Publish Date:Nov 19, 2024
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ నాయకుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు వైఎస్ అవినాష్ రెడ్డికి మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలంటూ, వైఎస్ సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం(నవంబర్ 19) విచారణ జరిపింది. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన వ్యక్తిని శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి బెదిరించారని.. వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సుప్రీం కోర్టు ధర్మాసనానికి తెలిపారు. ఒక ప్రైవేటు డాక్టర్‌గా ఉన్న వ్యక్తి జైలుకు వెళ్లి సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని కోర్టుకు వివరించారు.
డాక్టర్ చైతన్య రెడ్డి జైలుకు రెగ్యులర్‌గా వెళ్లే వారా, కాదా అని సీజేఐ ధర్మాసనం ఆరా తీయగా..డాక్టర్ చైతన్య జైలు నిబంధనలకు విరుద్ధంగా వెళ్లారని.. ఆయన రెగ్యులర్‌గా వైద్య పరీక్షలు నిర్వహించే డాక్టర్ కాదని లూథ్రా కోర్టుకు తెలిపారు.
అలాగే ఈ కేసులో డాక్టర్ చైతన్య, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చాలన్న లూథ్రా ధర్మసనాన్ని కోరారు. వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి 8వ నిందితుడిగా ఉన్నారని.. దర్యాప్తులో కీలకమైన వ్యక్తి అని కోర్టుకు వివరించారు. ధర్మాసనం ఈ వాదనల్ని పరిగణలోకి తీసుకుని డాక్టర్ చైతన్య, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా చేర్చడానికి అంగీకరించింది. అలాగే ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ మార్చి 3కు వాయిదా వేసింది.
మరోవైపు సుప్రీం కోర్టులో సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి, సీబీఐ ఎస్పీ రాంసింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పైనా విచారణ జరిగింది. తమపై నమోదు చేసిన కేసులను క్వాష్ చేయాలని కోరగా.. వివేకా హత్య కేసు పరిణామాలను సునీత తరఫు లాయర్ లూథ్రా కోర్టుకు వివరించారు. వివేకా హత్య కేసులో దర్యాప్తు అధికారిపై ప్రైవేటు ఫిర్యాదు చేయడం ద్వారా విచారణ పురోగతిని అడ్డుకున్నారని కోర్టుకు తెలిపారు. ఈ హత్య కేసును తప్పుదోవ పట్టించాలని చూశారని.. ఆ తర్వాత రక్తపు వాంతులు అని ప్రచారం చేశారన్నారు. కోర్టు ఆదేశాలతో కేసు దర్యాప్తు సాగుతోన్న సమయంలో ప్రైవేటు ఫిర్యాదు చేశారన్నారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం.. తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 24కి వాయిదా వేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/court-notices-to-ysavinash-reddy-39-188618.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది