అవినీతి అధికారుల మధ్య లెక్క తేలని వాటాలు,వెలుగులోకి వచ్చిన అసలు నిజాలు......

Publish Date:Oct 17, 2019

Advertisement

 

కష్టపడి పని చేసే శ్రామికుల వేతనాలు అధికారుల చేతి వాటం ప్రదర్శించారు. అందినకాడికి దోచుకున్నారు. చివరకు వాటాల్లో తేడా వచ్చే సరికి అక్రమార్కుల బండారం బైటపడింది. అది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నిన్న మొన్నటివరకు కేవలం టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో మాత్రమే అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉండేవి. ఇప్పుడు పారిశుధ్య విభాగానికి కూడా పాకే రోజంతా శ్రమించి పని చేసే కార్మికుల జీతాలను కూడా స్వాహా చేయడం మొదలు పెట్టారు కొందరు అధికారులు.

తీగ లాగితే డొంకంతా కదిలినట్టు వాటా పంపకాల్లో తేడా రావడంతో చివరకు అవినీతి పుట్ట కదిలింది. విజయవాడ నగర పాలక సంస్థలో పారిశుధ్య నిర్వహణకు మూడు వేల మంది డ్వాక్రా సభ్యులు పనిచేస్తున్నారు. వీరికి ఇరవై నెలల క్రితం వరకూ పది వేల రూపాయల వేతనం చెల్లించేవారు. ఇరవై నెలల కిందట కార్మికుల జీతాన్ని పదకొండు వేల రూపాయలకు పెంచారు.

జీతమైతే పెంచారు కానీ వాటిని అమలు చేయకుండా కాగితాలకు మాత్రమే పరిమితం చేశారు. దీంతో ఇప్పటి వరకు ఒక్కో కార్మికుడికి ఇరవై వేల వరకు వేతన బకాయిలు చెల్లించాల్సి వుంది. అందరికీ కలిపి ఇరవై నెలలకు సుమారు ఆరు కోట్ల రూపాయల వరకు పెండింగ్ లో ఉన్నాయి. రెండు నెలల క్రితం మొత్తం వేతన బకాయిలు యాభై శాతం అంటే మూడు కోట్ల రూపాయలు విడుదలయ్యాయి.

కొంత మంది అవినీతి అధికారులు కుమ్మక్కై ఈ నిధుల్లో ముప్పై లక్షల వరకు పక్కదారి పట్టించారు. వాస్తవంగా పని చేసే కార్మికుల కన్నా రికార్డుల్లో ఎక్కువ సంఖ్య ను చూపి నిధులను దారి మళ్లిస్తున్నారన్న ఆరోపణలు గత కొంతకాలంగా వినిపిస్తూ వచ్చాయి.

దీనికి చెక్ పెట్టేందుకు కార్మికులకు ఐరిష్ హాజరును ప్రవేశపెట్టారు దీన్ని సైతం తప్పు దారి పట్టించేలా రికార్డు సృష్టించారని సమాచారం. కేవలం రికార్డుల్లో మాత్రమే ఉండి క్షేత్ర స్థాయిలో లేని కార్మికులకు ఇంతకాలం గుట్టుచప్పుడు కాకుండా జీతాలు డ్రా చేశారు.  ఇప్పుడు వారి వేతన బకాయిలను కూడా చడీచప్పుడూ లేకుండా స్వాహా చేసేందుకు పథకం వేసుకున్నారు. అదే సమయంలో అవినీతి అధికారుల మధ్య వాటాలు పంచుకోవడంలో విబేధాలు తలెత్తాయి.

ఇప్పటి వరకూ గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న ఈ వ్యవహారం కాస్త కమిషనర్ దృష్టికి వెళ్లింది. కార్పోరేషన్ లో జరుగుతున్న అవినీతి భాగోతంపై కమిషనర్ రహస్యంగా విచారణ జరిపారు. నిధులు పక్కదారి పట్టాయన్న ఆరోపణ లో వాస్తవం ఉందని నిర్థారించుకున్నారు. సంబంధిత విభాగం ఉన్నతాధికారి కి షోకాజ్ నోటీస్ తో పాటు విభాగం సూపరింటెండెంట్ ను సస్పెండ్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు.దీనిపై జగన్ సర్కార్ ఎలాంటి చర్యను తీసుకోబోతోందో వేచి చూడాలి.

