తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వంఒక వినూత్న తరహా వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా.. ఈసారి హైదరాబాద్ నగర పరిధిలోని మున్సిపల్ ఎన్నికలను ఒకేసారి కాకుండా విడతల వారీగా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే.. సైబరాబాద్, మల్కాజ్‌గిరి కంటే ముందే జీహెచ్ఎంసీ పరిధిలో పోలింగ్ జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ ఎన్నికలను నవంబర్ నెలలో నిర్వహించేలా కసరత్తు జరుగుతున్నప్పటికీ, అధికారిక షెడ్యూల్, తుది తేదీలపై స్పష్టత రావాల్సి ఉంది.
2020 జీహెచ్ఎంసీ ఎన్నికల నాటి పరిస్థితులతో పోలిస్తే.. ఇప్పుడు తెలంగాణ రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయింది. 2020 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ ఏకంగా 56 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 48 స్థానాలతో గట్టి పోటీ ఇవ్వగా, ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకుంది. కానీ, నాటి అధికార పీఠం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. అయితే అప్పటికీ, ఇప్పటికీ రాజకీయ పరిస్థితుల్లో తీవ్ర మార్పు చోటు చేసుకుంది.
ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని పార్టీలూ.. గ్రేటర్ పీఠాన్ని దక్కించుకోవడానికి ఇప్పటి నుంచే తెరవెనుక వ్యూహాలు, ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఒకేసారి ఎన్నికలు పెడితే యంత్రాంగంపై పడే భారం.. శాంతిభద్రతల సమస్యలు, రాజకీయంగా వచ్చే లాభనష్టాలను బేరీజు వేసుకుంటూ ప్రభుత్వం జీహెచ్ఎంసీకి విడతల వారీ ఎన్నికల ప్లాన్ ను తెరపైకి తెచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ హబ్ అయిన సైబరాబాద్, అత్యంత పెద్ద నియోజకవర్గ పరిధి కలిగిన మల్కాజ్‌గిరిలను పక్కన పెట్టి, మొదట కోర్ సిటీ అయిన జీహెచ్ఎంసీపైనే ఫోకస్ పెట్టడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.
Hyderabad Municipal Elections, GHMC Polls 2026, Telangana Political News, Cyberabad Elections
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/congress-strategy-on-ghmc-elections-39-225481.html
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం వెట్రి తమిళగం విజన్ పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద 50 వేల కోట్ల రాష్ట్ర పెట్టుబడి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు. 2015లోనే నాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్‌పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు.
గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి.
భోగాపురం విషయంలో వైసీపీ అధినేత జగన్.. ఒకే సమయంలో క్రెడిట్ చోరీకీ, విమానాశ్రయం సాకారం కావడం పట్ల విమర్శలకు పాల్పడటం అపహాస్యం పాలౌతోంది.
దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ముఖ్యమంత్రి విజయ్ కావేరి వివాదంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కావేరి జలాలు తమిళనాడుకు అత్యంత కీలకమనీ, ఇతర రాష్ట్రాల వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏకాభిప్రాయ సాధన అవసరమని అన్నారు.
జగన్‌లో మార్పు వుంటుందా, వుండదా అన్న అయోమయంలో వైసీపీ నేతలు.. ఆయనలో మార్పు వుండదన్న నిశ్చయానికి వచ్చేస్తున్నారు.