ముద్రగడ పరామర్శకు జగన్ ముఖం చాటేయడంపై వెల్లువెత్తుతున్న విమర్శలు

Publish Date:Jun 26, 2026

Advertisement

కాపు సామాజికవర్గ అగ్రనేత, కాపు ఉద్యమ కారుడు ముద్రగడ పద్మనాభం   తీవ్ర అనారోగ్యంతో  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొంత కాలంగా  అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి  విషమించడంతో, కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్‌లోని ఒక  ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై ఉంచి  చికిత్స అందిస్తున్నారు.  

అయితే ముద్రగడ పద్మనాభం 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడులపై తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా.. 2024 ఎన్నికల్లో వైసిపి మళ్లీ గెలవకపోతే తన పేరును  ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటానని అప్పట్లో శపథం చేశారు. ఆ ఎన్నికలలో  వైసిపి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో ముద్రగడ పద్మనాభం తన మాట నెరవేర్చుకుని తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు.  2024 ఎన్నికల ఘోర పరాభవం తర్వాత కూడా ఆయన జగన్ వెంటే నిలిచారు. 

జగన్ కోసం ముద్రగడ తన సొంత సామాజిక వర్గం వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అటువంటి ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే.. జగన్ కనీసం ఆయనను పరామర్శిండానికి కూడా రాకపోవడంపై రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.  తన కోసం సర్వస్వం ఒడ్డిన నేతను చూడటానికి జగన్ స్వయంగా రాకుండా..  సజ్జల రామకృష్ణారెడ్డి పంపించడంపై వైసీపీయులలోనే ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 

ముద్రగడ పద్మనాభం కుమార్తె  క్రాంతి  జగన్ తీరుపై  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాపాయ స్థితిలో వెంటిలేటర్‌పై ఉన్న తన తండ్రిని చూడటానికి కూడా రాకుండా జగన్ ముఖం చాటేయడం దారుణమని విమర్శించారు.   గతంలో ముద్రగడ చేసిన సేవలను, వైసిపి కోసం ఆయన పడ్డ కష్టాన్ని జగన్  విస్మరించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  నమ్మి వచ్చిన  నేతలను జగన్ ఇలాగే నట్టేట ముంచుతారంటూ జగన్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

By
en-us Political News

  
ఏకంగా 21 పెళ్లిళ్లు చేసుకున్న బెగ్గర్.!
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల సంఘం (సీఈసీ) జ్నేಶ್ కుమార్ రాజీనామా డిమాండ్ కలకలం రేపుతోంది.
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్‌లో మంటలు చెలరేగడం కలకలం రేపింది.
గోవా కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్‌ దందా హైదరాబాద్‌ వరకు విస్తరించినట్లు పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చంద్రబాబు అరెస్ట్ సమయంలో రోడ్డెక్కింది మేమే.. డిప్యూటీ సీఎం.!
పాత కరెన్సీ నోట్లకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి అమాయకులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల
దేశ రాజధానిలో నిరసనల నేపథ్యంలో విధించిన కఠిన నిబంధనలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులోనే ఐదేళ్ల చిన్నారి అరేలియా జీవితం విషాదాంతమైంది.
భర్త మంచానికే పరిమితమయ్యాడు.. కుటుంబ బాధ్యతలు ఓవైపు.. జీవితంలో ఎదురైన కష్టాలు మరోవైపు
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
విశాఖపట్నంలో అర్ధరాత్రి వేళ హైవేపై జరిగిన కార్ ఛేజింగ్‌ కలకలం రేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.