మనదేశంలో కరోనాకు తోడు మరో ప్రాణాంతక వ్యాధి.. ఇప్పటికే పలువురి మృతి.. 

Publish Date:Dec 17, 2020

Advertisement

కరోనా తో సతమతమవుతున్న భారత్ ను తాజాగా మరో ముప్పు వణికిస్తోంది. గుజరాత్‌లో తాజాగా మరో ప్రాణాంతక వ్యాధి తీవ్ర కలకలం రేపుతోంది. మ్యూకార్ మైకోసిస్ (Mucormycosis) అనే అరుదైన ఫంగస్ వ్యాధి.. అహ్మదాబాద్‌లో కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే అహ్మదాబాద్‌లో 44 మంది ఈ వ్యాధి బారిన పడి ఆస్పత్రుల్లో చేరారు. వీరిలో 9 మంది చికిత్స పొందుతూ ఇప్పటికే మరణించారు. కరోనా బాధితుల్లో కనిపిస్తున్న ఒక అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్ వారి కంటిచూపుతో పాటు ప్రాణాలను కూడా హరించి వేస్తోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుజరాత్ రాష్ట్రం లో అహ్మదాబాద్‌తో పాటు పలు నగరాల్లో మ్యూకార్ మైకోసిస్ వ్యాధి బాధితులు ఆస్పత్రుల్లో చేరుతుండడంతో ఇపుడు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.

 

మ్యూకార్ మైకోసిస్ అనేది చాలా తీవ్రమైన, అరుదైన ఫంగల్ ఇన్‌ఫెక్షన్. మ్యుకోర్మిసెట్స్ (mucormycetes) అనే ఒకరకమైన ఫంగస్ వలన ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి ఎలాంటి వాతావరణంలోనైనా సంక్రమిస్తుంది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సాధారణంగా ముక్కులో ఇన్‌ఫెక్షన్ తో ఈ వ్యాధి మొదలవుతుంది. అక్కడి నుంచి ఇది కళ్లకు వ్యాపిస్తుంది. ప్రారంభ దశలోనే కనుక ఈ వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకుంటే దీని నుండి బయటపడవచ్చు. ఒకవేళ ఈ వ్యాధిని గుర్తించడంలో ఆలస్యమైనా.. లేక ట్రీట్‌మెంట్ తీసుకోకుండా అజాగ్రత్తగా ఉన్నా.. ప్రాణాలుపోయే ప్రమాదముంది. ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిపై ఈ మ్యూకార్ మైకోసిస్ ఎక్కువ ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా కరోనా సోకని వారిలో "మ్యూకార్ మైకోసిస్" వ్యాప్తి చెందడానికి 15 నుంచి 30 రోజుల సమయం తీసుకుంటుందని, అయితే కరోనా రోగులకు మాత్రం ఇది 2 నుంచి 3 రోజుల్లోనే సోకుతోందని నిపుణులు తెలియచేస్తున్నారు. తాజాగా ఢిల్లీలో సర్ గంగారామ్ ఆస్పత్రిలో రెండు రోజుల క్రితం 12 మ్యుకోర్మికోసిస్ కేసులు నమోదయ్యాయి. ముంబైలోనూ పలువురు ఆస్పత్రుల్లో అడ్మిట్ అయ్యారు. ఇది ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

ఈ వ్యాధి నుండి కాపాడుకోవడం ఎలా..

ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రతను తప్పకుండా పాటించాలి. ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి. ముక్కును, కంటిని ఎటువంటి పరిస్థితుల్లోనూ చేతులతో తాకకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ముక్కు, గొంతు, కళ్లు భాగాల్లో వాపు కనిపిస్తే వెంటనే అశ్రద్ధ చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే కనుక తేలికగా దీని నుండి బయటపడవచ్చు. నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రాణాలకే ప్రమాదం. కనుక ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండి మనల్ని మనం కాపాడుకుందాం.

By
en-us Political News

  
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.