ఛత్తీస్ గఢ్ ఎన్నికలలో విజయం కాంగ్రెస్ దే.. పీపుల్స్ పల్స్ సర్వే

Publish Date:Nov 4, 2023

Advertisement

ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ముందంజలో ఉందని, ఆ పార్టీ మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోవడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.  ఐదేళ్ల కాంగ్రెస్ పాలనపై ప్రజలలో అసంతృప్తి లేకపోవడం ఒక కారణం కాగా.. ప్రధాన కారణం మాత్రం రాష్ట్రంలో బీజేపీ నిర్మాణాత్మక విపక్ష పాత్ర పోషించకపోవడమేనని అంటున్నారు.  దీంతో రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకోవడం ఖాయమని విశ్లేషిస్తున్నారు.

బీజేపీలో అంతర్గత కలహాలు, భూపేష్ కు ప్రత్యామ్నాయంగా బలమైన నేతను తెరపైకి తీసుకురావడంలో బీజేపీ విఫలమైంది. అంతే కాకుండా రాష్ట్ర పార్టీపై బీజేపీ అధిష్ఠానం పట్టు పూర్తిగా సడలిపోవడంతో ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ కు దీటుగా ఎదగడంలో బీజేపీ ఘోరంగా విఫలమైంది. ఇంత ప్రతికూలతలో కూడా గత ఎన్నికల కంటే బీజేపీ ఒకింత మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. అయితే అదే సమయంలో ఆ పెరిగిన బలం రాష్ట్రంలో అధికారం దక్కించుకునేందుకు ఇసుమంతైనా దోహదపడదని చెబుతున్నాయి.  

ఛత్తీస్ గఢ్ ఎన్నికలపై పీపుల్స్ పల్స్ నిర్వహించిన ప్రీపోల్ సర్వే మేరకు కాంగ్రెస్ రాష్ట్రంలో 55 నుంచి 60 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది. బీజేపీ మాత్రం 38 నుంచి 34 స్థానాలకు పరిమితం అవుతుంది. బీఎస్పీ, ఇతరులు కలిసి రెండు స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయి.  90 స్థానాలున్న ఛత్తీస్ గఢ్ లో అధికారం చేపట్టాలంటే కనీసం 46 స్థానాలు సాధించాల్సి ఉంటుంది. పీపుల్స్ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీకి ఆ స్థానాలు సాధించడం నల్లేరుమీద బండి నడకే. పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీల మధ్యే ఉన్నా రెండింటి మధ్యా అంతరం మాత్రం భారీగా ఉందనీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకోవడం ఖాయమనీ పీపుల్స్ పల్స్ సర్వే పేర్కొంది.   ఇలా ఉండగా గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ ఓటు శాతం కూడా పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 2018 ఎన్నికలలో కాంగ్రెస్ 43 శాతం ఓట్లు దక్కించుకుంటే ఈ సారి అది 47శాతానికి పెరిగే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా గత ఎన్నికలలో 33 శాతం ఓట్లు దక్కించుకున్న బీజేపీ ఇప్పడు 42 శాతం ఓట్లు దక్కించుకునే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ సర్వే పేర్కొంది.    

By
en-us Political News

  
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
బంగారం ప్రియులకు ఇది నిజంగానే ఊరటనిచ్చే శుభవార్త అని చెప్పవచ్చు
తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
హానీట్రాప్ ఉచ్చులో పడిన వాయుసేన అధికారి.. షాకింగ్ నిజాలు వెల్లడించిన ఛార్జ్‌షీట్.!
మినీ బస్‌ను ఢీకొన్న ట్రక్కు.. 23 మంది మృతి.!
రాష్ట్రంలో 25 పారిశ్రామిక ఎకోసిస్టమ్ లను అభివృద్ధి చేస్తాం: లోకేష్
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
1999లో ఎయిర్‌పోర్టుల గురించి ఎవరూ పెద్దగా ఆలోచించని సమయంలోనే.. సీఎం చంద్రబాబు నాయుడు శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంపై దృష్టి పెట్టారు.
ఇంట్లో ఆడపిల్ల జన్మిస్తే ఆ ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టేనని పెద్దలు అంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.