష్యంతో  భారతదేశానికి తిరిగి వచ్చారు.

భారతదేశంలో సవాళ్లు..

1920,  1930లలో దాదాసాహెబ్ ఫాల్కే ఆర్థికంగానూ,  సాంకేతికంగానూ  చాలా సవాళ్లను ఎదుర్కొన్నారు. అయితే ఈ అడ్డంకులు ఆయనను చిత్రనిర్మాణంపై తనకున్న మక్కువను ఆపలేకపోయాయి. ఫాల్కే 1913లో విడుదలైన భారతదేశపు మొట్టమొదటి పూర్తి నిడివి చలనచిత్రం " రాజా హరిశ్చంద్ర "తో సహా అనేక విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించి నిర్మించారు. ఈ సంచలనాత్మక చిత్రం భారతీయ సినిమా ప్రారంభానికి నాంది పలికింది.  భవిష్యత్ చిత్రనిర్మాతలు వారిలో ఉన్న సృజనాత్మకత వెలికితీయడానికి   పునాది వేసింది.

మరణం.. వారసత్వం..

దాదా సాహెబ్ ఫాల్కే ఫిబ్రవరి 16, 1944న మరణించారు. ఆయన ఒక అద్భుతమైన వారసత్వాన్ని భారతదేశానికి అందించారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన కృషి  గుర్తుగా నేటికీ ఆయన మరణాన్ని,  జయంతిని ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. ఆయన గౌరవార్థం భారత ప్రభుత్వం  దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు స్థాపించింది.  భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని వ్యక్తులకు వారి అత్యుత్తమ సేవలకు ఇచ్చే అత్యున్నత గౌరవాలలో ఇది ఒకటి. ఫాల్కే మార్గదర్శక ప్రయత్నాలు భారతీయ చలనచిత్ర పరిశ్రమను స్థాపించడమే కాకుండా  భారతీయ సాంస్కృతికతను,  భారతీయ విలువలను ప్రజలకు తెలిజేయడంలో సహాయపడ్డాయి. ఇప్పటికాలంలో సినిమా అనేది చాలా శక్తివంతమైన సాధనంగా మారడం వెనుక దాదాసాహెబ్ కృషి, ఆయన వేసిన మొదటి అడుగు ఉన్నాయి.  భారతీయ విలువలను పరిరక్షించడానికి,  ప్రోత్సహించడానికి సహాయపడే భారతీయ పురాణాలు, ఇతిహాసాలు,  కథలను ఆయన సినిమాలుగా రూపొందించారు.

అంతిమంగా..

ప్రింటింగ్ ప్రెస్ యజమాని నుండి భారతీయ సినిమా పితామహుడిగా మారే వరకు దాదాసాహెబ్ ఫాల్కే ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం. ఆయన అంకితభావం, అభిరుచి,  దార్శనికత నేడు మనకు తెలిసిన భారతీయ చిత్ర పరిశ్రమకు పునాది వేసింది.    తెర మీద ఆయన చూపిన బొమ్మ దాదాసాహెబ్ చేసిన మ్యాజిక్కే..!


                           *రూపశ్రీ.

By
en-us Political News

  
భారతదేశంలో ధనికుల కంటే పేదవారే ఎక్కువ.  పేదవారిలో కూడా చాలా పేదవారు,  ఒక మోస్తరు పేదవారు అని కూడా ఉంటారు. అయితే కాలం ఎంత గడిచినా జీవితాలలో ఏ మాత్రం మార్పు లేకుండా పేదవారిగానే ఉండిపోయే...
పిల్లలు జీవితంలోని ప్రతి దశలో  ఆత్మవిశ్వాసంతో, బాధ్యతాయుతంగా నిలబడాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. నేటికాలంలో మంచి పేరెంటింగ్ అంటే కేవలం మంచి విద్యను అందించడం లేదా..
వేసవికాలం అనగానే మండే ఎండలు గుర్తుకు వస్తాయి.  ప్రతి ఏడాది ఈ ఎండల ప్రభావం పెరుగుతూనే ఉంటోంది. ఈ కారణంగానే చాలామంది ఇళ్లలో ఏసీలు పెట్టించుకుంటారు.  అయితే ఏసీ పెట్టించుకునే అంత స్తోమత లేనివారు కనీసం కూలర్ అయినా...
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు , రెండు విభిన్న మనస్తత్వాల కలయిక కూడా.  పెళ్లి తర్వాత ప్రతి జంట తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది..
నేటి కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా జిమ్ వెళ్లేవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు...
మీ జుట్టు మీ అందానికి ఒక కిరీటం వంటిది. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, కాలుష్యం మరియు రసాయనాల వాడకం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటోంది. మీ జుట్టును ఒత్తుగా, పొడవుగా మరియు ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం...
ప్రేమించిన వారిని వదిలి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నారా? మీ జీవితం మరియు మీ భాగస్వామి భవిష్యత్తు కోసం ఈ విషయాలు తప్పక తెలుసుకోండి...
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance). మనం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ మీ హార్మోన్లు పంపే సంకేతాలు కావచ్చు...
పుట్టిన తర్వాత పిల్లలు పెద్దగా అయినా.. వారు చదువులు పూర్తయ్యి,  పెళ్ళి చేసుకుని, వారు కూడా పిల్లలను కన్నా సరే.. తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లలు ఎంతవాళ్లైనా ఇంకా చిన్న పిల్లలు గానే అనిపిస్తూ ఉంటుంది...
జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విజయం కొందరే సాధిస్తారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి...
భారతీయుల ఇళ్లలో చాలా వరకు కరివేపాకు మొక్క పెంచుతూ ఉంటారు. ఇంటి బయట ఏ మాత్రం కాస్త స్థలం ఉన్నా సరే.. మొదటగా కరివేపాకు మొక్కనే పెంచుతూ ఉంటారు. కరివేపాకు మొక్క ఎదుగుదలకు కూడా భారతీయ...
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే..
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.