క్రికెటర్లకు పంది, గోవు మాంసం నిషేధం.. కాదంటున్న బీసీసీఐ..
Publish Date:Nov 24, 2021
Advertisement
క్రికెటర్స్ బలంగా ఉండాలి. అలసట అసలే రాకూడదు. ఫిట్నెస్ ఏమాత్రం తగ్గకూడదు. అలా ఉండాలంటే పర్ఫెక్ట్ డైట్ ఫాలో కావాలి. న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి. కార్బ్స్, ప్రోటీన్ మస్ట్. అందుకే డైట్ కోసం ప్రత్యేకంగా న్యూట్రిషన్స్ కూడా ఉంటారు. ఇక, ఆటగాళ్ల అలవాటు ప్రకారం ఆహారం తీసుకుంటారు. ఎక్కువ మంది నాన్వెజిటేరియన్సే. కొందరు వెజిటేరియన్స్ కూడా ఉన్నారు. ఇదంతా ఓకే. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే... కాన్పూర్ వేదికగా జరుగనున్న తొలి టెస్టులో భారత క్రికెటర్ల ఆహారంలో పంది, గోవు మాంసాలను నిషేధించారని.. హలాల్ చేసిన మాంసాన్నే ఆటగాళ్లకు అందించనున్నారని బీసీసీఐ వర్గాల ద్వారా విషయం బయటకు వచ్చింది. భారత జట్టుతో పాటు న్యూజిలాండ్ జట్టులో కూడా ముస్లిం ఆటగాళ్లు ఉండటంతో హలాల్ చేసిన మాంసాన్ని అందించాలని బీసీసీఐ భావించినట్టు తెలుస్తోంది. ఇక అంతే. సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. పెట్టే వాళ్లకు, తినే వాళ్లకూ ఎలాంటి ప్రాబ్లమ్ లేకపోయినా.. నెటిజన్లకు మాత్రం ఇదే పెద్ద విషయంగా మారింది. అదేంటి.. అలా ఎలా కట్టడి చేస్తారు? ఆటగాళ్లు తినే ఆహారంపై ఆంక్షలు విధించడమేంటి? ఎవరికి ఇష్టం ఉన్న ఫుడ్ వాళ్లు తింటారు.. మీకేంటి కష్టం? పంది, గోవు మాంసం తినొద్దని ఎలా చెబుతారు? హలాల్ చేసిన మాంసాన్నే ఎలా వడ్డిస్తారు? అంటూ సోషల్ మీడియాలో కామెంట్లతో కత్తియుద్ధం చేస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధూమల్ స్పష్టత ఇచ్చారు. ఆటగాళ్ల ఆహారపు అలవాట్లపై బీసీసీఐ జోక్యం చేసుకోదని ప్రకటించారు. ‘ఆటగాళ్ల డైట్ ప్లాన్‌కు సంబంధించి మేమెలాంటి నిబంధనలు విధించలేదు. ఆటగాళ్లు తమకు నచ్చిన ఆహారాన్ని ఎంచుకోవచ్చు. అది శాకాహారమా?, మాంసాహారమా? అనేది వారిష్టం’ అని అరుణ్ ధూమల్ తెలిపారు.
http://www.teluguone.com/news/content/cricketers-food-menu-controversy-39-127001.html





