మాస్క్ పెట్టుకోండి సారూ.. ఈ పెద్దోళ్లు ఉన్నారే...

Publish Date:Jan 22, 2022

Advertisement

సీఎస్ సోమేశ్‌కుమార్‌. మోస్ట్ కాంట్ర‌వ‌ర్సియ‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ అనే పేరు. ఆయ‌న తీసుకునే నిర్ణ‌యాలు.. చేసే ప‌నులు ప‌లుసార్లు వివాదాస్ప‌దం అవుతుంటాయి. సీఎం కేసీఆర్‌ను బాగా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తార‌ని.. ముఖ్య‌మంత్రిని ప‌లు అంశాల్లో మిస్ గైడ్ చేసిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయ‌ని ఐఏఎస్ స‌ర్కిల్స్‌లో టాక్‌. పాల‌సీ మేట‌ర్స్ గురించి ప‌క్క‌న పెడితే.. మాస్క్ పెట్టుకోవ‌డం లాంటి చిన్నిచిన్న విష‌యాల్లోనూ సీఎస్ తీరు అసంబ‌ద్దంగా ఉంటుంద‌నే విమ‌ర్శ ఉంది. 

ఓవైపు తెలంగాణ‌లో కొవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. రోజూ వేల‌ల్లో కేసులు వ‌స్తున్నాయి. సాక్షాత్తూ హెల్త్ డైరెక్ట‌ర్‌కే పాజిటివ్ వ‌చ్చింది. క‌రోనా ఇంత సివియ‌ర్‌గా ఉన్న సంద‌ర్భంలో.. అంద‌రికీ ఆద‌ర్శంగా నిల‌వాల్సిన సీఎస్‌, మంత్రి, ఎంపీ.. ఇదిగో ఇలా మాస్క్ లేకుండా మీటింగ్‌కు హాజ‌ర‌వ‌డం కాంట్ర‌వ‌ర్సీగా మారింది. 

సీఎస్‌తో పాటు ఆయ‌న‌ ప‌క్క‌న ఉన్న మంత్రి పువ్వాడ అజ‌య్ సైతం మాస్క్ పెట్టుకోలేదు. ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా మాస్క్ పక్కన పెట్టేశారు. మ‌రోమంత్రి ఎర్ర‌బెల్లి మాత్రం బుద్ధిమంతుడిలా మాస్క్ పెట్టుకున్నాడు. ఎందుకంటే, ఆయ‌నకు ఇటీవ‌లే కొవిడ్ బారినప‌డి కోలుకున్నారు. క‌రోనా సోకితే ఆ పెయిన్ ఎలా ఉంటోందో ఎర్ర‌బెల్లికి బాగా తెలిసిన‌ట్టుంది. అందుకే, సిన్సియ‌ర్‌గా మాస్క్ పెట్టుకున్నారు. సారూ.. మీ ప‌క్క‌నున్న మంత్రికి, సీఎస్‌కు కూడా కుసుంత చెప్ప‌రాదే.. మాస్క్ పెట్టుకోమ‌ని....

ఇక ఈ ఫోటో చూడండి.. ఆ స‌మీక్ష‌కు హాజ‌రైన మిగ‌తా వారంతా మాస్కుల‌తోనే ఉన్నారు. సీఎస్ సోమేశ్‌కుమార్‌, మినిస్ట‌ర్ అజ‌య్‌లు మాత్ర‌మే మాస్కులు పెట్టుకోలేదు. గ్రానైట్ పరిశ్రమ అసోసియేషన్ ప్రతినిధులతో జ‌రిగిందీ స‌మావేశం. ఆ ప్రతినిధులంతా వాళ్ల పార్టీ వ్యాపారులే అనుకోండి అది వేరే విషయం. అయితే, ఆ మీటింగ్ లో ఉన్న వారంతా మాస్కులు పెట్టుకుంటే.. రాష్ట్రానికే చీఫ్ సెక్ర‌ట‌రీ.. మీరు మాత్రం మాస్క్ లేకుండా ఉండ‌టం ఏమాత్రం క‌రెక్ట్ చెప్పండి.. సీఎస్ గారూ.. మిమ్మ‌ల్నే అడిగేది....

