ఇండియా కూటమిలో సంక్షోభం.. కాంగ్రెస్ ను వీడుతున్న మిత్రపక్షాలు

Publish Date:Jun 5, 2026

Advertisement

కేంద్రంలో అధికారమే లక్ష్యంగా, దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తే..  2023లో ఇండియా'కూటమిగా ఏర్పడ్డాయి.  అయితే ఆ లక్ష్యం దిశగా ఈ కూటమి అడుగులు మాత్రం తడబడుతున్నాయి.   2029 లోక్‌సభ ఎన్నికలకు మూడేళ్ల ముందే ఈ కూటమి మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది.  పరస్పర విశ్వాసంతో ముందుకు సాగాల్సిన ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు ఎవరికి వారే యమునా తీరే చందంగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ తో ఇండియా కూటమిలోని మెజారిటీ పక్షాలు విభేదిస్తున్నాయి. ఒక్కటొక్కటిగా తిరుగు బావుటా ఎగురవేస్తున్నాయి.  దేశ రాజధాని ఢిల్లీలో ఈ నె 8న జరగనున్న  17 పార్టీల ఇండియా కూటమి సమావేశాన్ని తాము పూర్తిగా బహిష్కరిస్తున్నట్లు తాజాగా   డీఎంకే  ప్రకటించింది.  దశాబ్దాలుగా తమకు నమ్మకమైన మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, తమిళనాడు రాజకీయాల్లో తమకు తీరని ద్రోహం చేసిందని డీఎంకే  పేర్కొంది. 

ఈ   సంక్షోభానికి అసలు కారణం ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే. ఈ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో అక్కడ హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. ఈ మారుతున్న రాజకీయ సమీకరణాల నడుమ, దశాబ్దాలుగా నమ్మకమైన మిత్రపక్షంగా ఉన్న డీఎంకేను కాంగ్రెస్ పార్టీ   పక్కన పెట్టేసి.. తమిళనాడులో  ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రముఖ  నటుడు విజయ్ స్థాపించిన  తమిళగ వెట్రి కళగం (టీవీకే)తో కాంగ్రెస్ చేతులు కలపడం డీఎంకేకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. కాంగ్రెస్ తమకు వెన్నుపోటు పొడిచిందని డీఎంకే నేత  ఇలంగోవన్ బహిరంగంగానే ఆరోపించారు. తమ మద్దతుతోనే రాజ్యసభ నామినేషన్లు దక్కించుకుని.. కూటమి ద్వారానే సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్, ఇప్పుడు స్వార్థం రాజకీయంతో వేరే పార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం దారుణమన్నారు. తాము ఇకపై ఇండియా కూటమిలో భాగం కాబోమని, లోక్‌సభలో కూడా కాంగ్రెస్ పక్కన కాకుండా తమకు విడిగా సీట్లు కేటాయించాలని డీఎంకే  ఏకంగా స్పీకర్‌ను కోరింది.  

అయితే.. కాంగ్రెస్ కు కూటమి భాగస్వామ్య పక్షాల నుంచి తిరస్కారం ఎదురు కావడం ఒక్క తమిళనా డుకే పరిమితం కాలేదు.  మరికొన్ని కీలక రాష్ట్రాల్లోనూ ఇదే రకమైన వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల పరాజయం తర్వాత మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్   అంతర్గత విభేదాలు, సొంత పార్టీ నేతల తిరుగుబాట్లతో కుదేలౌతోంది.

అలాగే.. ఉత్తరాదిలో కూటమికి అత్యంత కీలకమైన భాగస్వామిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ కూడా సీట్ల సర్దుబాటు ఫ్రేమ్‌వర్క్ నుంచి అధికారికంగా తప్పుకుని కూటమికి దూరం జరిగింది.  తమిళనాడులో మతతత్వ శక్తులను అడ్డుకోవడానికి, స్థిరమైన ప్రభుత్వాన్ని అందించడానికే తాము టీవీకే తో చేతులు కలిపామని కాంగ్రెస్ సమర్థించుకుంటున్నప్పటికీ..  కూటమిలోని  ప్రాంతీయ పార్టీలు మాత్రం కాంగ్రెస్ అనుసరిస్తున్న స్వార్థ రాజకీయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి.  ఇండియా కూటమి విచ్ఛిన్నం అవుతుండటం దేశ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది.  

By
en-us Political News

  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.