ప్రపంచం మీద తెల్లబంగారం మెరుపులు!!

Publish Date:Oct 7, 2023

Advertisement

ప్రపంచవ్యప్తంగా కోట్లాది మందికి జీవనోపాధి.. మానవాళి శరీరాన్ని సదా రక్షిస్తున్న దుస్తుల తయారీలో ముఖ్య ముడిపదార్థం..  ఫైబర్‌గా మాత్రమే కాకుండా ఆహారంగానూ అక్కరకొస్తున్న ఏకైక పదార్థం  ఒకటుంది. అదే ‘మనం తెల్ల బంగారం’గా పిలుచుకునే పత్తి. ప్రపంచవ్యాప్తంగా అనునిత్యం అనేక విధాలుగా అందరికీ ఉపయోగపడుతూ మరింత అన్వేషణలకు మార్గం చూపుతున్న పత్తి  దినోత్సవం నేడు (అక్టోబర్ 7). రోజువారి జీవితంలో విడదీయరాని ప్రాధాన్యత ఉన్న పత్తిని కేవలం ఒక ముఖ్యమైన వస్తువుగా మాత్రమే పరిమితం చేయలేం. గ్రామీణ జనాభాకు జీవనోపాధి కల్పించడంలో పత్తి ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాలు, ముఖ్యంగా వెనుకబడిన ప్రదేశాల్లో పత్తి ఒక ముఖ్యమైన ఆదాయ, ఆర్థిక, ఉపాధి వనరుగా విశిష్ట గుర్తింపు పొందింది. మనవాళి జీవితాల్లో అంత ప్రముఖమైన పత్తి ఆవశ్యకత, దాని ప్రయోజనాల గురించి సమాజంలో అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ప్రతి సంవత్సరం ప్రపంచ పత్తి దినోత్సవం నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 7న నిర్వహించే ఈ ప్రత్యేక రోజు ప్రాధాన్యతను ఏమిటో చూస్తే..

అసలు ఎలా మొదలైంది..

పత్తి దినోత్సవాన్ని నిర్వహించడం 2019లో ప్రారంభమైంది. సబ్-సహారా ఆఫ్రికాలోని బెనిన్, బుర్కినా ఫాసో, చాడ్, మాలీ అనే నలుగురు ప్రధాన పత్తిసాగుదారులు ఇందుకు తోడ్పడ్డారు. వీరు నలుగురు 2012లో ప్రపంచ పత్తి దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించారు. ఈ విషయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థకు ప్రతిపాదన చేశారు. 2019లో బెనిన్, బుర్కినా ఫాసో,చాడ్, మాలీల ప్రతిపాదనను ప్రపంచ వాణిజ్య సంస్థ స్వీకరించి మొదటి ప్రపంచ పత్తి దినోత్సవ వేడుకలను నిర్వహించింది. తొలిసారి జరిగిన ఆ వేడుకల్లో యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ కాటన్ అడ్వైజరీ కమిటీ, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ కూడా ఆ వేడుకల్లో పాలుపంచుకున్నాయి. దీంతో అప్పటి నుంచి పత్తి దినోత్సవం వేడుక కొనసాగుతోంది.

పత్తి దినోత్సవం గమ్యం ఇదే..

‘మేకింగ్ కాటన్ ఫెయిర్ అండ్ సస్టైనబుల్’ అనే థీమ్‌ను మూడవ అధికారిక పత్తి దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి స్వీకరించింది. వ్యవసాయం నుంచి ఫ్యాషన్ వరకు ఆర్థికాభివృద్ధిలో పత్తి పోషిస్తున్న పాత్రపై అవగాహన కల్పించాలని ఐరాస ఆశాభావం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ వాణిజ్యం, పేదరిక నిర్మూలన, సమ్మిళిత ఆర్థికాభివృద్ధి, ఉత్పాదక ఉపాధిని కల్పిస్తున్న పత్తి గొప్పతనాన్ని చాటి చెప్పాలని ఐరాస లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు ఐక్యరాజ్యసమితి అధికారిక వెబ్‌సైట్‌ చెబుతోంది. మెరుగైన ఉత్పత్తి, పౌషకాహారం, మెరుగైన పర్యావరణం, మెరుగైన జీవితం కోసం పత్తిరంగం పునరుద్ధరణను పత్తి దినోత్సవం గుర్తుచేస్తుంది. పత్తి దినోత్సవం లక్ష్యం సాకారం కావాలని సగటు పౌరులుగా అందరూ ఆశించాలి. ఇక  పత్తికి సంబంధించిన   రెండు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుంటే..

1. ఒక టన్ను పత్తి సగటున 5 మందికి ఏడాది పొడవునా ఉపాధిని అందిస్తుందని అంచనాగా ఉంది.

2. వస్త్రాలు, దుస్తులలో ఉపయోగించే ఫైబర్‌తో పాటు ఆహార ఉత్పత్తులను పత్తి నుండి సేకరించవచ్చు. పత్తి విత్తనాల నుంచి తినదగిన నూనె, పశుగ్రాసం సేకరించవచ్చు. 


