తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్కు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు గురువారం సమన్లు జారీ చేసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం వల్ల ప్రజా ధనానికి భారీ నష్టం వాటిల్లిందంటూ భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి జిల్లా కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారించిన కోర్టు కేసీఆర్, స్మితా సబర్వాల్ కు అక్టోబర్ 17న కోర్టుకు హాజరు కావాల్సిందిగా ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.
ఈ పిటిషన్ ను విచారణలో భాగంగా గతంలోనే కోర్టు మాజీ సీఎం కేసీఆర్, మరో ఏడుగురికి నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుల మేరకు మాజీ మంత్రి హరీష్ రావు తరఫున అడ్వకేట్లు కోర్టుకు హాజర య్యారు. అలాగే మెగా కృష్ణారెడ్డి, రజత్ కుమార్, ఎల్అండ్ టీ ఎండీ సురేశ్ కుమార్ తరపున సుప్రీంకోర్టు అడ్వకేట్ అవధాని, శ్రావణ్ రావు హాజరయ్యారు. ఇక ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్లు హరి రామ్, శ్రీధర్ తరపున వరంగల్ అడ్వకేట్ నరసింహా రెడ్డి హాజరయ్యారు. అయితే, మాజీ కేసీఆర్, ఐఏఎస్ అధికారణి స్మితా సబర్వాల్ కోర్టుకు హాజరు కాకపోవడం, వారి తరఫున లాయర్లు కూడా అప్పియర్ కాకపోవడంతో భూపాలపల్లి జిల్లా కోర్టు అక్టోబర్ 17న విచారణకు హాజరుకావాలని మరోసారి సమన్లు జారీ చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/court-summons-kcr-smitha-sabharwal-25-184362.html
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
20 వార్డుల్లో 17 స్థానాలు గెలుపు.!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో పెను తుపాను ముప్పును ఎదుర్కొంటోంది.
కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్పర్సన్ ఎన్నికల కౌంటింగ్లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.