తెలంగాణలో కాంగి‘రేసు’.. తగ్గిన కారు స్పీడు!

Publish Date:Oct 17, 2023

Advertisement

ఇంకేముంది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హస్తం పార్టీ ఇరగదీసింది. ఇది తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని శ్రేణులకు నయా జోష్ ఇచ్చినట్లు అయింది. దీంతో తెలంగాణలో పోలిటికల్ ఈక్వేషన్స్ ఒక్కసారిగా మారిపోయాయి. అప్పటి వరకు రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీలమధ్య హోరాహోరీ పోరు ఉంటుందని అంతా భావించారు. అందుకు తగ్గట్టుగానే ఇరు పార్టీలూ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ అదే బిల్డప్ ఇచ్చాయి. అలాంటి వేళ ఆ రెండు పార్టీల నేతలు కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత పరస్పర విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టేసి కాంగ్రెస్ ను టార్గెట్ చేయడం మొదలెట్టారు.  అయితే అప్పటి వరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ సభలు, సమావేశాలు, పాదయాత్రల ద్వారా ప్రజల్లోకి బలంగా దూసుకుపోతుండగా..   కర్ణాటక ఎన్నికల ఫలితాలతో.. ఆ పార్టీ అగ్రనేతల నుంచి కార్యకర్తల వరకూ అంతా రీచార్జీ  అయిపోయారు. దీంతో రాష్ట్రంలో అధికారాన్ని కాంగ్రెస్ హస్తగతం చేసుకొంటుందనే ఓ ప్రచారం  తెలంగాణ సమాజంలో చాలా వేగంగా చొచ్చుకు పోయింది. 

అలాగే రేవంత్‌రెడ్డి టీపీసీసీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి కాంగిరేసుగుర్రంలా దౌడు తీయిస్తున్నారన్న భావన సామాన్య జనంలో కూడా బలంగా వేళ్లూనుకుంది. కానీ శతాబ్దానికిపైగా చరిత్ర గల పార్టీలో దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్న నేతలను కాకుండా.. బయట నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగించడం పార్టీలోని సీనియర్లుగా చెప్పుకుంటున్న నాయకులకు సుతరాము ఇష్టం లేకుండా పోయింది..  దీంతో కర్ణాటక ఎన్నికల పలితాలు హస్తం పార్టీకి అనుకూలంగా వచ్చే వరకు సదరు వర్గం.. రెవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు  గుప్పించింది. అలాంటి అసంతృప్తి జీవులను గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం నవరత్న తైలంతో వారికి తలంటి మరీ  కూల్ చేసింది. 

ఇంతలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో టికెట్ల రగడ మొదలైంది.   తొలి జాబితాను ఏఐసీసీ ప్రకటించింది. దీంతో టికెట్లు ఆశించి భంగపడిన  అసంతృప్తి జీవులంతా ఒక్క సారిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై విమర్శల  బాణాలు సంధించారు. 

ఇక ప్రస్తుతం మల్కాజ్‌గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కొడంగల్ అసెంబ్లీ స్థానం  నుంచి బరిలోకి దిగుతున్నారు. అయితే ఆయన్ని అక్కడ ఓడించి తీరుతామని.. ప్రస్తుతం ఎమ్మెల్యే టికెట్లు ఆశించి భంగపడిన ఆసంతృప్తి జీవులంతా భీషణ ప్రతిజ్జలు చేస్తున్నారు. మరోవైపు పార్టీతో దశాబ్దాలుగా అనుబంధం ఉన్న పాతతరం నేతలంతా అసంతృప్తితో జూలు విదిల్చి కదం తొక్కుతున్నారు. అలాంటి వారిలో తాజాగా పీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి పోన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి  రాజీనామా చేశారు.  ఆ బాటలో మరింత మంది నేతలు   పయనించే అవకాశం ఉందనే ఓ ప్రచారం సైతం  రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.

ఇంకో వైపు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీయేఇచ్చినా.. ఆ విషయాన్ని ప్రజల్లోకి వెళ్లి చెప్పుకోలేక రాష్ట్ర ఆవిర్భావం తరువాత జరిగిన రెండు ఎన్నికలలోనూ పరాజయంతో చతికిలపడిన పార్టీ ఈ సారి మాత్రం ఎలాంటి అవకాశాన్నీ వదులుకోకూడదన్నట్లుగా కాంగ్రెస్ శ్రేణుల్లో పట్టుదల కనిపిస్తోంది. 

 కురుక్షేత్రానికి వెళ్లే ముందు పాండవులు జమ్మి చెట్టుపై ఉన్న ఆయుధాలను దించుకొన్నట్లు తెలంగాణ సెంటిమెంటును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వాడుకొంటున్నారనీ, అయితే పార్టీ పేరులోనే తెలంగాణ పదాన్ని తుడిచేచసిన కేసీఆర్ కు ఈ సారి సెంటిమెంట్ అందివచ్చే అవకాశం లేదనీ పరిశీలకులు అంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన   రేవంత్ రెడ్డి.. తన మాటలు పదునుతో.. బీఆర్ఎస్ అగ్రనేతలతో కంగారు పుట్టిస్తుండమే కాకుండా..  పార్టీలోని నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకు వస్తూ.. ముందుకు సాగుతున్నారు.  ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా.. రేవంత్ పగ్గాలు చేపట్టిన తరువాతనే కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనబడుతోందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన కాంగ్రెస్ హై కమాండ్ సీనియర్ల అసంతృప్తి, అసమ్మతి రాగాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా రేవంత్ కు దన్నుగా నిలబడింది.

 అయితే  హస్తం పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అధికంగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీలో గ్రూప్‌లు, అసంతృప్తి నేతలు, కోవర్టుల కొకొల్లలుగా ఉంటారు. దీంతో వాళ్లందరినీ ఏకతాటిపైకి తీసుకు రావడం.. అలాగే అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీలను వెనక్కి నెట్టి.. తనతోపాటు తన పార్టీ శ్రేణులను ముందుకు తీసుకు వెళ్లి.. రానున్న ఎన్నికల ఫలితాల్లో తన సత్తా చాటు కొంటూ దుమ్ము రేపండం రేవంత్ కు ఇప్పటికీ సవాలేనని పరిశీలకులు అంటున్నారు.   

By
en-us Political News

  
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.