వ్యాక్సిన్ అతి త్వరలోనే...

Publish Date:Jul 21, 2020

Advertisement

ప్రపంచమంతా ఎదురుచూస్తున్న కోవిద్ 19 వైరస్ ను ఎదుర్కొనే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేస్తుంది. కోట్లాదిమందికి సోకి లక్షలాది మందిని బలితీసుకున్న ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు పలుదేశాల్లో 140పైగా పరిశోధనలు జరుగుతున్నాయి. వివిధ దశల్లో ఉన్న ఈ పరిశోధనల్లో సైంటిస్ట్ లంతా నిమగ్నమయ్యారు. అహోరాత్రులు కష్టపడి చేస్తున్న ఆ పరిశోధనల ఫలితాలు అతి త్వరలోనే మానవాళికి అందుబాటులోకి రానున్నాయి.

తొలి వ్యాక్సిన్ సిద్దం చేసిన రష్యా
కోవిద్ 19 వైరస్ తో బాగా ప్రభావితమైన రష్యా వ్యాక్సిన్ తయారిలో చాలా చురుగ్గా పరిశోధనలు నిర్వహిస్తోంది. రష్యాప్రభుత్వం వ్యాక్సిన్ తయారీని ప్రతిష్టాత్మకంగా భావిస్తూ పరిశోధనలను వేగవంతం చేయడానికి కావల్సిన ఏర్పాట్లు చేసింది. 1,2 దశల క్లినికల్ ట్రయల్స్ గతంలోనే పూర్తి చేసిన  సెచెనోవ్ విశ్వవిద్యాలయం ఇప్పుడు మూడోదశ క్లినికల్ ట్రయల్స్ ను కూడా విజయవంతంగా నిర్వహించింది. అన్ని పరీక్షలు మంచి ఫలితాలను ఇచ్చాయని.. ఆగస్టు 3 నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువస్తామని రష్యా ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటించారు. మూడు కోట్ల డోస్ లను దేశీయంగా తయారు చేస్తామని మరో 17కోట్ల డోస్ లు విదేశాల్లో తయారు చేస్తమని ఆయన తెలిపారు. ఈ వ్యాక్సిన్ తమతమ దేశాల్లో తయారు చేయడానికి ఐదు దేశాలు ఇప్పటికే అంగీకరం తెలిపాయన్నారు.   

త్వరలోనే ఫలితాలు..
కోవిద్ 19 వైరస్ ను ఎదుర్కోనే వ్యాక్సిన్ పై  లండన్ లోని ఆక్సఫర్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రయోగాలు విజయవంతమయ్యాయి.  వారు తయారు చేసిన ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కోవిద్ 19 వైరస్ తో సమర్థవంతంగా పోరాడగలదని ప్రకటించారు. చాలా సురక్షితమైన తమ వ్యాక్సిన్ వైరస్ను తట్టుకునే వ్యాధి నిరోధక శక్తి ని ఇస్తుందన్నారు. తమ పరిశోథనల ఫలితాలను ది లాస్సెట్ మెడికల్ జర్నర్ లో ప్రచురించారు. మొదటి దశ, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి అయ్యాయని, చివరి దశగా వృద్దులపై వ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్నయన్నారు.  ఈ ఏడాది చివరి వరకు పూర్తి ఫలితాలు వస్తాయన్నారు. 

తొలిదశ ప్రారంభం
భారత్ లో కోవిద్ 19 వైరస్ ను అరికట్టే వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమైనవి. కాస్త ఆలస్యంగా క్లినికల్ ట్రయల్స్ మొదలైనా.. విజయవంతంగా కొనసాగుతున్నాయి.  దేశంలోని భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ ఫస్ట్ డోస్ 12 చోట్ల 60మంది వాలంటీర్లపై తొలిదశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి.  హైదరాబాద్ లోని నిమ్స్ లో ఇద్దరు వాలంటీర్లకు ఈ వ్యాక్సిన్  ఇచ్చారు. 14రోజుల తర్వాత ఫలితాలు వస్తాయి. 

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.