ఛత్తీస్ గఢ్ మళ్లీ కాంగ్రెస్ కే.. పీపుల్స్ సర్వే వెల్లడి

Publish Date:Jul 7, 2023

Advertisement

ఈ ఏడాది చివరిలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఎలా చూసినా వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు లిట్మస్ టెస్ట్ అని చెప్ప వచ్చు. ఈ ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి ఎదురు గాలి వీస్తున్నదన్నది పరిశీలకుల విశ్లేషణ. తాజాగా పీపుల్స్ పల్స్ నిర్వహించిన సర్వేలే ఛత్తీస్ గఢ్ లో మరోసారి అధికార పగ్గాలు అందుకునేది హస్తం పార్టీయే అని తేలింది. మూడ్ ఆఫ్ ఛత్తీస్ గఢ్ పేరిన పీపుల్స్ పల్స్ నిర్వహించిన సర్వే మేరకు కాంగ్రెస్ పార్టీ 53 నుంచి 60 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉందనీ, బీజేపీ 20 నుంచి 27 స్థానాలకే పరిమితమౌతుందనీ పేర్కొంది. ఇతరులు మూడు స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందన్నది సర్వే ఫలితం.

90 స్థానాలున్న ఛత్తీస్ గఢ్ అసెంబ్లీలో  అధికారం చేజిక్కించుకోవడానికి కావలసిన స్థానాలు 46. ఆ మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ సునాయాసంగా గెలుచుకుంటుందని పీపుల్స్ పల్స్ సర్వే పేర్కొంది.  2018 ఎన్నికల్లో 43.03 ఓట్లు పొందిన కాంగ్రెస్‌ ఈ సారి   46 శాతం ఓట్లు దక్కించుకుంటుందని  సర్వే పేర్కొంది. 2018 ఎన్నికల్లో 33 శాతం ఓట్లు పొందిన బీజేపీ ఈ సారి కొంత మెరుగు పడి 5 శాతం అధిక ఓట్లతో 38 శాతం ఓట్లు సాధిస్తుందని సర్వే వెల్లడించింది. 2018  అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం, 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్రంలోని 11 లోక్‌సభ స్థానాల్లో 10 స్థానాలు గెల్చుకుంది. అయితే ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం  బీజేపీ ఛత్తీస్ గఢ్ లో మరో సారి అధికారానికి దూరమయ్యే పరిస్థితులే ఉన్నాయని పీపుల్స్ పల్స్ సర్వే పేర్కొంది.

వరుసగా రెండో సారి ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్‌ అధికారం చేపడుతుందని సర్వే తేల్చింది.   ముఖ్యమంత్రి భూపేష్‌ భఘేల్‌ పాలనపై ప్రజల్లో సానుకూలత ఉండడమే కారణమని పేర్కొంది. బీజేపీ జాతీయత, హిందుత్వ అంశాలకు ప్రత్యామ్నాయంగా సీఎం భూపేష్‌ ఛత్తీస్‌గఢ్‌ ఆత్మ గౌరవం అంశంలో భాగంగా ‘ఛత్తీస్‌గఢ్‌ మాతారి’, ‘గదో నవా ఛత్తీస్‌గఢ్‌’ వంటి నినాదాలు ప్రజలను ఆకర్షించాయని సర్వే తేల్చింది.  

ప్రభుత్వం స్థానిక పండుగలకు గుర్తింపు ఇచ్చి సెలవులు ప్రకటించడం, ఛత్తీస్‌గఢ్‌ ఒలింపిక్స్‌ క్రీడలు నిర్వహించడం, రాష్ట్ర గీతం ‘‘అర్ప`పైరి కి ధర్‌’’ ప్రవేశపెట్టడం వంటి కార్యక్రమాలు రాష్ట్రంలో కాంగ్రెస్ ను ప్రజలకు చేరువ చేశాయి. అన్నిటికీ మించి  2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతోపాటు  బెన్‌ ములాఖత్  పేరుతో గ్రామాల్లో, పట్టణాల్లో పర్యటిస్తూ ప్రజలకు చేరువవడం వంటి కార్యక్రమాలు కాంగ్రెస్‌ విజయానికి దోహదపడుతున్నాయని సర్వే పేర్కొంది. 

By
en-us Political News

  
హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ కారిడార్‌ అయిన మాదాపూర్‌లో ఇటీవల వెలుగుచూసిన ఓయో హోటల్ యువతి అనుమానాస్పద మృతి ఉదంతం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య కొత్తలుపులు తెరుస్తోంది.
హైదరాబాద్ మహానగరంలో వినాయక చవితి నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి.
దేశవ్యాప్తంగా ఎంతో అత్యాధునిక సౌకర్యాలు, అత్యున్నత భద్రతా ప్రమాణాలతో ప్రయాణాలకు మారుపేరుగా నిలిచిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఒక ఘటన కలకలం రేపింది.
ప్యారడైజ్‌ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. కానీ థియేటర్‌లో సినిమా చూసే ఆడియన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ సిద్ధమైంది.
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
బెంగళూరులోని కుమ్రం భీం కాదండోయ్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉంటూ తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్న కన్నడ నటుడు దర్శన్ కేసులోని ప్రధాన నిందితురాలు పవిత్రా గౌడ కోర్టులో చేసిన వ్యాఖ్యలు
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.