జగనన్న కాలనీల్లో భారీ అవినీతి!

Publish Date:Apr 5, 2025

Advertisement

ఒక్క నెల్లూరు జిల్లాలోనే 120 కోట్ల అవినీతి దందా

మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపణ

జగన్ హయాంలో కాదేదీ అవినీతికి అనర్హం అన్నట్లుగా పాలన సాగింది. జగన్ ఐదేళ్ల పాలన అంతా దోచుకో.. దాచుకో అన్న తరహాలోనే సాగిందన్న ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని అధికారం కోల్పోయిన తరువాత.. జగన్ హయాంలో జరిగిన అవినీతి బయటపడుతోంది. తాజాగా జగనన్న కాలనీల్లో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్ధసారథి ఆరోపించారు. ఒక్క నెల్లూరు జిల్లాలోనే జగనన్న కాలనీల్లో 120 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆయన తెలిపారు.

 పొదలకూరు పంచాయతీ పరిధిలోని చిట్టేపల్లి తిప్ప వద్ద గత ప్రభుత్వంలో జగనన్న కాలనీ పేరుతో ఏర్పాటు చేసిన నాసిరకం ఇళ్ల నిర్మాణాలను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి శుక్రవారం (ఏప్రిల్ 4) పరిశీలించిన మంత్రి కొలుసు, గత పాలకులు గృహ నిర్మాణాన్ని అవినీతి కూపంగా మార్చారని విమర్శించారు. జగనన్న కాలనీల్లో ఒక్క నెల్లూరు జిల్లాలోనే 120కోట్ల అవినీతి జరిగిందని, రాష్ట్రవ్యాప్తంగా మరెంత  జరిగిందోనన్న విషయం తేలాల్సి ఉందన్నారు. పొదలకూరు చిట్టేపల్లి తిప్ప వద్ద  ఇళ్ళ నిర్మాణంలో జరిగిన అవినీతిపై దర్యాప్తునకు ప్రత్యేక కమిటీ వేస్తామని చెప్పారు. అక్కడ నిర్మించిన పునాదులు నివాసయోగ్యం అని తేలితే ఇళ్ల నిర్మాణం  పూర్తి చేయిస్తామని, నివాసయోగ్యం కాదని తేలితే  కాంట్రాక్టర్ పై క్రిమినల్ కేసులు పెట్టి ఆర్ఆర్ యాక్ట్ కింద రికవరీ చేస్తామని చెప్పారు. అర్హత గల ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ఇల్లు కట్టించే ఇవ్వాలన్నదే చంద్రబాబు ఆశయమన్న కొలుసు పార్థ సారథి,  గతంలో ఎన్టీఆర్ గృహ నిర్మాణంలో భాగంగా ఆగిపోయిన పేమెంట్లు మొత్తం చెల్లిస్తామన్నారు.  

సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ చిట్టిపల్లి తిప్ప వద్ద జగనన్న కాలనీ లెవెలింగ్, నిర్మాణాల పేరుతో ఆరున్నర కోట్ల రూపాయలు వైకాపా నాయకులు  దోచుకున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఫోరం జాతీయ అధ్యక్షులు దేగా రవి రాఘవేంద్ర, పట్టణ తెలుగుదేశం అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున్ నాయుడు, నాయకులు కోడూరు పెంచల భాస్కర్ రెడ్డి, కలిచేటి శ్రీనివాసులు రెడ్డి, పెంచల నాయుడు, ఆదాల సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు.

By
en-us Political News

  
ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేకపోయాననే అసంతృప్తి.. కొత్తగా తన జీవితంలోకి వచ్చిన భర్తపై ద్వేషంగా మారిందా? కాపురం ప్రారంభమై నెల రోజులు కూడా గడవకముందే ఓ నవవధువు తీసుకున్న నిర్ణయం
సోషల్ మీడియాలో విపరీతమైన వ్యూస్, లైక్స్ సంపాదించాలనే దురాశతో కొందరు యువకులు రోజుకో ప్రమాదకర చర్యకు పాల్పడుతున్నారు.
గుంపులను చెదరగొట్టేందుకు  టియర్ గ్యాస్   ప్రయోగించారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో  భద్రతా దళాలు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టాయి. 
ఇంటర్నెట్ వినియోగం కేవలం పెద్దలకే పరిమితం కాదు, పిల్లలకు కూడా ఇదొక ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
రాత్రి అందరూ కలిసి భోజనం చేశారు.. ఎన్నో ఆశలతో నిద్రలోకి జారుకున్నారు.. కానీ తెల్లవారేసరికి ఆ ఇంట్లో ఐదుగురు విగతజీవులుగా కనిపించారు
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మహానగరంలో శాంతిభద్రతలకు సవాల్ విసురుతూ మరో కిరాతక ఘటన వెలుగు చూసింది.
పెంపుడు జంతువుల పట్ల యజమానులు చూపే ప్రేమ రోజుకో కొత్త రూపం దాల్చుతోంది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు, మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ మేనల్లుడైన ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసులు విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం (FRRO) నుంచి కఠినమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
అమెరికాలోని చికాగో సమీపంలో ఒక భారీ ఉగ్ర కుట్ర తృటిలో తప్పింది.
బెంగళూరులోని ఒక పబ్‌లో పోలీసులతో జరిగిన వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కఠినంగా స్పందించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.