అర్ధరాత్రి సీపీ సుమతి స్టింగ్ ఆపరేషన్‌ ...వేధించిన 40 మంది పోకిరీలు

Publish Date:May 6, 2026

Advertisement

 

నగరంలో లేడీ సింగం మెరుపు దాడి... 

అర్ధరాత్రి సాధారణ మహిళగా బస్టాండ్‌లో సీపీ సుమతి..

షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన పోకిరీలు..

నగరంలో మహిళల భద్రత ఎంతవరకు ఉందనే విషయాన్ని స్వయంగా తెలుసుకునేందుకు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా, పోలీసు వాహనాలు కాకుండా ఒక సాధారణ మహిళగా అర్ధరాత్రి వేళ రోడ్డుపైకి వచ్చి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన అనుభవాలు నగరంలో మహిళల భద్రతపై అనేక ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి.

ఇటీవలే మల్కాజిగిరి సీపీగా బాధ్యతలు స్వీకరించిన సుమతి, మహిళల రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా మంగళవారం అర్ధరాత్రి దిల్ సుఖ్ నగర్ బస్టాండ్ వద్ద ఆమె అండర్ కవర్ ఆపరేషన్ నిర్వహించారు. సాదాసీదా దుస్తుల్లో ఒక సగటు మహిళలా బస్టాండ్ లో ఒంటరిగా వేచి ఉన్న సమయంలో, అక్కడ ఉన్నది సాక్షాత్తు కమిషనర్ అని తెలియని పోకిరీలు తమ వక్రీకృత బుద్ధిని ప్రదర్శించారు.

 

 

బస్టాండ్ ప్రాంతంలో తిరుగుతున్న సుమారు 40 మంది యువకులు ఆమె చుట్టూ చేరి అసభ్యకరమైన ప్రశ్నలతో వేధించడం ప్రారంభించారు. రాత్రివేళ ఒంటరిగా ఉన్న మహిళను చూసి ఆకతాయిలు ఎంత తెగించి ప్రవర్తిస్తారనేది ఈ ఘటనతో స్పష్టమైంది. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులు, మద్యం మత్తులో ఉన్న యువకులు ఉండటం గమనార్హం.

మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా అనుభవించిన సీపీ, వెంటనే అప్రమత్తమై తన టీమ్‌కు సిగ్నల్ ఇచ్చారు. దీంతో అప్పటికే అక్కడ మాటు వేసిన పోలీసులు మెరుపు వేగంతో స్పందించి వేధింపులకు పాల్పడిన వారిని చుట్టుముట్టారు. నిందితులందరినీ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి, వారికి గట్టిగా కౌన్సెలింగ్ ఇచ్చారు.

ఈ ఆపరేషన్ ద్వారా నగరంలో రాత్రివేళల్లో భద్రతా లోపాలను సీపీ స్వయంగా గుర్తించారు. ముఖ్యంగా బస్టాండ్లు, హాస్టల్స్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిఘా పెంచాల్సిన అవసరం ఉందని అధికారులను ఆదేశించారు. మద్యం, గంజాయి మత్తులో యువత దారి తప్పుతున్న తీరుపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

అధికార యంత్రాంగం కేవలం కార్యాలయాలకు పరిమితం కాకుండా, ఇలా క్షేత్రస్థాయిలోకి వచ్చి వాస్తవాలను తెలుసుకోవడంపై మహిళా లోకం హర్షం వ్యక్తం చేస్తోంది. సీపీ సుమతి తీసుకున్న ఈ చొరవ వల్ల ఆకతాయిల్లో భయం మొదలైందని, భవిష్యత్తులో ఇలాంటి నిఘా చర్యలు మరిన్ని కొనసాగుతాయని ప్రజలు భావిస్తున్నారు.