గ‌తంలో సీఎస్ సోమేశ్‌కుమార్‌కు ఓసారి కొవిడ్ సోకింది. పాజిటివ్ వ‌చ్చిన రెండు రోజుల‌కే ఓ రివ్యూ స‌మీక్ష నిర్వ‌హించారు. ఆ మీటింగ్‌కు మాస్క్ లేకుండా వ‌చ్చారు. ఆ ఘ‌ట‌నపై అప్ప‌ట్లో తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అంత జ‌రిగినా.. ఆయ‌న తీరు ఏమాత్రం మారిన‌ట్టు లేదు. పెద్ద సారుకు మాస్క్ పెట్టుకోవ‌డం అస‌లేమాత్రం ఇష్టం ఉండ‌దు కాబోలు. లేటెస్ట్‌గా మారోసారి మాస్క్ లేకుండానే ద‌ర్శ‌న‌మిచ్చారు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి. ఎందుకైనా మంచిది, నో మాస్క్‌.. నో ఎంట్రీ.. బోర్డులు మీ ఆఫీసుల్లో కూడా పెట్టుకోండి సార్లూ.. అయినా ఓ డౌట్‌.. మాస్క్ లేక‌పోతే వెయ్యి రూపాయ‌ల ఫైన్ వేస్తారుగా.. మ‌రి, ఈ పెద్దోళ్ల‌కు కూడా వేస్తారా?

ఇక, సీఎస్ సోమేశ్‌కుమార్ ఇటీవ‌ల బాగా బిజీగా ప‌ని చేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న పోస్టింగ్స్ అన్నిటినీ హ‌డావుడిగా క్లియ‌ర్ చేస్తున్నారు. ఆ హ‌డావుడిలో త‌ప్పులు సైతం దొర్లుతున్నాయ‌నుకోండి. జూనియ‌ర్ల కింద సీనియ‌ర్లకు పోస్టింగ్ ఇచ్చి.. ఆ త‌ర్వాత నాలుక క‌రుచుకొని.. ఇచ్చిన జీవోల‌ను మ‌ళ్లీ స‌వ‌రించి.. ఇలా ఆగ‌మాగం అవుతున్నారు. 

మ‌రోవైపు, ఇటీవ‌ల తెలంగాణ హైకోర్టు ప్ర‌భుత్వానికి మొట్టికాయ‌లు వేసింది. జీతం ఇస్తూ పోస్టింగ్ ఇవ్వ‌కుండా ఉంచితే.. ప్ర‌జాధ‌నం దుర్వినియోగం చేసిన‌ట్టేన‌ని గ‌ట్టిగానే చెప్పింది. ఆ మొట్టికాయ‌ల‌తో త‌ల‌బొప్పి క‌ట్టిందో ఏమో.. రెండు మూడు రోజులుగా సీఎస్ సోమేశ్ కుమార్‌.. వెయిటింగ్‌లో ఉన్న వారికి పోస్టింగులు ఇచ్చేస్తున్నారు. దాదాపు ఓ 30 మందికి బాధ్య‌త‌లు ఇచ్చారు. ఆ క‌స‌ర‌త్తు ఇంకా కొన‌సాగుతూనే ఉంది. సీఎస్ గారూ మీరు చేయాల్సిన ప‌ని ఎప్ప‌టిక‌ప్పుడు చేసేస్తే.. ఇంత హ‌డావుడి ప‌డాల్సిన ప‌ని ఉండేది కాదుగా..అంటున్నారు. హైకోర్టు చెబితే గానీ.. మీరు ప‌ని చేయ‌రా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఎంతైనా.. సోమేశా.. మ‌జాకా...! అజ‌య్ గారూ.. నామా గారూ.. మీరు కూడా..!!

