Publish Date:Jul 30, 2026
ప్రసిద్ధ ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో కుళ్లిన ఆహార పదార్థాల వ్యవహారం తీవ్ర కలకలం రేపింది! బైరాగి పట్టెడ ప్రాంతంలోని జగత్ జీవన్ రావు పార్క్ వద్ద ఉన్న ఒక బిర్యానీ ఫ్యాక్టరీ కమ్ హోటల్, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ, నిల్వ ఉంచిన, కుళ్లిపోయి దుర్వాసన వస్తున్న బిర్యానీని యథేచ్ఛగా వినియోగదారులకు విక్రయిస్తున్నట్టు బయటపడింది.
ఆ కలుషిత బిర్యానీ తిని ఓ మూడేళ్ల చిన్నారి అస్వస్థతకు గురికావడంతో ఆ ఘోటల్ నిర్వాకం బయట పడింది. పాప ఆస్వస్థతకు గురి కావడంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, బంధువులు ఆ హోటల్ వద్దకు చేరుకుని భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే ఆ హోటల్‌ను మూసివేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై భైఠాయించారు.
తిరుపతిలాంటి ఆధ్యాత్మిక నగరంలో కలుషిత ఆహారం విక్రయంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమౌతోంది. ఆహార భద్రత అధికారులు వెంటనే స్పందించి, ఇలాంటి కల్తీ ఆహారం విక్రయించే హోటళ్లపై దాడులు నిర్వహించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Rotten Food Tirupati, Bairagi Patteda Biryani, Tirupati Biryani Hotel, Food Poisoning Tirupati, Telugu ONE
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/contaminated-food-causes-a-stir-in-tirumala-36-227515.html
జెన్ జీ దెబ్బకు మోదీ అర్ధరాత్రి ఇన్‌స్టా వీడియో పెట్టాల్సి వచ్చింది..!
నువ్వు చాలా బాగా పనిచేస్తున్నావు.. శెహభాష్..లోకేష్` అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భుజం తట్టారు.
ఏపీ రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు కేవలం విమర్శలు, ప్రతివిమర్శలకే పరిమితం కాకుండా, శాంతిభద్రతలు వ్యవస్థల పనితీరుపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇటీవల చేపడుతున్న పరామర్శ యాత్రలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్, ఆ సంస్థ మాజీ ఛైర్మన్ అనిల్ డి. అంబానీతో పాటు పలువురు గుర్తుతెలియని ప్రభుత్వ అధికారులు, ఇతర వ్యక్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది.
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) ఆధ్వర్యంలో పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF), ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖల్లోని వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో మరొక అద్భుతమైన చారిత్రాత్మక ఘట్టం నమోదైంది.
ఉత్తరాంధ్ర ప్రగతికి ప్రతిరూపంగా నిలిచే భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంపై
విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్టు కోసం భూములు ఇచ్చిన రైతులే ఉత్తరాంధ్ర కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారని సీఎం చంద్రబాబు అన్నారు.
దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్పీజీ వినియోగదారులకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తీపి కబురు అందించాయి.
మోదీ వికసిత్ భారత్... సీబీఎన్ విజన్ ప్రతిరూపం భోగాపురం..!
ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి మహత్తర అడుగు పడింది.
పెళ్లైన నెలలకే షాక్..ఆస్ట్రేలియా ఉద్యోగం పేరుతో ఘరానా మోసం..!