వైసీపీ మారలేదు.. మారదు.. చంద్రబాబుపై దుష్ప్రచారంపై లోకేష్ ఫైర్

Publish Date:Apr 25, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. గతంలో జరిగిన ఒక సంఘటనకు సంబంధించిన వీడియోను ఉద్దేశపూర్వకంగా మార్పింగ్ చేసి..  ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.  వైసీపీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతటి నీచానికైనా ఒడిగడుతుందని ఈ ఘటన నిరూపిస్తోందని ఫైర్ అయ్యారు.  

  విషయం ఏమిటంటే.. గత మార్చి 30న చంద్రబాబు నాయుడు నాయుడుపేట పర్యటనలో భాగంగా అంబిక అనే లబ్ధిదారురాలి నివాసాన్ని సందర్శించారు. ఆ సమయంలో ఆమె భర్త ఆటో డ్రైవర్ అని తెలుసుకున్న ముఖ్యమంత్రి, అతనికి ఉపాధి మెరుగుపరచడం కోసం బ్యాటరీ ఆటోను మంజూరు చేయాలని అక్కడికక్కడే జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. అయితే.. అదే పర్యటనలో మరో సందర్భంలో ఒక మహిళ తన విద్యావంతుడైన కుమారుడికి ఉద్యోగం కావాలని చంద్రబాబును అభ్యర్థించారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో.. ఉద్యోగం అడిగిన యువకుడికి  చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ..  బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.  

ఈ వీడియో వెనుక ఉన్న వాస్తవాలను ఇప్పటికే ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం  స్పష్టం చేసినప్పటికీ, మళ్ళీ అదే పాత అబద్ధాన్ని కొత్తగా ప్రచారం చేయడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఒక పక్క అభివృద్ధి పనులతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే..  మరోపక్క ఇటువంటి తప్పుడు ప్రచారాలతో గందరగోళం సృష్టించాలని చూడటం సమంజసం కాదని లోకేశ్ పేర్కొన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని  హెచ్చరించారు.

రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు సహజమని, కానీ వ్యక్తిత్వ హననానికి పాల్పడటం లేదా వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవపట్టించడానికి ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికి విఘాతమని పరిశీలకులు సైతం అంటున్నారు. గతంలో కూడా ఇలాంటి ఎడిటెడ్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. వాటిపై అప్పట్లో పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు.   బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులపై అసత్య ప్రచారాలు చేస్తే కఠిన శిక్షలు తప్పవని లోకేష్ అన్నారు.   

