Publish Date:Apr 25, 2026
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. గతంలో జరిగిన ఒక సంఘటనకు సంబంధించిన వీడియోను ఉద్దేశపూర్వకంగా మార్పింగ్ చేసి.. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతటి నీచానికైనా ఒడిగడుతుందని ఈ ఘటన నిరూపిస్తోందని ఫైర్ అయ్యారు.
విషయం ఏమిటంటే.. గత మార్చి 30న చంద్రబాబు నాయుడు నాయుడుపేట పర్యటనలో భాగంగా అంబిక అనే లబ్ధిదారురాలి నివాసాన్ని సందర్శించారు. ఆ సమయంలో ఆమె భర్త ఆటో డ్రైవర్ అని తెలుసుకున్న ముఖ్యమంత్రి, అతనికి ఉపాధి మెరుగుపరచడం కోసం బ్యాటరీ ఆటోను మంజూరు చేయాలని అక్కడికక్కడే జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. అయితే.. అదే పర్యటనలో మరో సందర్భంలో ఒక మహిళ తన విద్యావంతుడైన కుమారుడికి ఉద్యోగం కావాలని చంద్రబాబును అభ్యర్థించారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో.. ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
ఈ వీడియో వెనుక ఉన్న వాస్తవాలను ఇప్పటికే ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టం చేసినప్పటికీ, మళ్ళీ అదే పాత అబద్ధాన్ని కొత్తగా ప్రచారం చేయడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఒక పక్క అభివృద్ధి పనులతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే.. మరోపక్క ఇటువంటి తప్పుడు ప్రచారాలతో గందరగోళం సృష్టించాలని చూడటం సమంజసం కాదని లోకేశ్ పేర్కొన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని హెచ్చరించారు.
రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు సహజమని, కానీ వ్యక్తిత్వ హననానికి పాల్పడటం లేదా వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవపట్టించడానికి ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికి విఘాతమని పరిశీలకులు సైతం అంటున్నారు. గతంలో కూడా ఇలాంటి ఎడిటెడ్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. వాటిపై అప్పట్లో పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులపై అసత్య ప్రచారాలు చేస్తే కఠిన శిక్షలు తప్పవని లోకేష్ అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cp-has-not-changed-and-will-not-change-25-218204.html
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు తారాహై కత్బర్ట్ మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.