 

 

రానున్న రోజుల్లో రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు, మహిళల భద్రత కోసం ప్రత్యేక ఐటీ ఆధారిత వ్యవస్థలను (TG QUEST వంటివి) అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. నగర వీధుల్లో మహిళలు నిర్భయంగా తిరిగేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు భరోసా ఇస్తున్నారు. ఐపీఎస్ అధికారిణినే ఇంత వేధించారు అంటే అత్యవరస పరిస్థితుల్లో అర్ధరాత్రి బయటకు వెళ్ళే సాధారణ మహిళల పరిస్థితి ఏమిటి అని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో రోజురోజుకూ పెరుగుతున్న దాడులు, వేధింపులు మహిళల భద్రతపై పెద్ద ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఇంటి బయట అడుగుపెట్టాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 

By
en-us Political News

  
ర్యాపిడో, కొరియర్‌తో కస్టమర్లకు డెలివరీ..!
ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిచ్చే క్రమంలో టాటా గ్రూప్‌నకు చెందిన విమానయాన సంస్థలు ఎయిర్ ఇండియా
తెలంగాణ రాజకీయాల్లో బాన్సువాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.
మద్యం మత్తులో చోరీ.. చివరికి యజమానికి దొరికిపోయిన..!
హైదరాబాదులో సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను రాజేంద్రనగర్ కోర్టు రేపటికి వాయిదా వేసింది.
కారు నాదే కానీ రూపాయి ఇవ్వను..బొమ్మకు మురళి సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్ రావు కన్నుమూశారు.
రాజకీయాలు వ్యాపారంగా మారాయి.. ప్రజాసేవే పరమావధిగా పనిచేయాలి సభాపతి పిలుపు
ప్రత్యేకంగా బీఆర్‌టీఎస్ కారిడార్‌తో పాటు రహదారికి ఇరువైపులా సర్వీసు రోడ్లను అందుబాటులోకి తెచ్చారు. రవాణాతో పాటే విద్యుత్తు, తాగునీటి సరఫరా, గ్యాస్ నెట్‌వర్క్, డ్రైనేజీ, కమ్యూనికేషన్ కేబుళ్ల నిర్వహణ కోసం భూగర్భ మౌలిక వసతులు సమకూర్చారు.   పాదచారుల కోసం ఫుట్‌పాత్‌లు, సైకిల్ ట్రాక్‌లు,   గ్రీన్‌బెల్ట్ నిర్మాణంతో ఆధునిక  రవాణా వ్యవస్థకు ఈ రోడ్డు దర్పణం పడుతుంది.  
దక్షిణాసియా ప్రాంతంలో అల్‌ఖైదా, ఐసిస్ వంటి ఉగ్రవాద అనుబంధ సంస్థల   దాడుల సామర్థ్యం గణనీయంగా పెరుగుతోందని హెచ్చరించింది. ఈ ఉగ్ర సంస్థలు  రసాయన, జీవాయుధాలను సేకరించి.. వాటితో విధ్వంసం సృష్టించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయనీ, కుట్రలు పన్నుతున్నాయనీ వెల్లడించింది.
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పదవిపై బిసిసిఐ స్పష్టత ఇచ్చింది. జట్టు ట్రాన్సిషన్ ఫేజ్, ఆటగాళ్ల గాయాల దృష్ట్యా గంభీర్‌ను 2027 వరల్డ్ కప్ వరకు కోచ్‌గా కొనసాగించేందుకు బిసిసిఐ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
షేక్ రషీద్ అహ్మద్ లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ ఖలీద్ మసూద్ సంధు, ఆ ఉగ్ర సంస్థ కేంద్ర సలహా మండలి సభ్యుడు ఖారీ మహమ్మద్ యాకూబ్ షేక్‌లతో కలిసి వేదికను పంచుకున్నారు. ఆ సందర్భంగా ప్రసంగించిన ఆయన తాను లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు బానిసనని బాహాటంగా ప్రకటించారు.
జడేజా కెరీర్ ముగింపునకు చేరువవుతున్న వేళ టీమిండియా తదుపరి స్పిన్ లీడర్ ఎవరు కుల్దీప్ యాదవ్ విరాట్, రోహిత్, గిల్ కెప్టెన్సీలలో సాధించిన రికార్డులు, డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక సవాళ్లు మరియు మురళీ కార్తీక్ విశ్లేషణపై సమగ్ర కథనం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.