ఇంటింటికీ రేష‌న్‌.. జ‌గ‌న్ స‌ర్కార్‌కు కోర్టు మ‌రో మొట్టికాయ‌

Publish Date:Jul 19, 2022

Advertisement

భ‌గవంతుని లీల‌లు ఎవ్వ‌రికీ అర్ధంగావంటారు మ‌త‌ప్ర‌చార‌కులు. ఎప్పుడు ఏది జ‌రుగుతుంద‌న్న‌ది ప‌ర‌మాత్మున‌కే ఎరుక అని బోధ‌చేస్తుంటారు. అందువ‌ల్ల సామాన్య‌మాన‌వులం పెద్ద‌గా దాన్ని గురించి ఆలోచించ‌వ‌ద్ద‌ని, నీతిగా బ‌త‌క‌మ‌నీ బోధిస్తుంటారు గురువులు. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డి  ప‌రిపాల‌నా లీల‌లు ఆయ‌నంత‌ట ఆయ‌నే ప్ర‌జ‌ల‌కు అర్ధమ‌య్యేలా చేస్తుంటారు. వ్య‌ర్ధానికి అస‌లు అర్ధం ఆయ‌నే ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయ‌డం మ‌రెవ్వ‌రివ‌ల్లా ఏ ప్ర‌భుత్వం వ‌ల్లా కాలేదు. రాష్ట్రంలో పాఠ‌శాల‌ల విలీనం పేరుతో విద్యార్ధుల‌ను పక్క వీధికి కాకుండా ప‌ది కిలోమీట‌ర్ల ప్ర‌యాణానికి సిద్ధ‌ప‌డేలా చేశారు. అందుకు పూర్తి విరుద్ధంగా గ్రామాల్లో ప్ర‌జ‌లు ప‌క్క‌నే వున్న ప‌చారీ కొట్టుకు వెళ్ల‌లేర‌ని రేష‌న్ స‌రుకునంతా బండ్ల మీద ఇళ్ల వ‌ద్ద‌కే తోలుతున్నారు. ఇది వింత విడ్డూరమా.. జ‌గ‌న్ మ‌తి భ్ర‌మించిందా.. అన్న అనుమానాలు యావ‌త్  ఆంధ్రా చ‌ర్చించుకుంటోంది. ఒక్క ఆలోచ‌న జీవితాన్నే మారుస్తుందంటారు.. జ‌గ‌న్  ఒక్కో ఆలో చనా ఒక్కోర‌కం ఇబ్బందికి గురిచేస్తోంది. 

జ‌గ‌న్ ఆలోచ‌న‌తో రాష్ట్రంలో ప్ర‌జ‌లు ప‌చారీకొట్టుకు వెళ్ల‌లేని బ‌ద్ధ‌క‌స్తులా అనే అనుమానం త‌లెత్తుతోంది. వాహ‌నాలుపెట్టి రేష‌న్ సామాన్లు అందించే వ్యాపారంతో ఎవ‌రికి ల‌బ్ధి క‌లుగుతుందో గానీ, ఆ వాహ‌నాలేవో పిల్ల‌ల్ని బ‌డికి తీసికెళ్లేందుకు క్యాబ్‌లుగా పెడితే త‌ల్లిదండ్రులు వేనోళ్ల కీర్తించేవారు క‌దా జ‌గ‌న‌న్నా!  ఈ స‌ల‌హాదారులెవ‌రూ ఇటువంటివి చెప్ప‌రేమో! జ‌గ‌న్ ఈ విధంగా ప్ర‌జ‌ల ధ‌నం వృధా చేస్తున్నార‌ని హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. దానిపై విచార‌ణ చేప‌ట్టిన కోర్టు ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌మ‌ని కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.  హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌  ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

పక్కనే ఉన్న చౌకధరల దుకాణాలకు వెళ్లకుండానే ఇంటి వద్దే సరకులు ఇస్తామనడంలో హేతుబద్ధత ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. సరకులు పంపిణీ చేసినందుకు వాహనాల ద్వారా ప్రజాధనాన్ని భారీగా వినియోగిస్తున్నారని కోర్టు పేర్కొంది. వీలు చూసుకుని ప్రజలు అరగంట కేటాయిస్తే రేషన్ దుకాణానికి వెళ్లి సరుకులు తెచ్చుకోవచ్చని, ఆ స్థితిలో కూడా పేదలు లేరా అని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రేషన్ సరుకుల పంపిణీకి డీలర్ కు ఇచ్చే కమీషన్ కంటే డోర్ డెలివరీ ద్వారా ప్రజాధనం భారీగా దుర్వి నియోగం అవుతుందని కోర్టు అభిప్రాయపడింది.

