అడుగు బయటపెట్టకుండానే అనుకున్నది సాధించారు!

Publish Date:Aug 30, 2022

Advertisement

సీపీఎస్ ఉద్యోగుల సెప్టెంబర్ 1 చలో విజయవాడ వాయిదా పడింది. ఈ విషయాన్ని  సీపీఎస్ ఉద్యోగులు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఈ వాయిదా ప్రకటన ఒక లాంఛనం మాత్రమే. ఏపీలో సీపీఎస్ ఉద్యోగులు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం జరగకుండా చూసేదుకు ఏపీ సర్కార్ ఏకంగా వారిపై యుద్ధాన్నే ప్రకటించింది.

బైండోవర్ కేసులు, ఉద్యోగులకు సెలవులు లేవంటూ నిబంధనలు విధించింది. దాదాపు నెల రోజులుగా ఉపాధ్యాయులపై వేధింపులు తీవ్ర తరం చేసింది. బ్యాస్కట్ బాల్, వాలీబాల్ వంటి ఆటల్లో మేన్ టు మేన్ అని ఒక వ్యూహం ఉంటుంది. సీపీఎస్ ఉద్యోగుల కట్టిడికి వైసీపీ అదే వ్యూహాన్ని అనుసరించినట్లు కనిపిస్తోంది. ఒక ఉద్యోగికి ఒక పోలీస్ అన్నట్లుగా పోలీసు వ్యవస్థను వినియోగించుకుంది. నోటీసులు ఇచ్చింది. విజయవాడ వెళితే ఖబడ్దార్ అని హెచ్చరించింది.

ఇవి చాలవని భయపడిందో ఏమో విజయవాడలో వేలాది మంది పోలీసులతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించింది. రాష్ట్రంలో ప్రభుత్వానికి సీపీఎస్ ఉద్యోగులకే మధ్య యుద్ధం జరుగుతోందా అన్న వాతావరణాన్ని కల్పించింది. సామాన్య జనం కూడా టీచర్ల ఆందోళనలను అణచివేయడానికి ఇంత చేయాలా అని భావించే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఇక జగన్ నివాసానికి వెళ్లే దారులన్నిటినీ ఇప్పటికే మూసేశారు. టీచర్లు ముట్టడించకుండా ఉండేందుకు ప్రభుత్వమే సీఎం ఇంటిని ముట్టడి చేసింది. చీమ కూడా ఆ ముట్టడిని దాటి రాలేని పరిస్థితి ఏర్పరిచింది.   రోడ్ల పక్కన నాలుగైదు అడుగుల ఎత్తున ఇనుప ముళ్ల కంచెలు పెట్టారు.  

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని ప్రకటించినది   రెండు లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు మాత్రమే. ప్రభుత్వం మాత్రం మొత్తం రాష్ట్రమంతా ప్రభుత్వానికి, జగన్ కు వ్యతిరేకంగా ఉద్యమిస్తోందా అన్న లెవల్ లో చలో విజయవాడను భగ్నం చేయడానికి ఏర్పాట్లు చేసింది. వారు చివరి క్షణంలో అంటే సెప్టెంబర్ 1కి రెండు రోజుల ముందే వారు చలో విజయవాడ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్లు ప్రకటించినా.. ఇప్పటికే వారు సాధించాల్సింది సాధించేశారు.

ప్రభుత్వాన్ని టెన్షన్ పెట్టారు, భయపెట్టారు. వారి చలో విజయవాడ పిలుపునకు ప్రభుత్వం వణికిపోయిందన్న భావన సామాన్య జనాలలో సైతం కలిగించగలిగారు. ఇది సీపీఎస్ ఉద్యోగుల ఘన విజయంగానే పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ప్రభుత్వం మాత్రంప్రభుత్వాన్ని వారిలా టెన్షన్ పెట్టడం పెద్ద సక్సెస్. ముందు ముందు దీన్ని కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది. 

By
en-us Political News

  
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.