Publish Date:Apr 27, 2025
జమ్మూ కాశ్మీర్లోని పహెల్గాం ఉగ్రదాడిపై చర్చించడానికి ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ డుమ్మా కొట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. దాడి అనంతరం రెండు రోజుల పాటు వ్యూహాత్మక మౌనంతో మోడీ అందరి దృష్టినీ ఆకర్షించారు. ఏదో కీలక నిర్ణయం తీసుకుంటారని అంతా భావించారు. అఖల పక్ష సమావేశంలో అందరి అనుమానాలూ, సందేహాలూ నివృత్తి చేస్తారనీ, అన్నిప్రశ్నలకూ సమాధానాలు చెబుతారని అంతా భావించారు. అయితే అందుకు భిన్నంగా ప్రధాని మోడీ అఖిల పక్ష సమావేశానికి గైర్హాజరు కావడం, బీహార్ లో ఎన్నికల ప్రసంగం చేయడానికే ప్రాధాన్యత ఇవ్వడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. రక్ణణ మంత్రి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష భేటీకి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిథులూ హాజరయ్యారు. ఈ భేటీలో ప్రధాని పహెల్గాం దాడికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తారనీ, ఈ దాడి తరువాత కేంద్రం తీసుకున్న నిర్ణయాలు ప్రకటిస్తతారనీ, అలాగే భద్రతా లోపాల గురించి ప్రతిపక్షాల ప్రశ్నలు, సందేహాలకు సమాధానాలు చెబుతారనీ అంతా భావించారు.
అయితే ప్రధాని మోడీ..అత్యంత కీలకమైన ఈ భేటీకి గైర్హాజరు కావడం, ఇంతటీ కీలక భేటీ కంటే బీహార్ లో సభ ద్వారా రాజకీయ లబ్థి పొందడమే ముఖ్యమనుకోవడం పట్ల సర్వతత్రా అసంతృప్తి, అసహనం వ్యక్తమైంది. ఇదే అసంతృప్తి, అసహనాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఎక్స్ వేదిక ద్వారా వ్యక్తం చేశారు. ఎందుకు జరిగింది? ఎవరు బాధ్యత వహించాలి? ఇది భద్రతా లోపం, పహెల్గాం దాడి.. నిఘా వర్గాల వైఫల్యం, పోలీసు వైఫల్యం వంటి అంశాలపై అఖిలపక్షంలో మోడీ క్లారిటీ ఇస్తారని భావించామనీ, అయితే ఆయన డుమ్మా కొట్టడం తమను తీవ్ర నిరాశకు లోను చేసిందనీ ఖర్గే పేర్కొన్నారు. అయితే దేశంలో ఉగ్రవాదాన్ని తుదముట్టించే విషయంలో తాము ప్రభుత్వం తీసుకునే చర్యలు, నిర్ణయాలకు మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. అయితే మోడీ వైఖరి ఎంత మాత్రం సమర్ధనీయం కాదని విమర్శించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/criticizam-all-over-on-modi-absense-to-all-party-meet-39-197008.html
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు. ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
Publish Date:Oct 31, 2026
రేపే మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. ప్రశాంతంగా సాగేనా.?