పెళ్లి పేరుతో మోసం: రూ. 10 లక్షలకు కుచ్చుటోపీ.!

Publish Date:Nov 28, 2026

Advertisement

ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నకిలీ ఖాతా సృష్టించి, తాను వైద్యుడినంటూ పరిచయం చేసుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించి 24 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని నుంచి రూ.10.05 లక్షలు కాజేసిన సైబర్ మోసగాడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో నిందితుడు జాజుల గుణవంత్‌తో పాటు అతనికి సహకరించిన తల్లి పటూరి సురేఖను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. బాధితురాలి నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని నగదు, బంగారు ఆభరణాలు, క్రెడిట్ కార్డు రుణం రూపంలో భారీగా సొమ్ము దండుకున్న తీరు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం మేరకు నిందితుడు జాజుల గుణవంత్ గిటారిస్ట్,  మోడల్‌కు సంబంధించిన ఫొటోలతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను రూపొందించాడు. ఆ ప్రొఫైల్ ద్వారా 24 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో పరిచయం పెంచుకుని, తాను డాక్టర్‌నని నమ్మించాడు. మాటలతో మాయ చేసి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. ఆ తర్వాత పెళ్లి ప్రతిపాదన తీసుకురావడంతో బాధితురాలు అతడి మాటలను పూర్తిగా నిజమని నమ్మింది.

వివాహ బంధంపై విశ్వాసం కలిగిన తర్వాత నిందితుడు దశలవారీగా ఆర్థిక మోసానికి తెరలేపాడు. ఇంట్లో అత్యవసర పరిస్థితులు తలెత్తాయంటూ చెబుతూ బాధితురాలి నుంచి పలు దఫాలుగా డబ్బులు వసూలు చేశాడు. అంతేకాకుండా, బంగారు ఆభరణాలను రాపిడో కొరియర్ సేవల ద్వారా పంపించాలని ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చాడు. మరోవైపు బాధితురాలికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు వివరాలను దుర్వినియోగం చేసి రూ.2.16 లక్షల రుణాన్ని పొందాడు.

ఈ మొత్తం మోసంలో నిందితుడి తల్లి పటూరి సురేఖ కూడా సహకారం అందించినట్లు పోలీసులు గుర్తించారు. పెళ్లి సంబంధం నిజమేనని బాధితురాలిని నమ్మిస్తూ కుమారుడి మోసాలకు అండగా నిలిచింది. అయితే తనకు జరిగిన మోసాన్ని ఆలస్యంగా గ్రహించిన బాధితురాలు  సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు   చేసి గుణవంత్‌తో పాటు అతని తల్లిని అరెస్టు చేశారు.

ఇది కూడా చదవండి:

నిందితుడి నుంచి సేకరించిన సమాచారం మేరకు బంజారాహిల్స్‌లోని గుప్తా ఆర్ట్స్ అండ్ జ్యువెలర్స్ లో తాకట్టు పెట్టిన 20 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో జాజుల గుణవంత్‌పై గతంలోనూ  20 లక్షల రూపాయల  మ్యాట్రిమోనియల్ మోసం కేసులో ఆరోపణలు ఉన్నట్లు తేలింది. ఈ కేసులో మరో నిందితుడు, గుణవంత్ బంధువైన బొరుగుంట లోకేష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

మీకు నచ్చవచ్చు: 

[Cyberabad Cyber ​​Crime, Matrimonial Fraud, Instagram, credit card, Cybercrime, SoftwereEngineer, LoveCheat, TeluguOne] 

