అరెస్టు నుంచి కొడాలి నానికి కోర్టు మధ్యంతర ఉత్తర్వుల రక్షణ!

Publish Date:Jul 1, 2026

Advertisement

వైసీపీ హయాంలో బూతుల మంత్రిగా గుర్తింపు పొందిన కొడాలి నాని.. ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పలుమార్లు గీత దాటారు. ప్రత్యర్థులపై బూతుల పంచాగంతో విరుచుకుపడటమే కాకుండా, పలు కబ్జాలు, దాడుల కేసులలో కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి.  

ముఖ్యంగా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యంగా కొడాలి నాని  పలు సందర్భాలలో అనుచిత, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, నాని పాత కేసుల ఫైళ్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.  వైసీపీ హయాంలో చేసిన వ్యాఖ్యలు, చేష్టలపై పోలీసులు విచారణ వేగవంతం  చేశారు. తాజాగా  2021 స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో నాటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, చంద్రబాబులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు కొడాలి నానిపై అప్పట్లో నమోదైన కేసులో చర్యలు తీసుకునేందుకు పోలీసలు సిద్ధమయ్యారు. దీంతో కొడాలి నాని అరెస్టు ఖాయమన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అయ్యింది. కానీ, ఆ కేసులో తన అరెస్టుకు రంగం సిద్ధమౌతోందని తెలియగానే..  కొడాలి నాని అప్రమత్తమయ్యారు. హైకోర్టును ఆశ్రయించి అరెస్టు చేయకుండా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. 

 ఐదేళ్ల నాటి పాత కేసులో ఇప్పుడు అంత అర్జెంటుగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు..   ప్రస్తుతానికి కొడాలి నానిని అరెస్ట్ చేయవద్దని పోలీసు శాఖను ఆదేశించింది. దీనితో  తక్షణ అరెస్టు నుంచి బయటపడ్డారు. కాగా వైసీపీ హయాంలో హద్దులు దాటి దూషణలు, దాడులు, కబ్జాలకు పాల్పడిన కేసుల్లో పలువురు వైసీపీ నాయకులు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన అరెస్టు అయ్యారు.    అయితే కొడాలి నాని మాత్రం ఆ కేసులలో అరెస్టు కాకుండా పదేపదే బయటపడుతుండటం విశేషం. 

కొడాలి నాని   గతంలో ఒక సారి ఆరోగ్య సమస్యల కారణంగా అరెస్టు నుంచి తప్పించుకోగలిగారు.  మెడికల్ గ్రౌండ్స్ చూపించి అప్పట్లో తప్పించుకున్న నాని, ఇప్పుడు కోర్టు లీగల్ ప్రొసీడింగ్స్ ద్వారా చట్టపరమైన రక్షణ పొందారు. ఒకవైపు గుడివాడలో ఆయనపై కొత్త కేసులు నమోదవుతున్నా, మరోవైపు లా విద్యార్థులు సైతం ఆయన గత వ్యాఖ్యలపై ఫిర్యాదులు చేస్తున్నా నాని మాత్రం అరెస్టు నుంచి తప్పించుకోగలుగుతున్నారు.   వైకాపా పవర్ పోయిన తర్వాత చాలా సైలెంట్‌ అయిపోయిన నాని.. కేసుల ఇబ్బందులు, అరెస్టు ముప్పు నుంచి తప్పించుకోవడానికి తెరవెనుక గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
ఉత్తరాంధ్ర రూపురేఖలను సమూలంగా మార్చేసే దిశగా రూపుదిద్దుకున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది.
హీరో మోటోకార్ప్ విడా VX2 GO FB 3.1kWh ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. రూ.1.13 లక్షల ధరతో 128 కిమీ రేంజ్, 70 కిమీ టాప్ స్పీడ్, డైరెక్ట్ ప్లగ్ ఛార్జింగ్, 4.3 అంగుళాల డిస్‌ప్లే మరియు 65 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
కోల్‌కతా నైట్ రైడర్స్ KKR లో తీవ్ర నాయకత్వ సంక్షోభం! అజింక్య రహానే రిటైర్మెంట్‌తో కొత్త కెప్టెన్ అన్వేషణ మొదలైంది. ఐపీఎల్ 2024 విజేత శ్రేయస్ అయ్యర్‌ను వదులుకోవడం వల్ల కేకేఆర్ ఎలా నష్టపోయిందో, రాబోయే ఐపీఎల్ 2027 కోసం రేసులో ఉన్న ఆటగాళ్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నేడు ప్రారంభం కానుంది.
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఏపీ సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు.
55 అడుగులు దాటిన నీటిమట్టం..!
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
మైలవరం రాజకీయాలు, వీటీపీఎస్ ఫ్లై యాష్ రవాణా వివాదం, పార్టీ అంతర్గత అంశాలపై మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు
తెలంగాణరాష్ట్రంలోని ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం మరో మంచి అవకాశాన్ని కల్పించింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఎంతోమంది మహిళలు నాలుగు గోడల మధ్యే తమ జీవితాలను పరిమితం చేసుకుంటున్నారు.
దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన 2020 ఈశాన్య ఢిల్లీ మత ఘర్షణల కేసులో న్యాయస్థానం అత్యంత సంచలనాత్మక తుది తీర్పును వెలువరించింది.
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు
కోర్టు ఆదేశాలను ఉద్దేశపూ ర్వకంగా ఉల్లంఘించిన వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.