కారు కొంప ముంచిన ఎల్ఆర్ఎస్! సీఎం హిట్ లిస్టులో సీఎస్ సోమేష్?

Publish Date:Dec 5, 2020

Advertisement

టీఆర్ఎస్ నేతలు భయపడినట్లే జరిగిందా? ధరణి వెబ్ సైటే కారుకు బ్రేకులు వేసిందా? లాండ్ రెగ్యులరైజేషన్ స్కీమే కమలానికి బూస్ట్ ఇచ్చిందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లోనూ ఇదే స్పష్టమైందని తెలుస్తోంది. గ్రేటర్ ఫలితాలపై విశ్లేషించుకున్న టీఆర్ఎస్ నేతలు కూడా ఎల్ఆర్ఎస్, ధరిణి వెబ్ సైట్ అంశాలు ఓటింగులో తీవ్ర ప్రభావం చూపాయనే అంచనాకు వచ్చారట. గులాబీ బాస్ కేసీఆర్ సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారంటున్నారు. అందుకే ఆయన ధరణి వెబ్ సైట్, ఎల్ఆర్ఎస్ ప్రతిపాదన తెచ్చిన సీఎస్ సోమేష్ కుమార్ పై ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నారు. సీనియర్లను కాదని నమ్మకంతో తెచ్చుకుంటే.. ప్రభుత్వానికి ప్రజల్లో చెడ పేరు రావడానికి కారణమయ్యారనే నిర్ణయానికి సీఎం వచ్చినట్లు తెలుస్తోంది. సీఎస్ ను మార్చే అవకాశముందని కూడా ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

 

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్ర నగర్ నియోజకవర్గాల్లో కారు పార్టీ ఖాతానే తెరవలేదు. ఈ నియోజకవర్గాల పరిధిలోని 18 డివిజన్లలోనూ ఘోరంగా ఓడిపోయారు టీఆర్ఎస్ అభ్యర్థులు. ఉప్పల్, మల్కాజ్ గిరి నియోజకవర్గాల్లో అధికార పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు. ఈ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఓటమికి ఎల్ఆర్ఎసే ప్రధాన కారణమని చెబుతున్నారు. ఇక్కడ ఉండేవారంతా ఎల్ఆర్ఎస్ సమస్యను ఫేస్ చేసినవారేనంటున్నారు. శివారు ప్రాంతాల్లో రియల్ వ్యాపారం చేసే వారంతా  ఎల్బీనగర్ ఏరియాలోనే ఉంటారు. ధరణి వెబ్ సైట్ కోసం రెండు, మూడు నెలలుగా రిజిస్ట్రేషన్లు నిలిపివేసింది ప్రభుత్వం. దీంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎల్ఆర్ఎస్ స్కీంతో గతంలో జరిగిన ల్యాండ్ విక్రయాలు ఇబ్బందుల్లో పడ్డాయట. సర్కార్ స్పష్టించిన ఈ కొత్త సమస్యలతో వారంతా కేసీఆర్  పై కసిగా ఉన్నారంటున్నారు.  అదంతా గ్రేటర్ ఫలితాల్లో కనిపించిందని చెబుతున్నారు. 

 

వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు కామన్ ఫ్లాట్‌ఫాంగా ధరణిని రూపొందించాలని ప్రభుత్వం భావించింది. ఈ టాస్కును సీఎస్ చేపట్టారు. ఎల్ఆర్ఎస్ , ధరణి వెబ్ సైట్ ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ కు సీఎస్ సోమేష్ కుమారే చెప్పినట్లు తెలుస్తోంది. ఎల్ఆర్ఎస్ ద్వారా ఆదాయం పెరుగుతుందని, ధరణి ద్వారా దేశంలోనే ఆదర్శనీయంగా ఉండే నూతన వ్యవస్థకు శ్రీకారం చుట్టవచ్చని సీఎస్ కల్పించిన విశ్వాసంతో సీఎం ముందడుగు వేశారని చెబుతున్నారు. ఎల్ఆర్ఎస్ ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ. 20 వేల కోట్ల మేర అదనపు ఆర్థిక వనరులు సమకూరే అవకాశం ఉందని సీఎంకు సీఎస్ సోమేష్ ప్రతిపాదించారని అంటున్నారు. అంతేకాదు ధరణి వెబ్‌సైట్ రూపకల్పన మొదలు ట్రయల్ రన్ వరకు అంతా సీఎసే చూసుకున్నారు. రెవెన్యూ ఉద్యోగుల నుంచి భిన్నాభిప్రాయం వచ్చినా వెనక్కు తగ్గలేదు. ఎల్ఆర్ఎస్ ప్రకటించిన తర్వాత విపక్షాల నుంచే కాక ప్రజల నుంచి కూడా ఊహించని వ్యతిరేకత వచ్చింది. అయినా ప్రభుత్వం ముందుకే పోయింది. ధరణి కోసం వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను కూడా ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో కరోనా కష్టకాలంలో ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం కూడా నిలిచిపోయింది. ప్రజలు కూడా వివిధ అవసరాల కోసం ఆస్తుల్ని అమ్ముకోవడం, భూమిని వదులుకోవాల్సి రావడం లాంటి పనులకు  బ్రేక్ పడింది. 

 

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకం అని భావించిన ధరణి కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ఇప్పటికి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాలేదు. ఇలా ఉండగానే ఎల్ఆర్ఎస్ తేవడంతో ప్రజలకు మరింత కష్టమైంది. కరోనా సమయంలో ఆదాయం తగ్గిపోవడంతో  పొదుపు మంత్రం పాటిస్తున్న సమయంలో ఎల్ఆర్ఎస్ నిర్ణయం తీసుకోవడం ప్రజల అసహనానికి కారణమైంది. చివరకు అది ప్రభుత్వంపై వ్యతిరేకతకు దారితీసింది. దీంతో ధరణితో ఆశించిన ఫలితం రాకపోగా.. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చింది. దీంతో ప్రధాన కార్యదర్శి ప్రతిపాదించిన ఎల్ఆర్ఎస్, ధరణి ప్రాజెక్టులు ఫెయిల్యూర్ అనే అభిప్రాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చినట్లు తెలిసింది. నమ్మకంతో సీఎస్ గా నియమిస్తే ఆయన ఆశించిన మేరకు పని చేయలేకపోయారని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు తెలిసింది. ప్రత్యేకంగా కొత్త చట్టాలను చేసినా సంతృప్తికర ఫలితాలు రాలేదన్న అసంతృప్తిలో ఉన్న సీఎం.. సీఎస్ పై కోపంగా ఉన్నారని  సమాచారం.  ఈ విషయం ఉద్యోగ సంఘాల ప్రతినిధుల వరకూ చేరింది. దీంతో వారు తదుపరి సీఎస్ ఎవరవుతారో అని  కూడా చర్చించుకుంటున్నారయట.

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.