By
en-us Political News

  
హైదరాబాద్ ఎడ్యుకేషనల్ అకాడమీ, మా లక్ష్మి గ్రూప్ చైర్మన్ హరీష్ చంద్ర ప్రసాద్ యార్లగడ్డ.. దాదాపు 500 ఏళ్ల విద్యా వారసత్వం కలిగిన సంస్థను అమరావతికి తీసుకురావడం కేవలం ఒక పాఠశాల నిర్మాణానికే పరిమితం కాదని, ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ తరాల వికాసంతో పాటు రాజధాని నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చే దీర్ఘకాలిక పెట్టుబడిగా అభివర్ణించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పర్యటించారు. అక్కడ కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో  సతీమణి నారా భువనేశ్వరితో కలిసి పాల్గొన్నారు.
ప్రముఖ హెల్త్‌కేర్ టెక్నాలజీ సంస్థ యాక్సెస్ హెల్త్‌కేర్ వ్యవస్థాపకుడు,  వైస్ ఛైర్మన్‌ ఈ వర్ధమాన్ జైన్. వ్యాపార రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ఆయనకు   ఆధ్యాత్మిక, సామాజిక సేవ కార్యక్రమాల్లోనూ ముందుంటారు. ఏకకాలంలో మానవ సేవా, మాధవ సేవా చేస్తుంటారు.
చెన్నై నగరానికి చెందిన వర్ధమాన్ జైన్ తిరుమల తిరుపతి దేవస్థానం   ఈవో ని కలిసి, తాను సమర్పిస్తున్న బంగారు ఆభరణాలకు సంబంధించిన అధికారిక పత్రాలను అందజేశారు. ఆభరణాల అప్పగింతకు సంబంధించిన నిబంధనలు, ధృవీకరణ ప్రక్రియలో భాగంగా ఈ డాక్యుమెంట్లను ఈవోకు సమర్పించారు.  
కఠినమైన చికిత్సల మధ్య కూడా బాలిక ముఖంలో చిరునవ్వు, ఆసుపత్రి సిబ్బంది చూపిన మానవీయ కోణం ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. వైద్యుల అంకితభావం వల్లే ప్రాణాలు నిలిచాయంటూ   ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రపంచ వారసత్వ వారోత్సవాల్లో భాగంగా ఆయన మంగళవారం (నవంబర్ 24) అమ్రాబాద్, ఉడుమిల్ల పరిసరాల్లో పర్యటించారు. అమ్రాబాదు శివాలయంలో కాకతీయుల కాలపు అత్యంత కళాత్మకమైన నంది విగ్రహం, ఆలయం వెనుక, ప్రాకారంగోడ పక్కనే మట్టిలో కూరుకు పోయిందన్నారు.
 భక్తులు గోదావరి, కృష్ణా వంటి పుణ్యనదుల స్నానఘట్టాల వద్దకు చేరుకుని పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. స్నానాల అనంతరం కార్తిక దీపాలను వెలిగించి, నదీ జలాల్లో వదులుతూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు.
డిసెంబర్ 20న వైకుంఠ ఏకాదశి కావడంతో, ఆ తేదీ నుంచి డిసెంబర్ 29వ తేదీ వరకు మొత్తం పది రోజుల పాటు భక్తులకువైకుంఠ ద్వారం ద్వారా భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించనున్నట్లు  టీటీడీ ప్రకటించింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 16 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి.  సంస్థ కార్యాలయాలు, సంబంధిత ప్రాంగణాలతో పాటు డైరెక్టర్ల నివాసాల్లోనూ అధికారులు విస్తృతంగా పరిశీలన జరిపారు.
ఈ పురాతన క్షేత్రంలో భారీ మర్రి, రావి చెట్ల వేర్లు, ఊడల తొర్రలో శివలింగ రూపం కనిపించడం ఆధ్యాత్మిక విశేషంగా నిలుస్తోంది. కార్తీక మాసంలో  స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఈ క్షేత్రాన్ని సందర్శించి పునీతులౌతారు.
అర్ధరాత్రి  దాటిన తర్వాత కూడా భారీ శబ్దాలు వచ్చేలా టపాసులు కాలుస్తూనే ఉన్నారని పేర్కొన్న రేణూ దేశాయ్ పండుగ రోజుల్లో తాను ఏదైనా మాట్లాడితే అనవసరంగా తనను హిందూ వ్యతిరేకిగా ముద్ర వేస్తారనే భయంతోనే  దీపావళి రోజు తాను మౌనంగా ఉన్నానన్నారు.,
. తామిరువురం పరస్పర అవగాహనతో ఒకరిపై ఒకరుసంపూర్ణ గౌరవంతో విడిపోతున్నామని వారా ప్రకటనలో పేర్కొన్నారు.   తమ వివాహ బంధం ఒక ముగింపునకు వచ్చిందని పవన్, అన్నా ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. భార్యాభర్తలుగా తమ విడిపోయినప్పటికీ స్నేహితులుగా  కలిసే ఉంటామని పేర్కొన్నారు.
మీమ్ పేజీలు, మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెళ్లు,  సోషల్ మీడియా యూజర్లు ఎవరైనా సరే ఈ వైరల్ కంటెంట్‌ను రీపోస్ట్ చేయడం, అప్‌లోడ్ చేయడం,  షేర్ చేయడం తక్షణమే ఆపాలని సురేఖ వాణి  పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.