By
en-us Political News

  
ఏపీలో అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల వేళ నేతల ప్ర‌చారం హోరెత్తుతోంది. రాష్ట్రం న‌లుమూల‌లా అభ్య‌ర్థులు గెలుపుకోసం ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లి ఓట్లు అభ్య‌ర్థిస్తున్నారు. ఏపీ మొత్తం ఒక ఎత్త‌యితే గుంటూరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ఒక్కటీ ఒక ఎత్తు. ఈ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో రాజ‌కీయ చైత‌న్యం ఎక్కువ‌, మేధావి వ‌ర్గ‌మూ ఎక్కువే. అలాంటి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం అభ్య‌ర్థి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పార్టీకి రైతులు ఓట్లు పడే అవకాశాలు ఎంతమాత్రం లేకుండా పోయాయి.. దీని వెనుక ఎన్నో
చిన్నారుల్ని ఎన్నికల ప్రచారానికి వినియోగించటం తప్పుగా పేర్కొన్న నిరంజన్ రెడ్డి ఫిర్యాదుకు ఎన్నికల సంఘం స్పందించింది. జరిగిన సంఘటనపై విచారణ జరిపించాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను ఆదేశించింది. దీంతో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ.. సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రాకు ఆదేశాలు జారీ చేశారు. అమిత్ షాతో పాటు.. మరో నలుగురిపైనా మొఘల్ పురా పోలీసులు కేసు నమోదు చేసి.. ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
పదవి ఊడబోతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నవరత్నాల పేరుతో ఏవేవో పథకాలు అనౌన్స్ చేసి 2019లో
తన అన్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మానసిక పరిస్థితి మీద తనకు అనుమానంగా వుందని ఆయన సోదరి,
ఈ ఏడాది దీపావళి పండగ కొద్ది నెలల ముందే రాబోతోంది. ఈ ఏడాది మే 13న నరక చతుర్దశి, జూన్ 4న దీపావళి రానున్నాయి
ఇది ప్రపంచ వింతల్లో ఎన్నో నంబర్ అవుతుందో తెలియదుగానీ, ఇది నిజంగానే ప్రపంచ వింతే! మజ్లిస్ పార్టీ అధినేత,
సోనియా గాంధీ, రాహుల్​ గాంధీలు ఇప్పటికే పార్లమెంట్​లో ఉన్నారు. ఇప్పుడు తాను కూడా పోటీ చేసి గెలిస్తే. గాంధీ కుటుంబలో ఉన్న ముగ్గురూ. చట్టసభలో కూర్చున్నట్టు అవుతుంది. ఇది బీజేపీకి మరో అస్త్రంగా మారుతుందని ప్రియాంక గాంధీ భ‌య‌ప‌డ్డారు.
అమెరికాలో నర్సుగా పనిచేసిన 41 ఏళ్ళ హీథర్ ప్రెస్డీ అనే మహిళకు కోర్టు 7 వందల సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
గంజాయి వ్యాపారం సామ్రాజ్యాన్ని సృష్టించిన వారిని గుంజీలు తీయిస్తానని పెమ్మసాని హెచ్చరించారు.  గుంటూరులో ఎమ్మెల్యే స్థాయి వ్య‌క్తి గుట్కా, గంజాయి అమ్ముతున్నాడని ఘాటుగా విమ‌ర్శించారు. గుంటూరు జిల్లాను గంజాయి మత్తులో ముంచుతారా అంటూ నిలదీస్తున్నారు. గంజాయి మొక్కలను పీకి పారేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. 
హైదరాబాద్ నుయూటీ చేసే కుట్ర జరుగుతున్నదని,దాన్ని తిప్పి కోట్టాలని బీఆర్ఎస్ అందుకున్న కొత్త పల్లవి కేవలం తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి లోక్ సభ ఎన్నికలలో లబ్ధి పొందే ఎత్తుగడేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని యూటీ చేయాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఇటీవల ఆరోపించారు.
స్త్రీ, పురుషుల వైవాహిక స్థితి ఎలా వున్నప్పటికీ, పరస్పర అంగీకారంతో ఇద్దరు స్త్రీ పురుషులు శారీరక సంబంధం కలిగి వుంటే దాన్ని నేరం
రాజకీయ నాయకులంటే జనం చెవుల్లో పూలు పెట్టకపోతే కుదరదు. తెలంగాణ ప్రజల చెవుల్లో ఇప్పటి వరకు బీఆర్ఎస్ నాయకులు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.