జనసేనాని పవన్ హత్యకు కుట్ర.. నివాసం వద్ద రెక్కీ?

Publish Date:Nov 2, 2022

Advertisement

జనసేన అధినేత పవన్ కల్యాణ్ హత్యకు కుట్ర జరుగుతోందా? ఇందు కోసం ఆయన నివాసం వద్ద రెక్కీ జరిగిందా అంటే ఔననే అంటున్నారు ఆయన రక్షణ సిబ్బంది. హైదరాబాద్ లోని పవన్ కల్యాణ్ నివాసం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విశాఖపట్నంలో పవన్ పర్యటన సందర్భంగా విమానాశ్రయం వద్ద మంత్రుల వాహనాలపై దాడి సంఘటన అనంతరం పవన్ పై హత్యకు కుట్ర పన్నారని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఘటన తరువాత జపనసేన కార్యాలయం వద్ద కూడా అనుమానాస్పద వ్యక్తులు సంచరించారని ఈ సందర్భంగా వారు తెలిపారు.  

తాజాగా   పవన్​ నివాసం వద్ద కొందరు యువకులు సోమవారం అర్ధరాత్రి సమయంలో అనుమానాస్పదంగా తచ్చాడుతూ కనిపించారనీ, ప్రశ్నించిన రక్షణ సిబ్బందిని దూషించి గొడవపడ్డారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో తీసినట్లు చెప్పారు.   పవన్​   రాకపోకలను గమనిస్తూ కారు, బైక్ లపై ఫాలో అవుతున్నారని ఆరోపించారు. ఈ ఫిర్యాదుతో పవన్ కల్యాణ్ నివాసం వద్ద బందోబస్తును పోలీసులు పటిష్ఠం చేశారు. 

By
en-us Political News

  
భారత దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీ కోసం ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే తమ వ్యూహాలను రచిస్తున్నాయి.
న్నబిడ్డలకు కడుపునిండా అన్నం పెట్టలేని నిస్సహాయత.. కనీస అవసరాలు తీర్చలేని దుర్భర పరిస్థితి.
భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సైబర్ భద్రతా రంగంలో తీవ్ర కలకలం రేపిన ఒక పెద్ద ఉదంతాన్ని ఎదుర్కొంది.
24 ఏళ్లకే అద్భుత ఆవిష్కరణ.. డేటా స్టోరేజ్‌ రంగంలో యువతి సంచలనం.!
ఉద్యోగ వేటలో విజయం సాధించి తొలిసారి కొలువులో అడుగుపెట్టే యువతకు కేంద్ర ప్రభుత్వం నుంచి అండగా నిలిచేలా సరికొత్త వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో కీలక పరిణామం చోటుచేసుకుంది.
సోషల్ మీడియా మోజు ఎంతలా పెరిగిపోయిందంటే.. కొందరు కనీస మానవీయ విలువలను, కన్నబిడ్డల భద్రతను కూడా విస్మరిస్తున్నారు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
హైదరాబాదు నగరంలోని నాదర్‌గుల్‌లో ఉన్న ఎంవీఎస్ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో దాండియా వేడుకలు నిర్వహించారు.
తెలంగాణ వ్యాప్తంగా దసరా పండుగ శోభ సంతరించుకున్న వేళ, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎర్రవెల్లి నివాసంలో దసరా వేడుకలను అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.