తెలంగాణలో కాంగ్రెస్ సానుకూలతను ప్రతికూలంగా మార్చుకుంటోందా?

Publish Date:Sep 6, 2023

Advertisement

తెలంగాణ రాష్ట్రంలో మరో సారి ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంట్ రగిల్చేందుకు రంగం సిద్ధమైందా? 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో వలె చివరి నిముషంలో బీఆర్ఎస్ కు అనుకూలంగా వాతావరణం మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయా? వైఎస్ ఇమేజ్ అంటూ షర్మిలను పార్టీలోకి తీసుకురావడం ద్వారా కాంగ్రెస్ తప్పులో కాలేస్తోందా? వైఎస్సార్టీపీ విలీనం కాంగ్రెస్ కు రాష్ట్రంలో ఉన్న సానుకూలతను ప్రతికూలతగా మార్చేస్తుందా, రాష్ట్రంలో మరోసారి ఉద్యమకాలం నాటి పరిస్థితి ఏర్పడేందుకు దోహదం చేస్తుందా? అంటే పరిశీలకులు ఆ అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.  

ఆంధ్రా మూలాలున్న లీడర్లు ఇక్కడ రాజకీయంగా యాక్టివ్​ కావడం,  వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, కాంగ్రెస్​ సీనియర్​ నేత కేవీపీ తెలంగాణ రాజకీయాలపై ఫోకస్​ పెట్టిన నేపథ్యంలో ఈ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బీఆర్ఎస్ గా మారిన తరువాత ఇక తెలంగాణ సెంటిమెంట్ అధికార పార్టీకి ఇసుమంతైనా దోహదపడే అవకాశాలు లేవని అంతా భావించారు. అయితే తెలంగాణ రాజకీయాలలో ఏపీ ప్రాంతానికి చెందిన నేతలు చక్రం తిప్పే పరిస్థితులు కనిపిస్తుండటంతో  బీఆర్ఎస్ కు వాతావరణం అనుకూలంగా మారుతోందా అన్న అనుమానాలను పరీశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలో కాంగ్రెస్ మరో సారి దెబ్బతినడం ఖాయమన్న విశ్లేషణలు చేస్తున్నారు.  

 2014లో జరిగిన  ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్​ బలంగా పనిచేసింది. అయితే ఆ పరిస్థితి   2018  ఎన్నికల సమయంలో పెద్దగా కనిపించలేదు. అప్పుడు నాటికి అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఎన్నికల అజెండాగా అంతా భావించారు. అయితే సరిగ్గా ఎన్నికలకు ముందు  చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ కలిసి తెలంగాణలో కేసీఆర్ కు వ్యతిరేకంగా కూటమి కట్టారో..అభివృద్ధి, సంక్షేమం అజెండాలు పక్కకు పోయి తెలంగాణ సెంటిమెంట్ బలంగా పని చేసింది. తెలుగుదేశం  అధినేత   చంద్రబాబు  తెలంగాణ  ఉద్యమాన్ని వ్యతిరేకించిన వ్యక్తిగానే జనం చూశారు. ఆ కారణంగానే తెలుగుదేశం పార్టీనే కాదు.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీని కూడా ఆ ఎన్నికలలో తిరస్కరించారు.  ఎంత లేదన్న కాంగ్రెస్, తెలుగుదేశం పొత్తు కాురుణంగా 2018 ఎన్నికలలో పాతిక నుంచి ముప్ఫై స్ధానాలలో కాంగ్రెస్​ దెబ్బతిని పరాజయం పాలైందని అప్పట్లో కాంగ్రెస్ నాయకులే బాహాటంగా వ్యాఖ్యలు చేశారు. పొత్తు లేకుండా నాటి ఎన్నికలలో కాంగ్రెస్ కచ్చితంగా మరో పాతిక నుంచి ముప్ఫై స్థానాలలో విజయం సాధించి ఉండేదనీ, అప్పుడు కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ కు పెద్దగా స్పందన ఉండి ఉండేది కాదనీ కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ చెబుతుంటారు.  

ఏతా వాతా అప్పుడూ, ఇప్పుడూ కూడా కాంగ్రెస్ చెప్పేదేంటంటే అప్పట్లో తాము తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని నష్టపోయామని.  తాము చంద్రబాబు వల్ల నష్టపోయాయని అప్పట్లో పలువురు కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా అంగీకరించిన సంగతి కూడా తెలిసిందే.అయితే ఐదేళ్లు గడిచిపోవచ్చాయి. మళ్లీ రాష్ట్రంలో ఎన్నికల సమయం వచ్చేసింది. కాంగ్రెస్ కు వాతావరణం సానుకూలంగా ఉందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇప్పుడు కాంగ్రెస్ మరో సారి షర్మిల పార్టీ విలీనం అంటూ ఆ సానుకూలతను ప్రతికూలంగా మార్చుకునే దిశగా ఆడుగులు వేస్తున్నదని పరిశీలకులు అంటున్నారు.   తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏపీ నుంచి ఎవరైనా రాష్ట్రానికి రావాలంటే వీసా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ గతంలో చేసిన వ్యాఖ్యలను తెలంగాణ సమాజం ఇప్పటికీ మరచిపోలేదు. అటువంటి నాయకుడి కుమార్తె  షర్మిలను తెలంగాణ సమాజం అంగీకరించి ఆదరించే పరిస్థితులు ఇప్పటికీ లేవు.  అందుకే  షర్మిల  వైఎస్సార్టీపీ పేర తెలంగాణలో రాజకీయంగా ఎదుగుదామని చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు  

తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 3,600 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర చేసినా, ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలను మించి  ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబం లక్ష్యంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించినా..   జనం నమ్మలేదు. తెలంగాణలో ఆమె కానీ, ఆమె పార్టీ కానీ ఏ మాత్రం ప్రభావం చూపలేదు. ఈ పరిస్థితుల్లో షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేయడానికి రెడీ ఆయ్యారు. కాంగ్రెస్ కూడా రెడ్ కార్పెట్ పరిచి వెల్ కమ్ చెబుతున్నట్లుగానే కనిపిస్తోంది.  టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి షర్మిల రాకను తీవ్రంగా వ్యతిరేకించినా,  వీహెచ్ వంటి సీనియర్ నేతలు అభ్యంతరం చెప్పినా కాంగ్రెస్ హై కమాండ్ ఖాతరు చేస్తున్నట్లు కనిపించదు.  షర్మిల పార్టీని కాంగ్రెస్ లో వీలీనం చేసుకుని ఆమెను తెలంగాణ రాజకీయాలకు దూరం పెట్టినా పెద్దగా ప్రయోజనం అయితే ఉండే అవకాశం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆమె ఏపీ రాజకీయాలలో చూపే ప్రభావం కూడా అంతంత మాత్రమేననీ, వైఎస్ ఇమేజ్ పేరిట ఆమె ఏపీ రాజకీయాలలో అక్కడి అధికార జగన్ పార్టీకి ఒకింత నష్టం చేకూరిస్తే చేకూర్చవచ్చు కానీ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేంతగా ప్రభావితం చేయలేరనీ అంటున్నారు.  

By
en-us Political News

  
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.