కాంగ్రెస్ టార్గెట్ జగన్.. ఏపీలో పావులు కదుపుతున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ!?

Publish Date:Dec 18, 2023

Advertisement

దక్షణాదిలో కర్నాటక, తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ ఇప్పుడు మూడో రాష్ట్రంపై కన్నేసిందా? అంటే ఔననే సమాధానమే వస్తుంది. అయితే కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో లా ఏపీలో అధికారాన్ని చేజిక్కించుకోగలుగుతుందా అంటే మాత్రం పరిశీలకులు అంత సీన్ లేదనే అంటున్నారు. అయితే ఏపీలో కాంగ్రెస్ కు ఏ మాత్రం బలం పెరిగినా, అది అంతకు రెట్టింపు అధికార వైసీపీకి నష్టం చేస్తుందని విశ్లేషిస్తున్నారు.

ఇక విషయానికి వస్తే.. తెలంగాణలో విజయంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ బాగా బలహీనపడింది. తెలంగాణలో కోలుకుంది. విభజన జరిగిన పదేళ్ల తరువాత తెలంగాణలో అధికారంలోకి వచ్చింది.  ఇప్పుడు ఏపీలో కూడా పార్టీకి జవసత్వాలు నింపే పనిని కాంగ్రెస్ అధిష్టానం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిపెట్టిన కాంగ్రెస్ ఇప్పటినుంచే ఆ దిశగా ఫోకస్ మొదలు పెట్టింది. తాజాగా విజయవాడలో జరిగిన కాంగ్రెస్ కీలక సమావేశంలో    మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో జనంలోకి వెళ్లేందుకు నిర్ణయించింది. మరోవైపు ఢిల్లీ నుండి పరిశీలకులు వచ్చి వెళ్లడం పెరుగుతున్నది. కాంగ్రెస్ పెద్దలు కూడా ఏపీ కాంగ్రెస్ పై స్పెషల్ ఫోకస్ పెట్టి బూస్టింగ్ ఇచ్చే పని మొదలు పెట్టారు.

కర్నాటకలో విజయంతో తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ పెరిగినట్లే.. తెలంగాణలో అధికారంలోకి రావడంతో ఏపీ కాంగ్రెస్ నేతలలో ఉత్సాహం పెరిగిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే ఏపీలో కాంగ్రెస్ కు ప్రధాన సమస్య నేతల లోటు. ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు, సీనియర్లు రఘువీరారెడ్డి, జెడి శీలం, పల్లంరాజు, తులసి రెడ్డి లాంటి నేతలు ఉన్నా.. వారెవరూ ప్రజాకర్షణ ఉన్న నేతలు కాదు.  జగన్ వేరు కుంపటి అనంతరం, రాష్ట్ర విభజన తర్వాత ఏపీ కాంగ్రెస్ నేతలు, క్యాడర్ వైసీపీ వైపుకు మళ్లింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపాలంటే ముందుగా నేతలను ఆకర్షించాలి.  ఇప్పుడు అధికార వైసీపీలో నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తమ అధినాయకుడు జగన్ ఇష్టారీతిన అభ్యర్థులను మార్చేయడం ఎమ్మెల్యేలకు నచ్చడం లేదు. చివరికి మంత్రులను కూడా  నియోజకవర్గాలను మార్చేయడం జీర్ణించుకోలేకపోతున్నారు. 

ఇప్పటికే జగన్ 11 మంది అభ్యర్థులను మార్చేయగా.. మరో 45 మందితో రెండో జాబితా కూడా సిద్ధం చేసినట్లు చెప్పుకుంటున్నారు. మొత్తం  90 మంది అభ్యర్థులను మార్చేస్తారని పార్టీ వర్గాలే చెప్తున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో అధిష్టానంపై తిరుగుబాటుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే బెంగళూరులో ఓ ఎంపీ నివాసంలో వైసీపీ ఎమ్మెల్యేలు రహస్య సమావేశం ఏర్పాటు చేసుకొని కార్యాచరణ కూడా సిద్ధం చేసుకున్నట్లు వినిపిస్తున్నది. సంక్రాంతి తర్వాత వైసీపీ నుండి భారీగా వలసలు ఉంటాయని ప్రచారం జరుగుతున్నది. కొందరు ఇప్పటికే తెలుగుదేశం నేతలతో టచ్ లోకి వెళ్లారని.. త్వరలోనే వీరు సైకిలెక్కేస్తారనీ అంటున్నారు.  అయితే, తెలుగుదేశం, జనసేన పొత్తుతో వైసీపీ నేతలకు   పెద్దగా స్పేస్ లేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు వైసీపీ నేతలకు కాంగ్రెస్ పార్టీ బెస్ట్ అప్షన్ గా మారుతున్నదని పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ కాస్త ఫోకస్ చేస్తే వైసీపీకి వెళ్లిన వారిలో చాలామంది వెనక్కు వస్తారని విశ్లేషిస్తున్నారు.

అదే జరిగితే ఏపీలో వైసీపీ దారుణంగా పతనమవుతుంది. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలలో ప్రభుత్వంపై అసంతృప్తి కనిపిస్తున్నది. ఇప్పుడు నేతలు కూడా అసంతృప్తితో పార్టీ నుండి వెళ్ళిపోతే ప్రభావం వైసీపీపై చాలా చాలా తీవ్రంగా ఉంటుంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటే ఇక వైసీపీకి ఘోరపరాజయం తప్పదు. వైసీపీ గత ఎన్నికల ఫలితాలలో కనీసం నాలుగు, ఐదు శాతం ఓటింగ్ ను కాంగ్రెస్ చీల్చగలిగినా,   వైసీపీకి  పాతిక సీట్లు  రావడం కష్టమే అవుతుంది. కనీసం రెండు మూడు శాతం ఓటింగ్ చీల్చినా పాతిక సీట్లు కూడా రావు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో వైసీపీకి మరో టెన్షన్ మొదలైంది. వైనాట్ ఏపీ అంటూ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వైసీపీని కోలుకోలేని దెబ్బ కొడుతుందా అనే చర్చ జరుగుతుంది.

By
en-us Political News

  
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాలు. రూ. 5 లక్షల ఉచిత బీమా కవరేజ్, అర్హతలు, వయస్సు పరిమితి మరియు దరఖాస్తు విధానం గురించిన పూర్తి సమాచారం.
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.