Publish Date:Jul 10, 2019
మాజీ పీసీసీ అధ్యక్ష్యుడు టీఆర్ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్ ఈరోజు ఢిల్లీలో జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరుకావడం ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆ పార్టీ ఎంపీ ఆ పార్టీ మీటింగ్ కి వస్తే ఆశ్చర్యం ఏముంది అని అనుకోవచ్చు ! కానీ ఆయన చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడని డిఎస్‌పై ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నేతలు ఆయనపై కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుపై వివరణ ఇచ్చేందుకు ఆయన కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. కానీ, కేసీఆర్ మాత్రం ఆయనకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. దీన్తి ఆయన తను ఏదైనా తప్పు చేస్తే తనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కానీ, ఆయనపై పార్టీ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయినా అప్పటి నుండీ పార్టీకి దూరంగా ఉంటూనే వచ్చారు. ఈ మధ్య జరిగిన లోక్ సభ ఎన్నికల్లో డిఎస్ తనయుడు అరవింద్ బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్ధి కవితపై విజయం సాధించారు. అరవింద్ గెలుపు వెనుక డిఎస్ కీలకంగా వ్యవహరించారని ఎన్నికల సమయంలో తన పాత పరిచయాలను డిఎస్ వినియోగించుకొని కొడుకు విజయం కోసం పనిచేశారనే ప్రచారం కూడ సాగింది.
ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ కూడ సహకరించిందని కూడా ఇంటలిజెన్స్ కి సమాచారం. అలాంటి శ్రీనివాస్ ఈరోజు జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి డిఎస్ హాజరుకావడం మాత్రం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కల్గిస్తోంది. నిజానికి నిబంధనల ప్రకారండీఎస్‌పై అనర్హతా వేటు వేయడానికి ఆయన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీలకు రాకపోవడాన్ని ఓ కారణంగా చూపించాలనుకున్నట్లు తెలిసినందునే డీఎస్ ఈ మీటింగ్ కు హాజరయ్యారని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/d-srinivas-shocks-trs-by-attending-parliamentary-meeting-39-87941.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.