బీఆర్ఎస్ తో పొత్తు కోసం కాంగ్రెస్ సీనియర్ల తహతహ!

Publish Date:Apr 1, 2023

Advertisement

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఇంచార్జిగా మాణిక్‌రావు గోవిందరావు ఠాక్రే వచ్చిన తర్వాత. గాంధీ భవన్ వాతావరణంలో మార్పు వచ్చింది. కొంత ప్రశాంత వాతావరణం ఏర్పడింది. నాయకుల మధ్య విభేదాలు అలాగే  ఉన్నా.. ఎవరి దారిన వారు పాద యాత్రలు, ఇతర కార్యక్రమాలలో బిజీ అయి పోయారు. అయితే  అధికారం రుచి తెలిసిన సీనియర్ నాయకులు ముఖ్యంగా మొదటి నుంచి గులాబీ బాస్ తో ‘స్నేహ’ సంబంధాలున్నజానారెడ్డి వంటి పెద్దలు బీఅరేస్ తో పొత్తుకు తహతహ లాడిపోతున్నారు. పొత్తు విషయంలో కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే  పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం పొత్తుకు ససేమిరా ఒప్పుకోకోవడం లేదు. కానీ సీనియర్ నాయకులు మాత్రం పట్టువదలని విక్రమార్కుల్లా  బీఆర్ఎస్ తో పొత్తు విషయాన్ని సందర్భం వచ్చి నప్పుడల్లా తెరమీదకు తెచ్చి చర్చకు తెరలేపుతున్నారు.

కొద్ది రోజుల క్రితం పార్టీ సీనియర్ నాయకుడు, భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పొత్తు పొడిచే  అవకాశం ఉందని అన్నారు.  బీజేపీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీ బీఅరేస్ తో పొత్తు పెట్టుకోక తప్పదని  హస్తిన  వేదికగా సంచలన ప్రకటన చేసి  హస్తం పార్టీలో సునామీ సృష్టించారు. అయితే ఆ తర్వాత  రాష్ట్ర ఇన్ చార్జి ఠాక్రే జోక్యం చేసుకుని ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు.   ఇప్పడు మళ్ళీ అదే విషయాన్ని మరో  సీనియర్ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం పెద్దలు అంటూ  గౌరవంగా సంభోదించే మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి లేవనెత్తి  తేనె తుట్టెను కదిల్చారు. చాల కాలం తర్వాత మీడియా ముందుకొచ్చినఈ పెద్దాయన జానారెడ్డి బీజేపీని ఓడించేందుకు అవసరం అయితే కాంగ్రెస్  బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటుందని బాంబు పేల్చారు.  అంతేకాదు రాహుల్ గాంధీ అనర్హత విషయంలో బీఆర్ఎస్  బహిరంగంగా బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిందని సో ... శత్రువు, శత్రువు మిత్రుడు, థియరీ ప్రకారం కాంగ్రెస్  బీఆర్ఎస్ చేతులు కలపవచ్చని   వివరణ కూడా ఇచ్చారు.   
నిజానికి వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ తో జట్టు కట్టేందుకు సిద్దంగా ఉందనే సంకేతాలు దండిగానే అందుతున్నాయి.

ఇటీవల అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్, మరో  ‘ముఖ్య’ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీకి,  రాహుల్ గాంధీకి సానుకూలంగా మాట్లాడుతున్నారు.  అలాగే, ఢిల్లీ  మద్యం కుంభకోణంలో అనుమానితులుగా ఈడీ విచారణ ఎదుర్కుంటున్న ముఖ్యమంత్రి కేసీఅర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత  వివిధ టీవీ చానల్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలలో  బీజేపీ ని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ అహంకారాన్ని, పెద్దన్న దర్పాన్ని వదిలించుకుని కలిసొస్తే కాదనే దేముందంటూ వ్యాఖ్యలు చేశారు. నిజానికి  కాంగ్రెస్  అవసరం బీఆర్ఎస్ కు ఉంది.  బీఆర్ఎస్ అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. సో రెండింటికీ  చేతులు కలిసే అవసరం, అవకాశం రెండూ ఉన్నాయన్నది పరిశీలకుల విశ్లేషణ.

అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్‌తో కలిసే ప్రసక్తే లేదని చెబుతున్నారు. ఒంటరిగానే అధికారంలోకి వస్తామని అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇతర సీనియర్లు మాత్రం కారుతో షికారు కోరుకుంటున్నారు.  ఇది కాంగ్రెస్‌లో కొత్త అలజడికి కారణం అవుతోంది. ఎదుర్కోవాల్సిన పార్టీతో పొత్తులని ప్రచారం చేసుకుంటే మొదటికే మోసం వస్తుందని పరిశీలకులు అంటున్నారు. అయితే చివరకు ఏమవుతుంది? ఏం జరుగుతుంది.. అన్న ప్రశ్నకు మాత్రం వేచి చూడాల్సిందే అన్న సమాధానమే వస్తోంది. 

By
en-us Political News

  
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్‌ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్‌లో కుటుంబ కలహాలు విషాదాంతమయ్యాయి
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పంజాబ్‌లోని ప్రసిద్ధ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో శనివారం రాత్రి ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ఎండిన నదిలో గంగమ్మ పరవళ్లు.. కరువు నేలపై జలకళ.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.