By
en-us Political News

  
నిన్న మొన్నటి వరకూ వైసీపీకి, వివాదాస్పద యూట్యూబర్ ప్రశ్న రావణ్ కు అనుకూలంగా గళమెత్తిన జడ శ్రవణ్ కుమార్ అంత లోనే.. ఇలా యూటర్న్ తీసుకుని వైసీపీపై విరుచుకు పడటం విశేషం. తనకు వైసీపీ ఫండింగ్ చేస్తోందని వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చే క్రమంలో ఆయన వైసీపీ దోపిడీని ఎండగట్టారు. వైసీపీ తనకు ఫండింగ్ చేయడమేంటని ప్రశ్నించిన ఆయన ఆ పార్టీ నేతలు ఎంగిలి మెతుకులను కూడా వదలకుండా దోచేసుకుంటారని దుయ్యబట్టారు. జగన్ పాలనా కాలమంతా దోపిడీ రాజ్యమేలిందని విమర్శలు గుప్పించారు.
మొత్తం మీద రేవంత్ సభలో జగన్ ఫ్లెక్సీలు, బ్యానర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా తెలంగాణలో కేటీఆర్ సభలోనూ జగన్ ఫ్లెక్సీలు వెలిసన సంగతి తెలిసిందే. సొంత రాష్ట్రంలో కార్యక్రమాలు చేపట్టడంలో స్తబ్దుగా ఉంటున్న వైసీపీ శ్రేణులు తెలంగాణలో మాత్రం ఇతర పార్టీల సభలలో తమ అధినేత ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రదర్శించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది.
మాజంలో వివాదాలకు కారణమైన ఒక వ్యక్తికి వైసిపి బహిరంగంగా మద్దతు ప్రకటించడం, మరీ ముఖ్యంగా మత విద్వేషాలు ప్రజ్వరిల్లేలా వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి.. తనను తాను రావణుడినని చెప్పుకున్న వ్యక్తిని వత్తాసుగా వైసీపీ నిలవడం కోరి ప్రజా వ్యతిరేకతను కొని తెచ్చుకోవడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఈటల కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ గళం ఎత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఆరోపణలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో ఈటల రాజేందర్ బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మాట్లాడారు. దీంతో ఈటల మళ్లీ కారెక్కేస్తారా అన్న ప్రచారం అప్పట్లో జోరందుకుంది. ఆ తరువాత సద్దుమణిగింది.
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అత్యంత సంక్లిష్టమైన మరియు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి.
ఉపా కింద నమోదైన ఈ కేసులో నిందితుడి తరఫున న్యాయపోరాటం చేసేందుకు వైసీపీ పార్టీ లీగల్ సెల్ విభాగానికి చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రంగంలోకి దిగారు.
ఈ సర్జరీల తరువాత పవన్ కల్యాణ్ కనీసం నెల రోజుల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇటీవల అనంతపురం జిల్లాలో మడకశిర ఎమ్మెల్యే ఎమ్ఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య చోటుచేసుకున్న వ్యక్తిగత విమర్శలు, ఆరోపణల పరంపరపై మధుసూదన్ రెడ్డి, ప్రజాప్రతినిధుల మధ్య కేవలం రాజకీయ పోరాటం ఉంటే ఫర్వాలేదని, కానీ ఇరువర్గాలు కులాల ప్రస్తావన తెస్తూ కుంపట్లు రాజేయడం తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.
రావణ్ అరెస్టుపై వైసీపీ, ఇతరులు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే నేరస్థులకు వైసీపీ ఇలా బాహాటంగా మద్దతు ఇవ్వడం దారుణమన్నారు. ప్రశ్న రావణ్ అనే వ్యక్తి ఎలాంటి వ్యాఖ్యలు చేశాడో, సమాజానికి ఎంతటి ముప్పుగా పరిణమించాడో ప్రజలంతా గమనించాలని కోరారు.
తిపక్షాల నుంచి వచ్చే విమర్శలను తిప్పికొట్టే విషయంలో జనసేన ఏమంత యాక్టివ్ గా లేదన్నది వాస్తవమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఈ విషయంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా పార్టీ లీడర్లు, క్యాడర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాదే పాద‌యాత్ర ప్రారంభిస్తాన‌ని కేటీఆర్ స్వయంగా ప్రకటించి కూడా వెనక్కు తగ్గడంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఏ మంత వ్యతిరేకత కనిపించడం లేదన్న అవగాహనతోనే కేటీఆర్ తన పాదయాత్రను వాయిదా వేసుకున్నారన్న చర్చ జరుగుతోంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య సమక్షంలో కమలం కండువా కప్పుకుని బీజేపీలో చేరారు. వీరు ముగ్గురూ ఇలా బీజేపీలో చేరారో లేదో అలా బీజేపీ హైకమాండ్ వీరి రాజీనామాతో ఖాళీ అయిన ఆ మూడు రాజ్యసభ స్థానాల ఉపఎన్నికలకే వీరినే తమ అభ్యర్థులుగా ప్రకటించింది.
దేశంలో ఉగ్రవాదులు, నక్సలైట్లపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (ఉపా) గురించి కనీస అవగాహన లేకుండా కొడాలి నాని మాట్లాడుతున్నారన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు అజ్ణానంతో చేశారని తాను భావిస్తున్నాననీ, ఒకవేళ ఆయన తెలిసి బుద్ధిపూర్వకంగానే ఉపా చట్టాన్ని ఉప్మా యాక్ట్ అని అవమానించి ఉంటే, భారత రాజ్యాంగాన్ని, చట్టాలను కించపరిచినందుకు ఆయనపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.