వంద డాలర్లకు చేరువైన బ్యారల్ ముడి చమురు ధర.. చమురు మంటలు ఆగేదెన్నడు?

Publish Date:Jul 23, 2026

Advertisement

పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ముడి చమురు ధరలకు మంట పెట్టాయి.  ప్రపంచ వాణిజ్యానికి  కీలకమైన సముద్ర రవాణా మార్గాల్లో  అనిశ్చితి కొనసాగుతుండటం, చమురు ట్యాంకర్లపై దాడులు కారణంగా ముడి చమురు ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.  అమెరికా  ఇరాన్‌పై వరుసగా 13 రోజు కూడా వైమానిక దాడులకు పాల్పడింది.  హెర్మూజ్ జలసంధిలో రావాణ స్తంభన,  ఎర్రసముద్రంలో ప్రయాణిస్తున్న రెండు సౌదీ  ఆయిల్ ట్యాంకర్లపై  దాడుల నేపథ్యంలో  ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థ దారుణంగా  దెబ్బతింది.  దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒకే సారి 6 శాతం పైగా పెరిగింది. దీంతో ముడి చమురు బారెల్ ధర వంద డాలర్లకు చేరువైంది.  

ప్రపంచ సముద్ర రవాణాలో కీలకమైన హర్మూజ్ జలసంధి నియంత్రణపై అమెరికా,  ఇరాన్  ముఖాముఖి సైనిక ఘర్షణలకు తోడు  మరో కీలకమైన సముద్ర మార్గమైన  బాబ్ ఎల్-మండేబ్ సమీపంలో హౌతీలువిరుచుకుపడుతుండటంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇదే పరిస్థితి కొనసాగితే.. ప్రపంచ దేశాలన్నిటిలోనూ ఆర్థిక సంక్షోభం తప్పదని పరిశీలకులు అంటున్నారు. 

ఈ నేపథ్యంలోనే హౌతీ తిరుగుబాటుదారులు తమ దాడులను వెంటనే ఆపకపోతే భారీ   మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. హౌతీలను ఇరాన్ ప్రాక్సీ గ్రూప్‌గా అభివర్ణించిన ఆయన.. హౌతీల విధ్వంసక  చర్యలకు ఇరాన్‌నే   బాధ్యులను చేస్తామని కుండబద్దలు కొట్టారు.  దాడుల్లో దెబ్బతిన్న నౌకలకు, నష్టపోయిన సరుకులకు పరిహారంగా అమెరికా వద్ద నిలిచిపోయిన ఇరాన్ సీజ్డ్ నిధులను ఉపయోగిస్తామని ప్రకటించారు. 

 అదలా ఉంటే..  ఈ  వివాదాన్ని తక్షణమే శాంతియుతంగా, దౌత్యపరమైన చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ అన్ని దేశాలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే అత్యవసర శాంతి చర్చల ప్రయత్నాల కోసం ఇరాక్ ప్రధాని అలీ అల్-జైదీ టెహ్రాన్‌ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Strait of Hormuz tensions, Crude oil price near 100, US Iran conflict, Bab el Mandeb attack 

By
en-us Political News

  
శ్రీకృష్ణుడి కుమారుడైన శాంబుడి అహంకారం, ఋషుల శాపం మరియు యాదవ వంశం మొత్తంగా నాశనం కావడానికి దారితీసిన పౌరాణిక ఘట్టం యొక్క సమగ్ర కథనం తెలుసుకోండి.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
రక్షాబంధన్ రోజున రాఖీ దారం తెగిపోవడం అశుభమా కాదా అనే సందేహాలకు వేద పండితుల సమాధానం తెలుసుకోండి. తెగిపోయిన రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన నియమాలు మరియు 2026 రాఖీ శుభ ముహూర్తాల వివరాలు.
తిరుమలలో పౌర్ణమి మరియు గరుడ సేవ సందర్భంగా భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా, ఒక్కరోజే 66,437 మంది దర్శించుకోగా రూ. 4.45 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
తిరుపతి ఫారెస్ట్ డివిజన్ అధికారులు అత్యంత అరుదైన 3 రోజ్-రింగ్డ్ ప్యారాకీట్స్ (రామచిలుకలను) సమర్థవంతంగా రక్షించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వాటిని తిరిగి అడవిలోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు చదవండి.
శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే హయగ్రీవ జయంతి విశిష్టత, శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారం ఎత్తడానికి గల ఆధ్యాత్మిక కథ మరియు విద్యార్థులకు జ్ఞానాన్ని ప్రసాదించే హయగ్రీవ పూజా విధానం గురించి వివరంగా తెలుసుకోండి.
చంద్ర గ్రహణ సమయంలో ఆధ్యాత్మిక రక్షణ మరియు మానసిక ప్రశాంతత పొందేందుకు పాటించాల్సిన సూతక కాల నియమాలు, మంత్ర జపం, గర్భవతుల జాగ్రత్తలు మరియు గ్రహణానంతర శుద్ధి, దానాల విశిష్టతలను వివరంగా తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.