By
en-us Political News

  
కాల‌క్ర‌మంలో మొబైల్ ఫోన్ వ‌చ్చి అంద‌రికీ ఆత్మీయం అయి కూర్చుంది. చేతిలో మొబైల్ వుంటే లోక‌మంతా అర‌చేతిలో వున్న‌ట్టే అంటూ యాడ్స్ తో యువ‌త‌ను  విప రీతంగా ఆక‌ట్టుకోవ‌డంలో మొబైల్ కంపెనీలు లాభార్జ‌న బాట‌లో వున్నాయి. ఇపుడు రోజుకో కొత్త ర‌కం  ఐ ఫోన్‌లు చూస్తున్నాం. ఆట‌లు, పాట‌లు, సినిమాలు, సీరియ‌ళ్లు ఒక‌టేమిటి అంతా దానితోనే సాగిపోతోంది.  
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు, సజ్జల రామ కృష్ణా రెడ్డి, ఇంకో కీలక పదవిలో ఇంకొక రెడ్డి .. ఇలా పార్టీలో , ప్రభుత్వంలో అంతటా, ఆ రెండు అక్షరాలదే హవా... ఈమాటలు అన్నది, అంటున్నదీ ఎవరో కాదు, పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలో క్రియాశీలంగా మెలుగుతూ, పార్టీ గెలుపు కోసం శక్తీ వంచన లేకుండా, అహర్నిశలు శ్రమించిన అన్య ‘కుల’ కార్యకర్తలు నాయకులు. ఇందులో ఎస్సీలున్నారు, ఎస్టీలున్నారు. ఓసీ లున్నారు. బీసీలు, మైనారిటీలున్నారు. అందరిలోనూ అసంతృప్తి వుంది. అయినా, ముఖ్యమంత్రి జగన్ రెడీ మాత్రం, అదేమీ పట్టించుకోవడం లేదు. దీంతో ఇప్పడు, అన్య సామాజిక వర్గాల నాయకులు, కార్యకర్తలు పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది.
తెలంగాణ గడ్డపై బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. ముగింపు సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభ బ్రహ్మాండంగా విజయవంతమైంది. మోడీ ప్రసంగించిన ఆ సభకు జనసమీకరణలో రాష్ట్ర బీజేపీ విజయవంతమైంది. ప్రధాని మోడీ కూడా సభకు హాజరైన జనసందోహాన్ని చూసి ఉబ్బితబ్బిబ్బయ్యారు. సభా నిర్వహణ భేష్ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను భుజం తట్టి మరీ అభినందించారు. అదీ సభా వేదికపైనే. ఇది బండికి అనుకోని కానుక. అగ్రనేత, అందునా ప్రధాని మోడీ నుంచి భుజం తట్టి అభినందన అందుకోవడంతో ఆయన ఆనందం పట్టలేకపోయారు. కన్నీటి పర్యంతమయ్యారు.
అత్తమీద కోపం దుత్త మీద చూపించాడన్నది సామెత. కానీ ఢిల్లీకి చెందిన ధరమ్ వీర్ దహియా కుక్క మీద కోపం ఆ కుక్క యజమానుల మీద చూపించాడు. అలాగని కుక్కనూ వదిలేయలేదు. దానిమీదా దాడి చేసి తన కోపం తీర్చుకున్నాడు. మనిషిలోని పశుత్వానికి పరాకాష్టగా నిలిచే ఈ సంఘటనకు ఢిల్లీ వేదిక అయ్యింది. ఢిల్లీలోని పశ్చిమ విహార్ లో నివసించే ధరమ్ వీర్ దహియా ఉదయాన్నే వాకింగ్ కు వెళుతుంటే.. పొరుగింటి వారి కుక్క అతడిని చూసి మొరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్’ కు గత కొంత కాలంగా దెబ్బ మీద దెబ్బ వరసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. జాతీయ స్థాయిలో రాజకీయాలను ప్రభావితం చేయాలనే ఆలోచన వచ్చింది మొదలు, ప్రతి అడుగులో అవరోధాలు,అవమానాలు ఎదురవుతున్నాయి. ప్రాంతీయ పార్టీలను కలుపుకుని, కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యాన్మయంగా ప్రాంతీయ పార్టీల జాతీయ ఫ్రంట్ ఏర్పాటు చేసిన ప్రయత్నాలు ఫలిచలేదు. జాతీయ పార్టీ, జాతీయ ప్రత్యాన్మాయ ప్రణాళిక ఆలోచనలు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఫార్మ్ హౌస్ గడప దాట లేదు.మరోవంక వరితో మొదలైన కేంద్రం పై యుద్ధం ఆశించిన ఫలితం సాధించలేక పోయింది. ఇక ఇప్పడు తాజాగా, రాష్ట్ర రాజధాని, భాగ్యనగరంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలనే నిర్ణయం జరిగిన మరు క్షణం నుంచి, కేసీఆర్, కేటీఆర్ బీజేపీని బద్నాం చేయడమే ధ్యేయంగా పావులు కదుపుతూ వచ్చారు. అయితే చివరాఖరుకు, కథ అడ్డం తిరిగింది. బీజేపీని, ప్రధాని మోడీని బద్నాం చేసేందుకు, ఫ్లెక్సీల యుద్ధం చేసినా, రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేస్తున్న ప్రతిపక్షాల ఉమ్మడి అభ్బ్యర్ది యశ్వంత్ సిన్హా తీసుకొచ్చి హడావిడి చేసినా, అదే అదనుగా ప్రధాని మోడీ పై ‘’సేల్స్ మ్యాన్’ వంటి విమర్శలు చేసినా, జాతీయ, అంతర్జాతీయ విషయాలు అన్నింటినీ కలబోసి ప్రశ్నలు సంధించినా, చివరకు, వృధా ప్రయాసే మిగిలిందని, తెరాస నేతలే ముఖం చిన్నబుచ్చుకుంటున్నారు.