                                         *నిశ్శబ్ద.


 

By
en-us Political News

  
వేసవి సెలవలు పూర్తయ్యాక పిల్లలు స్కూల్ కు వెళ్లడం అనేది సహజం. పాఠశాలకు వెళ్లడం పిల్లల జీవితంలో పెద్ద మార్పుగా మారుతుంది. మరీ ముఖ్యంగా కొత్తగా స్కూల్ లో జాయిన్ అయిన పిల్లల విషయంలో...
ప్రజల జీవితాలలో ముఖ్యమైనవి సంబంధాలు. నేటికాలంలో ఇంటర్నెట్, డిజిటల్ పరంగా ఎంత దూరంలో ఉన్నా ఎవరినీ పెద్దగా మిస్ కాకుండా పక్కనే ఉన్నట్టుగా పోన్ మాట్లాడటం, వీడియో కాల్స్ చేయడం వంటి మార్గాలలో దగ్గరగానే ఉన్నట్టు ఫీల్ అవుతారు. కానీ బంధాల మధ్య గతంలో కంటే అపార్థాలు, గొడవలు, అతిగా స్పందించడం..
మొబైల్ వ్యసనం మీ మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, నిద్ర, మానసిక ఆరోగ్యంపై మొబైల్ వల్ల కలిగే సమస్యలు మరియు వాటి నుంచి బయటపడే మార్గాలను MindVision వేణుగోపాల్ ఈ వీడియోలో సులభంగా వివరించారు...
ఒక ఉత్తమమైన తరాన్ని సమాజానికి ఇచ్చే ఉద్దేశంతో వివాహం చేసుకుంటారని పెద్దలు చెబుతారు. ఆరోగ్యకరమైన బంధం ద్వారా  ఒక మంచి తరం తయారవుతుంది. కుటుంబం విషయానికి వస్తే.. వంశం ముందుకు సాగడం అనేది పిల్లల ద్వారానే జరుగుతుంది...
నేటి కాలంలో, సంబంధాలు బలపడటానికి , విచ్ఛిన్నం కావడానికి కమ్యూనికేషన్ సరిగా లేకపోవడమే అతిపెద్ద కారణంగా మారింది. అది కుటుంబ సంబంధం అయినా, స్నేహ సంబంధం అయినా, లేదా మరేదైనా వ్యక్తిగత సంబంధం అయినా..
చుట్టూ ఉన్నవాళ్లు అందరూ మంచివాళ్లు ఉండరు. మనుషుల్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ కొందరిలో స్వార్థం..
నేటి వేగవంతమైన జీవితంలో మనుషులకు అన్ని భౌతిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ, రెండు విషయాలలో మాత్రం  వెనుకబడిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మొదటిది గాఢమైన, నిజమైన సంబంధాలను నిలబెట్టుకోవడం కాగా, రెండవది మనశ్శాంతి లేకపోవడం
ప్రతి ఒక్కరూ దీర్ఘాయువును కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ వృద్ధాప్యాన్ని యవ్వనంలో ఉన్నంత ఆరోగ్యంగా, అద్భుతంగా గడపాలని, 100 ఏళ్ల వరకు బ్రతకాలని,  ఆ వయసులో కూడా ఎలాంటి వ్యాధులు లేకుండా ఉండాలని కోరుకుంటారు.
ప్రపంచంలో ప్రతి ప్రాణికి ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా మనిషికి ఏ మాత్రం అనారోగ్యంగా అనిపించినా మొదట వైద్యుడిని కలుస్తాడు.  వైద్యులు ఆరోగ్య జాగ్రత్తలు,  అనారోగ్యం తగ్గడానికి మందులు...
ఏ రిలేషన్ కు అయినా  మంచి కమ్యూనికేషనే  పునాది. అది స్నేహమైనా, కుటుంబమైనా, లేదా ఆఫీసు  వాతావరణమైనా, చక్కగా కమ్యూనికేట్ చేయడం అనేది..
ప్రేమ అనేది బార్యాభర్తలు, ప్రేమికుల మధ్య ఉండే మధురమైన అనుభూతి. నిజానికి  అన్ని బంధాలలో ప్రేమ ఉన్నా.. ప్రేమికులు, భార్యాభర్తల...
ఏ బంధం అయినా ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇద్దరు వ్యక్తుల మధ్య పరిస్థితులు,  సందర్బాలు చాలా మారుతూ ఉంటాయి. కొన్ని సార్లు అర్థం చేసుకోలేని పరిస్థితులు ఎదురవుతాయి,  మరికొన్ని సార్లు చాలా ఎమోషనల్ గా అటాచ్ అయిపోయి ఉంటారు...
ఆడపిల్లను కన్న ప్రతి తల్లిదండ్రి  పెద్దయ్యే వరకు అపురూపంగా ఒక యువరాణిలాగా పెంచుకుంటారు. కానీ వయసుకు వచ్చాక తప్పనిసరిగా పెళ్లి చేసి ఇంకొక ఇంటికి కోడలిగా పంపాల్సిందే.. అయితే భారతదేశంలో..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.