ముర్ము స్వగ్రామానికి వెలుగొచ్చింది

Publish Date:Jun 27, 2022

Advertisement

రాజ్యంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్, చిన్న తనంలో గుడ్డి దీపాల వెలుగులో చదువుకుని  అంత గొప్పవాడయ్యారు, అని మనం గొప్పగా చెప్పు కుంటాం... అలాగే ఇంకా ఎందరో  పెద్దలు , స్వాతంత్ర సమర యోధులు ఎన్నో కష్టాలు అనుభవించి ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. దేశ సేవలో తరించారు అలాంటి అందరూ మనకు ప్రాతః స్మరణీయులు,కానీ, దేశానికీ స్వతంరం వచ్చి, 75 ఏళ్ళు పూర్తయి, అమృత మహోత్సవ్ ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్న సమయంలో, ఇప్పటికీ దేశంలో విద్యుత్ సదుపాయం, కనీస వసతులు  లేని అనాధ గ్రామాలు ఉన్నాయంటే ఆశ్చర్యం అనిపిస్తుంది.

అందునా, అలాంటి  అనాధ గ్రామాల్లో, అధికార ఎన్డీఏ కూటమి తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీలో ఉన్న ద్రౌపదీ ముర్ము స్వగ్రామం కూడా ఉందంటే, ఆశ్చర్యంతో పాటుగా కొంచెం చాలా అవమానం కూడా అనిపిస్తుంది. కానీ, అది నిజం.  నిజానికి, దేశంలోని ఎన్నో చీకటి గ్రామాల కథల్లానే, ఈ గ్రామం కథ కూడా ఇప్పటికీ,  ఎప్పటికీ  చీకటిలోనే ఉండి పోయేది కావచ్చు, కానీ, ద్రౌపది ముర్మును బీజేపీ / ఎన్డీఎ కూటమి రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించడంతో ఆ గ్రామం జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచింది. మీడియా దృష్టిని ఆకర్షించింది. అయితే, అక్కడికెళ్ళిన మీడియా ప్రతినిధులు, రాష్ట్రపతి అభ్యర్ధి స్వగ్రానికి  కరెంటు లేదని తెలిసి, కరెంట్ తాకకుండానే  షాక్ కు గురయ్యారు. 

ద్రౌపదీ ముర్ము స్వగ్రామం..ఓ శివారు గ్రామం. ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతంలో రెండు శివారు గ్రామాలు కలిసిన,  ఉపర్బెడా గ్రామం. ఈ గ్రామంలో  దాదాపు 3500 జనాభా నివసిస్తున్నారు. అందులో, బాదషాహి శివారు గ్రామానికి విద్యుత్ సదుపాయం ఉంది. కానీ, కేవలం 14 కుటుంబాలు మాత్రమే ఉన్న దున్గురుషాహి  శివారు గ్రామానికి మాత్రం విష్యత్ సదుపాయం లేదు.,ఆ శివారు గ్రామం దశాబ్దాలుగా చీకటిలోనే మగ్గుతోంది. ఆ గ్రామమే ముర్మూ స్వగ్రామం.అయితే, ప్రస్తుతం ఆమె అక్కడ నివసించడం లేదు. ఆ గ్రామానికి 20కి.మీ దూరంలో ఉన్న పట్టణానికి కొన్ని దశాబ్దాల క్రితమే మకాం మార్చారు.  అయినప్పటికీ ముర్ము మేనల్లుడు బిరాంచి నారాయన్‌ తుడు ఆయన భార్య, ఇద్దరు పిల్లలతో అక్కడే నివసిస్తున్నారు. ముర్మూ కూడా పండగలు, పబ్బాలకు గ్రామానికి వచ్చి పోతూనే ఉంటారని, ఆమె మేనల్లుడు తెలిపారు. గ్రామానికి విద్యుత్ లేని విషయాన్ని ఎన్నోసార్లు విన్నవించినప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోలేదని, బిరాంచి భార్య, ఇతర గ్రామస్తులు  వాపోయారు. ఎన్నికల సమయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరికీ, ఎన్ని విజ్ఞాపన పత్రాలు అందించిన ఫలితం లేదని చెప్పుకొచ్చారు.

అయితే ఇప్పడు, రాష్ట్రపాటి అభ్యర్ధి గ్రామానికి విద్యుత్ లేదనే వార్త భగ్గుమండంతో  ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే ఆ గ్రామానికి కరెంటు వసతి కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఉత్తర ఒడిశా విద్యుత్‌ పంపిణీ సంస్థ అధికారులు 24 గంటల్లోగా గ్రామం మొత్తానికి విద్యుత్‌ వసతి అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, గుంతలు తవ్వే యంత్రాలతో అక్కడకు చేరుకొని యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టారు. దీంతో ఎన్నో ఏళ్లుగా పడుతున్న బాధలకు ఇప్పుడు మోక్షం లభించిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలాఉంటే, మయూర్‌భంజ్‌ జిల్లాలో ఇప్పటికీ ఓ 500 గ్రామాలకు సరైన రోడ్లు, 1350 గ్రామాలకు కరెంటు వసతే లేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే, ఈ గ్రామానికి చెందినవారు గతంలో ఎంపీలు, మంత్రులుగా పనిచేశారు. మాజీ ఎంపీలు సల్ఖాన్‌ ముర్ము, భబేంద్ర మాఝీతోపాటు కార్తిక్‌ మాఝీలు కూడా అదే గ్రామానికి చెందిన వారు కావడం కొసమెరుపు.  అయితే, తీగలాగితే డొంకంతాకదిలింది అన్నట్లు, ఈ గ్రామానికి ఇంత కాలం కరెంటు లేక  పోవదానికి, ఆ గ్రామం పట్ల వివక్ష కారణం కాదని, అటవీ భూమిలో నిర్మించిన గ్రామం  కావడం వలన సాంకేతిక అభ్యతరాలు అడ్డుగా నిలిచాయని, అధికారులు చెపుతున్నారు. అయితే, ఇంత కాలం తిష్ట వేసినఅభ్యంతరాలు ఇప్పడు ఏమయ్యాయి.. ? ఎలా తొలిగి పోయాయి? అలాంటి  ప్రశ్నలకు సమాధానలు ఉండవు. అది అంతే.

By
en-us Political News

  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.