కర్నాటకకు కాంగ్రెస్ అభ్యర్థులు?

Publish Date:Dec 1, 2023

Advertisement

తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు పట్టం కట్టాయి. కాంగ్రెస్ లో కూడా అధికారం చే జిక్కించుకుంటామన్న ధీమా వ్యక్తం అవుతోంది. అదే సమయంలో ఎగ్జిట్ పోల్స్ కు శాస్త్రీయత లేదనీ, 2018 అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఎగ్జిట్ పోల్స్ తాము అధికారానికి దూరం అవుతాయనే చెప్పాయనీ, కానీ తాము అధికారం చేజిక్కించుకున్నామనీ బీఆర్ఎస్ చెబుతోంది.

ఈ సారీ అదే జరుగుతుందనీ, తాము వరుసగా మూడో సారి అధికారంలోకి వస్తామనీ, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారనీ ధీమాగా చెబుతోంది. అంతే కాదు ముచ్చటగా మూడో సారి కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసే స్థలాన్ని కూడా ఇప్పటికే ఖరారు చేసేసింది. కొత్త సెక్రటేరియెట్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారనీ, ఆయన తొలి సంతకం ఏ ఫైలు మీద చేయాలన్నదానిపై కసరత్తు చేస్తున్నారనీ బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. అయితే కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్ వాదనను కొట్టిపారేస్తోంది. ఏదో రకంగా అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ ప్రజా తీర్పును లెక్క చేయకుండా దొడ్డిదారిన అధికారంలోకి రావడానికి ప్రయత్నించే అవకాశాలున్నాయనీ అనుమానిస్తోంది. ఈ సారి 70కు పైగా స్థానాలలో విజయం ఖాయమన్న ధీమాతో ఉన్న కాంగ్రెస్.. తమ పార్టీ తరఫున గెలుస్తారన్న అభ్యర్థులందరినీ కర్నాటకకు తరలించే యోచన చేస్తున్నది. కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్  ఆధ్వర్యంలో ఈ మేరకు వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం.

ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి అధిక స్థానాలలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. అయితే గెలిచిన వారిని ప్రలోభాలకు గురి చేసి తమ దరికి చేసుకోవడానికి బీఆర్ఎస్ ఇప్పటికే  ప్రయత్నాలు ప్రారంభించిందని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. అందులో భాగంగానే హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనీ, కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయంటూ ఆ పార్టీ నేతలు ప్రకటనలు గుప్పిస్తున్నారని కాంగ్రెస్ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే తమ పార్టీ అభ్యర్థులను ప్రలోభాలకు దూరంగా ఉంచేందుకు కర్నాటకకు తరలించే విధంగా వ్యూహరచన చేస్తున్నదని పరిశీలకులు చెబుతున్నారు. మొత్తం మీద తెలంగాణలో పోలింగ్ పూర్తయిపోయినా రాజకీయ వేడి మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలలో బిజీగా ఉన్నాయి.  

By
en-us Political News

  
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.