అమెరికా అధ్యక్షుడు సహా అగ్రనేతల హత్యలకు కుట్ర

Publish Date:Apr 25, 2026

Advertisement

అమెరికా రాజకీయ యవనికపై పెను సంచలనం సృష్టించిన బహుళ హత్యల కుట్ర కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ప్రస్తుత, మాజీ అధ్యక్షులతో పాటు పలువురు కీలక నేతలను అంతమొందించేందుకు పథకం రచించిన పాకిస్థానీ పౌరుడు ఆసిఫ్ రజా మెర్చంట్‌ను న్యూయార్క్ జ్యూరీ దోషిగా నిర్ధారించింది. ఇరాన్ ప్రభుత్వ అధికారిక విభాగమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) కనుసన్నల్లోనే   ఈ హత్యలకు ప్రణాళికలు సిద్ధమైనట్లు విచారణలో తేలింది. ఇది కేవలం ఒక నేరపూరిత చర్య మాత్రమే కాదని, అమెరికా ప్రజాస్వామ్య మూలాలపై జరిగిన దాడిగా అధికారులు అభివర్ణిస్తున్నారు.

48 ఏళ్ల  ఆసిఫ్ రజా  వ్యాపారవేత్త ముసుగులో అమెరికాలోకి ప్రవేశించి ఈ వినాశకర మిషన్‌ను ప్రారంభించాడు. విచారణ సంస్థల కథనం ప్రకారం,  2022 నుంచే ఇరాన్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌తో సంబంధాలు కలిగి ఉన్నాడు. గూఢచర్యంతో పాటు కౌంటర్ సర్వైలెన్స్‌లో శిక్షణ పొందిన ఇతడు, దుస్తుల వ్యాపారం,  బ్యాంకింగ్ అవసరాల నిమిత్తం పాకిస్థాన్, ఇరాన్, అమెరికా దేశాల మధ్య తరచూ ప్రయాణించేవాడు. అయితే.. ఈ ముసుగు వెనుక అమెరికా రాజకీయాలను అస్థిరపరచాలనే భారీ కుట్ర దాగి ఉందని ఎఫ్‌బీఐ ఆధారాలతో సహా నిరూపించింది.

2024 ఏప్రిల్‌లో అమెరికా చేరుకున్న మెర్చంట్.. అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలోనే హింసను ప్రేరేపించాలని ప్లాన్ చేశాడు. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్, నిక్కీ హేలీ వంటి అగ్రనేతలను లక్ష్యంగా చేసుకున్నట్లు కోర్టు విచారణలో వెల్లడైంది. హత్యలు చేయడమే కాకుండా, అల్లర్లు సృష్టించడం,  నిరసనల ద్వారా గందరగోళం రేపడం ఇతని ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం న్యూయార్క్‌లో కిరాయి హంతకుల   కోసం అన్వేషణ ప్రారంభించి, నదీమ్ అలీ అనే వ్యక్తిని సంప్రదించాడు. అయితే..  అలీ వెంటనే అప్రమత్తమై అమెరికా దర్యాప్తు సంస్థలకు సమాచారం అందించడంతో ఈ రహస్య ఆపరేషన్ వెలుగులోకి వచ్చింది.

ఈ కేసులో అమెరికా గూఢచారి విభాగాలు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. ఎఫ్‌బీఐ ఏజెంట్లు కిరాయి హంతకులుగా మారి మెర్చంట్‌ను కలవగా.. అతడు తన ప్రణాళికలను నాప్‌కిన్‌పై బొమ్మలు గీసి వివరించాడు. భద్రతా ఏర్పాట్లు, ర్యాలీలలో కాల్పులు జరపాల్సిన పద్ధతులపై స్పష్టమైన ఆదేశాలిచ్చాడు. ముందస్తు ఖర్చుల కింద 5,000 డాలర్ల నగదును కూడా అందజేశాడు. సంభాషణల్లో 'ఫ్లీస్ జాకెట్' అంటే హత్య అని, 'టీ-షర్ట్' అంటే అల్లర్లు అని కోడ్ వర్డ్స్ ఉపయోగించినట్లు ఫోన్ డేటా ద్వారా నిరూపితమైంది.

పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద మూలాలు ఇప్పుడు ఇరాన్ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయనే అంశం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో చర్చనీయాంశమైంది. అల్-ఖైదా, లష్కరే తోయిబా వంటి సంస్థలకు నిలయంగా ఉన్న పాకిస్థాన్.. ఇప్పుడు ఇరాన్ ప్రాక్సీ'ఆపరేషన్లకు వేదికగా మారుతోందని విశ్లేషకులు అంటున్నారు. ఒకవైపు పాకిస్థాన్‌ను భద్రతా భాగస్వామిగా చూస్తూనే, మరోవైపు ఆ దేశ పౌరులే అమెరికా అధ్యక్షులపై దాడులకు సిద్ధపడటం అమెరికా విదేశాంగ విధానంపై కొత్త ప్రశ్నలను లేవనెత్తింది.

బ్రూక్లిన్‌లోని ఫెడరల్ కోర్టులో జరిగిన విచారణలో, తాను తన కుటుంబ రక్షణ కోసమే ఇదంతా చేశానని మెర్చంట్ వాదించినప్పటికీ, జ్యూరీ అతని వాదనలను తోసిపుచ్చింది. మార్చి 6, 2026న అతడిని దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువడింది. దేశ సరిహద్దులు దాటి ఉగ్రవాద చర్యలకు పాల్పడటం, హత్యలకు కుట్ర పన్నడం వంటి అభియోగాల కింద అతనికి జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. అమెరికా భూభాగంపై అగ్రనేతలను హతమార్చాలనే శత్రుదేశాల ప్రయత్నాలను తమ చట్టవ్యవస్థ సమర్థవంతంగా అడ్డుకుందని అమెరికా అటార్నీ జనరల్ ప్రకటించారు. ఈ పరిణామం భవిష్యత్తులో విదేశీ ప్రయాణికుల స్క్రీనింగ్ మరియు వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసే దిశగా అడుగులు వేస్తోంది.

- సీతారాం కంఠంనేని

By
en-us Political News

  
నల్లమలలో సోదాలు.. కౌకూర్‌, యాప్రాల్‌, అచ్చంపేటలో ఆయుధాల కోసం గాలింపు..!
హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని హరిహర మెన్ హాస్టల్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. తోటి పనివాడు ప్రమోద్ జరిపిన కత్తిపోట్లకు కుక్ శశిధర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ సంచలన చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 11 మంది ప్రాణాలు తీసిన ఈ ఘటన వెనుక లాల్ మందిర్ దాడి కుట్ర, మూత్రం నుంచి బాంబు తయారీ, 12 సార్లు రెక్కీ నిర్వహించిన విస్తుపోయే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
అమెరికాలోని పెన్సిల్వేనియా ల్యాంకాస్టర్ కౌంటీలో ఎఫ్రాతా పోలీసులు చేపట్టిన కీలక అరెస్ట్ వివరాలు. క్రైమ్‌వాచ్ నిఘా మరియు తాజా క్రైమ్ అప్‌డేట్స్ కోసం చదవండి.
ఒడిశా కోరాపుట్ పరిధిలోని బాలిపేట సేవాశ్రమం హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి సీయారా తాడింగిపై సహవిద్యార్థి తీవ్రంగా దాడి చేశాడు. మత్తు పదార్థాల ప్రభావంతోనే ఈ దాడి జరిగిందని, ర్యాగింగ్ అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆయుధాలు చోరీ అయ్యాయి అంటూ సీన్ క్రియేట్ చేసిన ఇంటి దొంగలు..!
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.