రేషన్ షాపులకు రాకుండా డోర్ డెలివరీ చేయడానికి చేసే ఖర్చుతో పేదలకు మరిన్ని రేషన్ సరుకులు అందించ‌వ‌చ్చని కోర్టు సూచించింది. సరకుల సరఫరా, చౌకదుకాణాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం నిధులిస్తున్నదని.. మరి కేంద్రం నుంచి రేషన్ డోర్ డెలివరీకి అనుమతి తీసుకున్నారా, ఏ  నిబంధన లను అనుసరించి వాహనాల ద్వారా ఇంటింటికీ సరకుల పంపిణీకి సిబ్బందిని నియమించారు? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తమ ప్రశ్నలకు వివరణ ఇస్తూ కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభు త్వాన్ని ఆదేశించింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. 

వాహనాల ద్వారా ఇంటివద్దకే సరకుల సరఫరా పథకాన్ని, అందుకు సంబంధించిన జీవోలను సవాలు చేస్తూ ‘ఏపీ చౌకధరల దుకాణదారుల సంక్షేమ సంఘం’ హైకోర్టులో పిటిషన్ వేసింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది కె.శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. ఇంటి వద్దకే రేషన్‌ పంపిణీ పథకం కోసం రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నా ఉద్దేశం సక్రమంగా నెరవేరుతున్నట్లు కనిపించడం లేదన్నారు. మొబైల్‌ వాహనం ఎప్పుడొస్తుందో తెలీక నిరుపేదలు, రోజుకూలీలు పనులు మానుకొని ఇంటి వద్దే ఎదురుచూడాల్సి వస్తుం దన్నారు. 

ఇంటింటికీ రేషన్ పథకం అమలు కోసం ఏపీ ప్రభుత్వం దాదాపు 92 వేల మందిని నియమించగా, వాహన దారుకు ఒక్కొక్కరికి నెలకు రూ.21 వేలు చెల్లిస్తున్నారని కోర్టుకు తెలిపారు. రేషన్ డెలివరీ వాహనాల కోసం సైతం రూ.600 కోట్లు ఖర్చు చేశారని కోర్టుకు తెలిపారు. కేవలం ఏజెన్సీ ప్రాంతాల్లో కొండలు, గుట్టలు దాటి గిరిజనులు సరకులు తెచ్చుకోవాల్సి ఉంటుందని, అలాంటి చోట రేషన్ డోర్ డెలివరీ చేస్తే అర్థం ఉంటుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. వివరాలు సమర్పించాలంటూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు.

ప్రభుత్వాలు పలు విధానాలు అమలు చేస్తాయని అందులో భాగంగా రేషన్ సరుకులని పేద ప్రజలకు ఇంటింటికీ సరఫరా చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు ఏజీ శ్రీరామ్‌. ఇలాంటి ప్రభుత్వ విధాన నిర్ణయాలలో న్యాయస్థానం జోక్యం చేసుకోకూడదన్నారు. అయితే న్యాయస్థానం అడిగిన ప్రశ్నలకు పూర్తి వివరణతో కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు.