బీజేపీ. జనసేనల మధ్య దూరం పెరిగిందా? ప్రధాని మోడీ భీమవరం పర్యటనకు, ఆయన పాల్గొనే భారీ బహిరంగ సభకు జనసేనాని పవన్ కల్యాణ్ కు అందుకే ఆహ్వానం అందలేదా? అన్న ప్రశ్నలకు రాజకీయ పండితులు ఔననే సమాధానం ఇస్తున్నారు. ఇప్పటి కిప్పుడు ఆ రెండు పార్టీలూ కూడా తమ మధ్య మైత్రి చెడిందని బహిరంగంగా ప్రకటించకపోయినా.. జనసేన, బీజేపీల మధ్య సంబంధాలు బెడిసాయనడంలో ఎటువంటి సందేహం లేదని వారు నొక్కి వక్కాణిస్తున్నారు. ప్రధాని మోడీ ఏపీలో పర్యటిస్తున్నా..జనసేనాని పవన్ కల్యాణ్ ఆ ఛాయలకు కూడా వెళ్లకపోవడాన్ని ఇందుకు నిదర్శనంగా వారు చూపుతున్నారు. తాను భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వెళ్లలేకపోవడానికి బిజీ షెడ్యూల్ కారణమని పవన్ కల్యాణ్ చెబుతున్నా.. ఇరు పార్టీల మధ్యా సఖ్యత ఉండి ఉంటే షెడ్యూల్ మార్చుకునైనా పవన్ కల్యాణ్ హాజరై ఉండేవారని వారు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి అల్లూరి విగ్రహావిష్కరణకు పవన్ హాజరౌతారనీ, మోడీతో వేదిక పంచుకుంటారనీ మొదటి నుంచీ జనసేన వర్గాలు చెబుతూ వస్తున్నాయి. అయితే ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై బీజేపీ, జనసేనల మధ్య జరిగిన మాటల యుద్ధంతో ఇరు పార్టీల మధ్యా సఖ్యత చెడింది. ఆ తరువాతే పవన్ కల్యాణ్ వరుస కార్యక్రమాలతో బిజీ అయ్యారు.
మొత్తానికి బిజెపి యావ‌త్ సైన్యం వ‌చ్చి చేసిన త‌ప్పుడు ప్ర‌చారాలు, ఊక‌దంపు ప్ర‌సంగాల వ‌ల్ల తెలంగా ణాకు, టిఆర్ ఎస్‌కు వ‌చ్చే న‌ష్టం శూన్యం.  ప్ర‌తిగా బిజెపీ వ‌ర్గాలే న‌ష్ట‌పోయే అవ‌కాశాలున్నాయి. తెలం గాణా ఏర్పాట‌యిన‌ప్ప‌టి నుంచి కేంద్రం పెద్ద‌గా స‌హ‌క‌రించిందేమీ లేద‌ని, ఇపుడు మ‌రింత రాజ‌కీయ వైఫల్యాన్ని బిజెపీ స్వ‌యంగా ఇంత దూరం వ‌చ్చి తెలంగాణాలో బ‌య‌ట‌ప‌డ‌టం ప‌ట్ల అంతా న‌వ్వుకుం టున్నారు
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా భీమవరంలో సోమవారం జరగనున్న అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జరిగే సభలో స్థానిక ఎంపీ రఘురామకృష్ణం రాజుకు చోటు లేదని తేలిపోయింది. ఈ సభలో వేదికపై కూర్చునే ప్రముఖుల పేర్లు ఖరారయ్యాయి. వారిలో రఘురామకృష్ణం రాజు పేరు లేదు. ప్రధాని సభలో ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎంపీకి అవకాశం ఉండాలి. అయితే అందుకు భిన్నంగా సభలో ప్రధానితో పాటు వేదికపై కూర్చునే ప్రముఖుల పేర్లలో రఘురామకృష్ణం రాజు పేరు లేదు.
తెరాస పార్టీకి ఇప్పుడు సొంత గడ్డ తెలంగాణలోనే ఎదురుగాలి వీస్తున్నదా అన్న ప్రశ్నకు పరిస్థితులు గమనిస్తే అవుననే సమాధానం ఇవ్వాల్సి వస్తున్నదని పరిశీలకులు అంటున్నారు. 2018 ఎన్నికలకు ముందు, ఆ తరువాత కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ పేరిట రాష్ట్రంలో విపక్షాలను ఖాళీ చేయడానికి అనుసరించిన వ్యూహమే ఇప్పుడు బూమరాంగ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తున్నదంటున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ లోకి వలస వచ్చిన నేతలు ఒక్కరొక్కరుగా తిరిగి సొంతగూటికి చేరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వలసలు ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు.
