Publish Date:Mar 21, 2025
నాగపూర్ లొ మూడు రోజుల అనంతరం కర్ఫ్యూ ఎత్తివేశారు. నాగపూర్ లో ఇటీవల హింసాకాండకు చెలరేగడానికి కారణమైన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం ద్వారా ఘర్షణలకు కారకుడయ్యారన్న ఆరోపణలపై ఫారీమ్ ఖాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మైనారిటీ డెమొక్రటిక్ పార్టీ నాగపూర్ అధ్యక్షుడైన ఫారీమ్ ఖాన్ తో పాటు ఆరుగురిపై దేశ ద్రోహం కేసు నమోదు చేశారు. వీరు కాకుండా మరో 50 మందిపై కూడా కేసులు నమోదు చేశారు. మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధిని తొలగించాలని డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో శంభాజీనగర్‌లోని 18వ శతాబ్దానికి చెందిన ఆయన స్మారకానికి ఇరువైపులా భారత పురావస్తు శాఖ ఇనుప రేకులను, కంచెను ఏర్పాటు చేసింది. పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.
చావా సినిమా విడుదల తరువాత నాగపూర్ లో హింసాకాండ చెలరేగిన సంగతి విదితమే. ఆ సినిమాలో ఛత్రపతి శంభాజీ మహరాజ్ ను మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దారుణంగా హత్య చేసినట్లుగా చూపడంతో జనం కోపోద్రిక్తులయ్యారు. ఆ సినిమా ప్రజల మనోభావాలను రెచ్చగొట్టింది. ఔరంగజేబు సమాధిని తొలగించాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున వినిపించింది. ఈ నేపథ్యంలోనే హింస చెలరేగింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/curfiew-lifted-in-nagpur-25-194811.html
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.