గాంధీభవన్‌కు రావొద్దు.. కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ వార్నింగ్..!
Publish Date:Jul 19, 2026
Advertisement
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ కీలక సమీక్ష నిర్వహించింది. జూమ్ వేదికగా జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, పార్టీ నేతలు పాల్గొన్నారు.ఎస్‌ఐఆర్ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించిన నేపథ్యంలో... ఈ సమయాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలోనే ఉండి ఎన్నికల ప్రచారం తరహాలో పనిచేయాలని స్పష్టం చేశారు. చైర్మన్ పదవులు, పార్టీ పోస్టుల కోసం గాంధీభవన్ చుట్టూ తిరగొద్దని, రేపటి నుంచి ఆగస్టు 3 వరకు ఎవరూ గాంధీభవన్‌కు రావద్దని ఆదేశించారు. హైదరాబాద్‌లో కాకుండా నియోజకవర్గాల్లోనే ఉండి ప్రజల మధ్య పనిచేయాలని సూచించారు. సోమవారం నుంచి ఇన్‌చార్జ్ మంత్రులు జిల్లాల వారీగా ఎస్‌ఐఆర్‌పై సమీక్షలు నిర్వహించాలని, ఎంపీలు కూడా పార్లమెంట్ సమావేశాల మధ్య ఎప్పటికప్పుడు సమన్వయం కొనసాగించాలని తెలిపారు. బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బీఎల్‌ఓల నివేదికల కంటే బీఎల్‌ఏల నివేదికలకు ప్రాధాన్యం ఇవ్వాలని, పార్టీ తరఫున పనిచేస్తున్న బీఎల్‌ఏలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. గాంధీభవన్ బృందం కూడా బీఎల్‌ఏ, బీఎల్‌ఓ నివేదికలను నిరంతరం పరిశీలించాలని ఆదేశించారు. ఈ నెల 30న మరోసారి పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించి, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నివేదికలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే అత్యుత్తమంగా పనిచేసే 100 మంది బీఎల్‌ఏలకు రాహుల్ గాంధీని కలిసి ఫోటో దిగే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. Congress SIR Review, CM Revanth Reddy Zoom Meeting, SIR Deadline Extended till August 3
Focus on Ground-Level Campaign, No Visits to Gandhi Bhavan, Stay in Constituencies, Priority to BLA Reports, Gandhi Bhavan
http://www.teluguone.com/news/content/congress-sir-review-25-226453.html




