కొడాలి నాని హత్యకు కుట్ర..ట ?

Publish Date:Oct 11, 2022

Advertisement

ఆగండాగండి. తొందరపడకండి. హెడ్లైన్ చూసి, మాజీ మంత్రి కొడాలి నాని హత్యకు కుట్ర జరుగుతోందని, ఎవరో అలాంటి కుట్ర ఏదో చేస్తున్నారనినే నిర్ణయానికి వచ్చేయకండి. నిజానికి, ఆయన మంత్రి పదవి పోయినప్పటి నుంచి ఒక విధమైన డిప్రెషన్ లోకి  వెళ్ళారో ఏమో మనకు తేలియదు కానీ  ఆ మధ్యన సోషల్ మీడియాలో వైరల్ అయిన,  పశువుల కొష్టంలో మాజీ మంత్రి పడక సీన్ దృశ్యాలు చుసిన వారు మాత్రం ఆయన  డిప్రెషన్ లోకి వెళ్లారనే నిర్ణయానికే వచ్చారు. సరే, ఆయన డిప్రెషన్ లోకి వెళ్ళారో లేక ఇంకేదైనా పనిలో బిజీ అయిపోయారో ఏమో కానీ ఈ మధ్య కాలంలో ఆయన ఎక్కడ అంతగా కనిపించ లేదు. వినిపించడం లేదు.

 నిజానికి మాజీ మంత్రి కొడాలి నాని మాత్రమే కాదు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఫస్ట్ కాబినెట్ లో పని చేసిన మాజీ మంత్రులు చాలా వరకు సైలెంటై పోయారు. ఇప్పటికే, మూట కట్టుకున్న పాప, పుణ్యాలు చాలనుకున్నారో జనంలోకి వెళ్లి ‘దీవెనలు’ అందుకోవడం ఎందుకని అనుకున్నారో ఏమో కానీ, చాలా వరకు పార్టీ కార్యకలాపాలకు కూడా మాజీలు  దూరంగానే ఉంటున్నారని అంటున్నారు. 

అయితే, ఈ మధ్య ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి, గడపగడపకు కార్యక్రమం విషయంలో అశ్రద్ధ వహిస్తే, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని  గట్టిగా హెచ్చరిక చేయడంతో మాజీ మంత్రులు మెల్ల మెల్లగా కదులుతున్నారు. నిజానికి గడపగడపకు వెళ్ళినా ఇంటింటికి వెళ్లి మనిషి మనిషికి వంగి వంగి దండాలు పెట్టినా  జనం వైసీపీకి మరో అవకాశం లేదని, ముఖం మీదనే చెప్పేస్తున్నారనుకోండి అది వేరే విషయం. నిజానికి, ఇప్పటికే ఎమ్మెల్యేలు అందరికీ ఆ నిజం తెలిసి పోయింది. అయితే, ముఖ్యమంత్రి ముచ్చట ఎందుకు కాదనాలని, మాజీ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు కూడా మొక్కుబడిగా ‘లెక్క’ కోసం గడప గడపకు వెళ్లి వస్తున్నారు. 

అదే క్రమంలో మాజీ మంత్రి కొడాలి నాని కూడా కొద్ది రోజులుగా నియోజక వర్గంలో ఇంటింటికి వెళ్లి దండాలు పెడుతున్నారు. పనిలో పనిగా నోటికి పని చెబుతున్నారు. తనదైన స్టైల్లో తెలుగు దేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మీడియాను తమ వైపు తిప్పుకునేందుకు  జగన్ రెడ్డిని కాసింత ప్రసన్నం చేసుకునేందుకు, జూనియర్ ఎన్టీఆర్ ను అడ్డుపెట్టుకుని తెలుగు దేశం పార్టీలో చిచ్చు పెట్టే వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పార్టీలో నెంబర్ టూ గా ఎదిగి పార్టీ కోసం పాదయాత్రకు సిద్ధమవుతున్న లోకేష్ ను కాదని సిన్మాల్లో జీగా ఉన్న జూనియర్ ఎన్టీఅర్ పార్టీ పగ్గాలు చేపట్ట్టాలని తెలుగు దేశం పార్టీ నేతలు
కోరుకుంటున్నారని తప్పుడు ప్రచారం సాగిస్తున్నారు. నిజానికి, హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో జూనియర్ రియాక్ట్ అయిన తీరుతో ఆయన తెలుగు దేశం పార్టీకి మరింతగా దూరమయ్యారనే అభిప్రాయమే అందిరిలో వుంది. అలాంటిది  జూనియర్ కు పార్టీ పగ్గాలు అప్పగించాలని పార్టీ నాయకులే కోరుకుంటున్నారంటే, అంతకు మించిన అభూత కల్పన,  దిగజారుడు రాజకీయం ఇంకొకటి ఉండదని, కొడాలి అనుచరులే అంటున్నారు.

ఇదే క్రమంలో కొడాలి నానీ, తాను చంద్రబాబు నాయుడు కుట్రలపై నిజాలు చెబుతుండడంతో.. తనను హత్య చేయించే ప్రయాత్నాలు చేస్తున్నారనే అనుమానాలు ఉన్నాయని ఎవరూ నమ్మని.. ఎవరిదాకానో ఎందుకు  కనీసం ఆయన అంతరాత్ర్మ అయినా నమ్మని పచ్చి అబద్ధాన్ని చెప్పుకొచ్చారు. అయినా తాను దేనికీ భయపడేది లేదని ముక్తాయింపు నిచ్చారు, అయితే, హత్యలు చేసిది ఎవరో, చేయించేది ఎవరో... ఆదరికీ తెలిసిన విషయమే. అయితే, రాజకీయంగా ఇప్పటికే  అయిపోయిన  నాని, ఈ విధంగా సానుభూతి సంపాదించాలని అనుకుంటునట్లున్నారు.. అదీ కొడాలి నాని హత్యకు కుట్ర ? హెడ్డింగ్ వెనక ఉన్న కథ.

By
en-us Political News

  
రా బిడ్డా.. అసెంబ్లీకి’.. KTRకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్.!
భారతీయ రైల్వేలో ప్రయాణం చేయడానికి ప్రయాణికులు చాలా కాలం ముందే టికెట్లను రిజర్వ్ చేసుకుంటూ ఉంటారు.
తండ్రి అంటే పిల్లలకు ఉండే ప్రాణం, ఆప్యాయత ఎంతో గొప్పవి. కానీ ఆ ప్రేమ కొన్నిసార్లు ఊహకందని వింత నిర్ణయాలకు దారితీస్తుంది.
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో తీవ్ర కలకలం రేపిన ఉదంతంలో ఒకరు దారుణ హత్యకు గురయ్యారు.
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
జమ్మూకశ్మీర్‌‌లోని కతువా జిల్లాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్‌ నగరంలోని నిమ్స్‌ అదనపు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నోరి లక్ష్మీ భాస్కర్‌పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తును ముమ్మరం చేసింది.
హైదరాబాద్‌లోని టెక్ హబ్ మాదాపూర్‌లో జరిగిన ఒక సంచలన ఘటన కలకలం రేపింది.
దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది
డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.. పబ్‌కు తీసుకెళ్లి రూ.29 వేల బిల్లు.!
హైదరాబాద్ నగరంలోని ఎస్‌ఆర్‌ నగర్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపిన ఒక విషాదకర ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోయింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.