అమిత్ షాకు నిరసన సెగ తప్పదా? తిరుపతిలో ఏం జరగనుంది? 

Publish Date:Nov 9, 2021

Advertisement

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన ఏపీలో వేడి పుట్టిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలపై విపక్షాలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. అటు జగన్ సర్కార్ మాత్రం తప్పంతా కేంద్రానిదేనని, తాము తగ్గించే ప్రసక్తే లేదని తెల్చి చెబుతోంది. పెట్రో విషయంలో బీజేపీ నేతలు జగన్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అమరావతి రైతులు మహా పాదయాత్ర చేస్తున్నారు. ఇలా ఏదో ఒక అంశంతో ఏపీలో ప్రతి రోజూ ఉద్రిక్తత పరిస్థితులే కనిపిస్తున్నాయి. 

ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రానికి వస్తుండటం రాజకీయ కాక రేపుతోంది. తిరుపతి క్షేత్రం వేదికగా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అత్యంత కీలకమైన భేటీని ఈ నెల 14న నిర్వహించబోతున్నారు. ఈ సమావేశం కోమే అమిత్ షా తిరుపతి వస్తున్నారు. దీంతో చాలా కాలానికి వస్తున్న అమిత్ షా.. ఏపీకి ఏం తెస్తారు ఏమేమి  వరాలు ఇవ్వబోతున్నారని జనాలు ఆలోచిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఏమైనా సానుకూలత 

అమిత్ షా పర్యటనలో రాష్ట్ర సమస్యలపై ఉద్యమించేందుకు కమ్యూనిస్టులు ప్లాన్ చేస్తున్నారు. తిరుపతికి వస్తున్న అమిత్ షాను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. అమిత్ షా తిరుపతి టూర్ పై సీపీఐ  జాతీయ కార్యదర్శి నారాయణ నిప్పులు చెరిగారు. అసలు తిరుపతితో మీకేం పని అమిత్ షా అంటూ గట్టిగానే ప్రశ్నించారు నారాయణ. నాడు ప్రధాని అభ్యర్ధిగా తిరుపతి వచ్చిన మోడీ ప్రత్యేక హోదాను ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఏడేళ్ళు గడిపేశారని విభజన హామీలన్నీ తుంగలోకి తొక్కారని మండిపడ్డారు. అలాంటి తిరుపతికి ఏ ముఖం పెట్టుకుని అమిత్ షా వస్తున్నారు అంటూ నారాయణ నిలదీస్తున్నారు. 

అమిత్ షా ఊరకే వచ్చి వెళ్లిపోతే చూస్తూ ఊరుకోమని కూడా హెచ్చరించారు నారాయణ.  ఏపీకి ఆయన న్యాయం చేయాల్సిందే అన్నారు. అమిత్ షా రాక సందర్భంగా నల్ల జెండాలతో సీపీఐ నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని చెప్పారు. ఏపీకి రావాల్సిన వాటి మీద జగన్ అమిత్ షా ని నిలదీయాలని నారాయణ కోరారు. గతంలోనూ అమిత్ షా తిరుపతికి వచ్చినప్పుడు ప్రత్యేక హోదా సెగ తగిలింది. ఏపీకి న్యాయం చేయాలంటూ జనాలు ఫ్లకార్డులు ప్రదర్శించారు. దీంతో వామపక్షాల నిరసన పిలుపుతో ఈసారి కూడా అమిత్ షాకు తిరుపతిలో నిరసన సెగ తప్పకపోవచ్చని తెలుస్తోంది. 

By
en-us Political News

  
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.