అగ్రెసివ్ పంథాతో పాత కల్ట్ పవన్ కనిపిస్తున్నారు!

Publish Date:Jun 23, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకినాడ వేదికగా ఇటీవల  జరిగిన 'మా ఊరు - మాటామంతి' కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.  వైసీపీ నేతలను ఉద్దేశించి ఆయన అత్యంత అగ్రెసివ్ టోన్‌లో హెచ్చరికలు జారీ చేశారు. వైసీపీ నాయకులు పరిధులు దాటి మాట్లాడుతున్నారని, భవిష్యత్తులో ఏం జరిగినా వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరికలు జారీ చేశారు. 

గత కొన్ని రోజులుగా   సాయికృష్ణ మిస్సింగ్ ఉదంతం నేపథ్యంలో కాపు సామాజిక వర్గ  ఓట్ బ్యాంక్‌ను టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు పేర్ని నాని, అంబటి రాంబాబు చేస్తున్న విమర్శలపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆక్రోశం వెళ్లగక్కారు. తాను కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ, ఒకవేళ భవిష్యత్తులో (రెండేళ్లల్లోనో, మూడేళ్లల్లోనో) వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చినా సరే.. ఒక్కొక్కరిని తొక్కి నారతీస్తానంటూ ఘాటుగా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పవన్ కల్యాణ్ వ్యాఖ్యల వేనుక రాజకీయ వ్యూహం ఏమిటన్న దానిపై తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో..ప్రముఖ అనలిస్ట్ భరధ్వాజ లోతైన విశ్లేషణ చేశారు. 

 పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోందన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇటీవల జరిగిన సుదీర్ఘ భేటీ తర్వాత పవన్ టోన్ పూర్తిగా మారినట్లు స్పష్టమవుతోంది. తాను కేవలం 21 సీట్లు గెలిచిన ఒక ప్రాంతీయ పార్టీ నేతగా మాత్రమే కాకుండా..  కేంద్రంలోని పెద్దల అండదండలు ఉన్న సుపీరియర్ పొజిషన్‌లో ఉన్నాననే సంకేతాన్ని పవన్   పంపించారన్నారు.  తాను ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన ధోరణి సూచిస్తోందని భరద్వాజ అన్నారు.

మరోవైపు, పవన్ కళ్యాణ్ తనను పదేపదే కాపు సామాజిక వర్గానికి మాత్రమే పరిమితం చేయవద్దని వైసీపీ నేతలకు గట్టిగా చెప్పారు. తాను కులాలకు అతీతుడిననీ, ప్రాంతీయవాదానికి అతీతంగా జాతీయ సమగ్రత కోసం పనిచేస్తానని పునరుద్ఘాటించారు. జనసేన పార్టీని ఐదు రాష్ట్రాల్లో విస్తరిస్తున్నామని, రాబోయే రోజుల్లో ఢిల్లీలో జెండా ఎగరేయబోతున్నామని చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టే యోచనలో ఉన్నట్లు కనిపిస్తోందని భరద్వాజ అన్నారు. అదే జరిగితే.. రాష్ట్రంలో ఆయన సోదరుడు నాగబాబుకు కీలక బాధ్యతలు దక్కే అవకాశం ఉందన్నారు. 

ఈ పరిణామాలు కూటమి ప్రభుత్వంలోనూ చర్చకు దారితీస్తున్నాయి. గతంలో హోంమంత్రి అనిత పనితీరుపై పవన్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నిన్నటి సభలోనూ ఆయన  నేను హోం శాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉండేవి కానీ నేను తీసుకోను' అని వ్యాఖ్యానించడం విశేషం. ఈ దూకుడు వ్యవహార శైలి    కల్ట్  పవన్ కళ్యాణ్‌ను తలపిస్తోందని, నిస్తేజంగా ఉన్న జనసైనికుల్లో మళ్లీ కొత్త ఉత్సాహాన్ని నింపేందుకే ఆయన ఈ తరహా అగ్రెసివ్ పంథాను ఎంచుకున్నారనీ భరద్వాజ విశ్లేషించారు. 

By
en-us Political News

  
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.