కోర్టులు ఆదేశించినా, ఏకంగా పీఎంవో నుంచే అవరోధాలు సృష్టించవద్దంటూ ఆదేశాలు వచ్చినా జగన్ సర్కార్ నర్సాపురం ఎంపీ రఘురామరాజును వదలడం లేదు. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ భీమవరంలో జరగనున్న అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాకుండా చేయాలని ‘ఔట్ ఆఫ్ ది వే’ ప్రయత్నాలను ఆపడం లేదు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా భీమవరంలో సోమవారం అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరౌతున్నారు. ప్రొటో కాల్ ప్రకారం స్థానిక ఎంపీ ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. అందుకు ఎంపి రఘురామకృష్ణం రాజు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసి.. కోర్టు నుంచి కూడా లైన్ క్లియర్ చేసుకున్నారు. కోర్టు ఎంపీని అరెస్టు చేయవద్దంటూ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ఆయన భీమవరం వచ్చేందుకు నిర్ణయించుకున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనను భీమవరం కార్యక్రమానికి హాజరు కాకుండా అడ్డుకోవాలనే నిర్ణయించింది. దీంతో కోర్టు తీర్పును లెక్క చేయకుండా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఎంపీని అరెస్టు చేయవద్దంటూ కోర్టు ఆదేశాలు వచ్చిన మరుసటి రోజునే భీమవరంలోని రఘురామకృష్ణంరాజు ఇంటి ముందు రోడ్డు ప్రభుత్వం ఆదేశాలతో తవ్వేశారు.
వైసీపీలో నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నట్లే కనిపిస్తున్నది. ముఖ్యంగా వైసీపీ ప్లీనరీకి ముందు జిల్లాలలో జరుగుతున్న సమావేశాలు రసాభాసగా మారుతున్నాయి. ఆ సమావేశాలలో పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో అంతర్గత విభేదాల గుట్టు రట్టు చేస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లిలో జరిగిన పార్టీ సమావేశంలో మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలోనే ఆయన వైసీపీ నేతలకు కొందరు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని కుండబద్దలు కొట్టారు. ముఖ్యంగా మాజీ మంత్రి వెల్లంపల్లి ఈ రోజు వైసీపీలోనే ఉన్నా ముందు ముందు ఉంటారన్న నమ్మకం లేదని మంత్రి జోగి రమేష్ అన్నారు. మంత్రి జోగి రమేష్‌ వ్యాఖ్యలతో వేదికపై ఉన్నవారితో పాటు కార్యకర్తలు ఖంగుతిన్నారు. జోగి రమేష్ ఒక్కరే కాదు మంత్రి బొత్స సత్యనారాయణ సైతం తన నియోజకవర్గ పరిధిలో జరిగిన పార్టీ సమావేశంలో ఇటువంటి వ్యాఖ్యలే చేశారు.
పంజాబ్ లో తొలి సారిగా అధికారంలోకి వచ్చిన ఆప్ ప్రభుత్వం పవర్ లోకి వచ్చిన మూడు నెలలలోనే కేబినెట్ విస్తరణకు ఉపక్రమించింది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కొత్తగా ఐదుగురిని తన కేబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు చేశారు.
జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు మారుతున్నాయి. గతంలో టెర్రరిస్టులకు గ్రామాల్లో ఆశ్రయం కల్పించే వారు అక్కడి ప్రజలు. జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు మారుతున్నాయనడానికి తాజా ఉదాహరణ గ్రామస్తులే టెర్రరిస్టులను పట్టించిన సంఘటన. ఇప్పటి వరకూ కేంద్రం, భద్రతా బలగాలూ కూడా గ్రామాల్లో టెర్రరిస్టులకు షెల్టర్ లభిస్తోందనీ, అక్కడ నుంచి వారు సైన్యం, పోలీసులు, ప్రజలు లక్ష్యంగా దాడులకు పాల్పడి.. గ్రామ స్థుల రక్షణతో సులభంగా తప్పించుకు పారిపోతున్నారనీ చెబుతూ వస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.