By
en-us Political News

  
  జబ్బార్ భాయ్ విచారంగా మౌలానా దగ్గిరికి వచ్చాడు. తన కొడుకులు ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని మౌలానాకు వివరించాడు. నాకే ఇలా  ఎందుకు జరుగుతుంది.  కోట్లాది రూపాయల విలువ చేసే ఇల్లు నాకుంది . లీగల్ హెయిర్ సర్టిఫికేట్ లో నలుగురు కొడుకుల పేర్లు ఉన్నాయి. ఈ ఆస్తి వారికే చెందుతుంది. నా భార్య చనిపోయింది. రెండు పూటల భోజనం  దొరకడం లేదు. నలుగురు కొడుకులు  తిండి పెట్టడం లేదు. నాకే ఇలా ఎందుకు జరుగుతుంది. 
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా ఆస్ట్రేలియా, ఇండియా మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి టెస్ట్ శుక్రవారం (నవంబర్ 22) పెర్త్‌వేదికగా మొదలైంది. తొలి టెస్ట్ తొలి రోజు ఆట ముగిసే సరికి ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్ లో 67 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ సారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పది రోజుల పాటు సాగాయి. విపక్ష వైసీపీ ప్రతిపక్ష హోదా డిమాండ్ తో సమావేశాలను బహిష్కరించింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పీఏసీ కమిటీ సభ్యుల ఎన్నికకు పోలింగ్ పూర్తయ్యింది. దీనితో పాటు ప్రజాపద్దులు , అంచనాలు, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ ల్లో సభ్యుల నియామకం కోసం ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలను వైసీపీ బాయ్ కాట్ చేసింది.
 వైఎస్ జగన్ టార్గెట్ గా ఆయన సోదరి వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. నా పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నాను. నాడు ప్రభాస్ ఎవడో నాకు తెలియదు నేడు కూడా తెలియదు.
అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల కోనసీమ జిల్లా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును రా ష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ గా నియమించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ పదవి ద్వారా వేగుళ్లకు క్యాబినెట్ హోదా దక్కుతుంది.
ఉత్తర ప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం గత కొన్నేళ్ళుగా సాగిస్తున్న బుల్డోజింగ్ ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధమని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనదిగా భావించాలి. నిందితుడికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి. ఒక అధికారి న్యాయమూర్తిగా వ్యవహరించి నిందితుడి ఆస్తిని నేలమట్టం చేయడం అధికారాల విభజన సూత్రాన్ని ఉల్లంఘించడమే అవుతుందని దేశ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.
హైద్రాబాద్ ఉప్పల్ ప్రాంతానికి చెందిన ఆర్యన్ రెడ్డి  అమెరికాలో గన్ ప్రమాదవశాత్తు పేలి చనిపోయాడు. ప్రమాదవశాత్తు జరిగిందా? ఆర్యన్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడా అనేది తేలాల్సి  ఉంది.
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలం అరాచకం రాజ్యమేలింది. వ్యవస్థలన్నిటినీ గుప్పెట్లో పెట్టుకుని వైసీపీయులు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. పార్టీ కోసం పని చేసే వారికి దొడ్డిదారిన ప్రభుత్వ కొలువులు కట్టబెట్టేసి.. ప్రజాధనాన్ని అప్పనంగా దోచిపెట్టేశారు అప్పటి ముఖ్యమంత్రి జగన్. తన కోసం, తన ప్రత్యర్థులపై ఇష్టారాజ్యంగా నోరు పారేసుకున్న వారినీ, సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి పార్టీల నేతలపై అసభ్య పోస్టులు పెట్టీ, ఫోటోలు మార్ఫ్ చేసీ వేధింపులకు గురి చేసిన వారికీ పెద్ద పీట వేశారు.
రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన హైడ్రా కీలక సమావేశం శుక్రవారం (నవంబర్ 22)న జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ అధికారులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశం కానున్నారు.
పోసాని కృష్ణ మురళి తన విలక్షణ నటనతో తెలుగు సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు పొందారు. ఏదో మేరకు అభిమానులనూ సంపాదించుకున్నారు. అయితే ఎప్పుడైతే ఆయన రాజకీయాలలోకి ప్రవేశించి.. జగన్ పంచన చేరారో అప్పటి నుంచి ఆయన మాట, తీరు, నడక, నడత పూర్తిగా మారిపోయింది. జగన్ అధికారంలో ఉన్నంత కాలం బుర్ర, బుద్ధి అనే వాటితో అవసరం లేదనీ, కేవలం నోటికి పని చేబితే చాలు వైసీపీలో పబ్బం బ్రహ్మాండంగా గడిచిపోతుందనీ కనిపెట్టేశారు. అంతే అప్పటి నుంచీ పోసాని మంచి చెడు, మర్యాద, మన్నన అనేవి పూర్తిగా మరిచిపోయారు.
అదానీ వ్యాపార సామ్రాజ్యం అత్యంత వేగంగా విస్తరించడం వెనుక రాజకీయ అండదండలున్నాయన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఆయన వ్యాపార లావాదేవీల్లో పారదర్శకత తరచూ ప్రశ్నార్థకమౌతూనే ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం (నవంబర్ 22)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 19 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.