ఏసీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య..!
Publish Date:Aug 11, 2026
Advertisement
ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన 2024 బ్యాచ్ కానిస్టేబుల్ జర్కుల సాయి కుమార్ (PC 13128) బుధవారం తెల్లవారుజా మున 2.30 గంటల సమయంలో ఏసీపీ కార్యాల యంలోని రెస్ట్‌రూమ్‌లో ఉరివేసుకున్నట్లు సిబ్బంది గుర్తించారు. సాయికుమార్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తు న్నాడు. ప్రస్తుతం ఈ-కాప్స్ డ్యూటీ కోసం ఏసీపీ కార్యాలయానికి అటాచ్ మెంట్‌పై ఉన్నట్లు సమా చారం. కర్మన్‌ఘాట్‌లో స్నేహితులతో కలిసి ఓ గదిలో నివాసం ఉంటున్నాడు. ఘటనపై సమా చారం అందుకున్న పోలీసులు వెంటనే సాయికుమార్‌ను కామినేని ఆస్ప త్రికి తరలించారు. అయితే అప్పటికే సాయి కుమార్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సాయికుమార్ మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే అప్పటికే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తమకు సమాచారం ఇవ్వకుండానే మృతదే హాన్ని తరలించడంపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. సాయికుమార్ ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ను తమకు అప్పగించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఆత్మహత్యకు ముందు ఆయన ఎవరితో మాట్లాడారు? ఎవరైనా సందేశాలు పంపారా? అనే వివరాలు తెలుసుకునేందుకు ఫోన్ కీలకమని వారు పేర్కొన్నారు. సాయి కుమార్‌పై అధికారుల వేధింపులు ఉన్నాయని, వాటి కారణంగానే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కానిస్టేబుల్ ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు ముందు చోటుచేసుకున్న పరిణామాలతో పాటు సాయికుమార్ విధులు, అతడి మొబైల్ ఫోన్‌లోని వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. దర్యాప్తు పూర్తయితే ఆత్మహత్యకు గల అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. Constable suicide, Office of ACP, LB Nagar Police Station, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand,Telangana police
http://www.teluguone.com/news/content/constable-suicide-36-228693.html





