కాంగ్రెస్ నిరసన : రాహుల్ హెచ్చరించిన ‘ఓట్ల చోరీ’.. నిజమైంది: డిప్యూటీ సీఎం భట్టి

Publish Date:Sep 28, 2026

Advertisement

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..! 

దేశంలో గత కొన్నేళ్లుగా కుట్రపూరితంగా పౌరుల ఓటు హక్కును కాలరాస్తూ ‘ఓట్ల చోరీ’ జరుగుతోందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన హెచ్చరికలు ఇప్పుడు నిజమని తేలిపోయాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఎస్‌ఐఆర్‌ (SIR) పేరుతో పౌరుల ఓట్లను తొలగిస్తున్న తీరుపై ఇతర ఎన్నికల కమిషనర్లు సైతం స్వయంగా అంగీకరించడం ప్రజాస్వామ్యానికి దురదృష్టకర పరిణామమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో.. టీపీసీసీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో కాంగ్రెస్ శ్రేణులు భారీ నిరసన చేపట్టాయి. బీఆర్‌కే భవన్‌ వద్ద ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ఎదుట ఈ ఆందోళన నిర్వహించారు.

పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ అజారుద్దీన్‌లతో కలిసి భట్టి విక్రమార్క నిరసనలో పాల్గొన్నారు. అనంతరం ఎన్నికల కమిషన్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

ఓటర్ల జాబితాల సవరణ, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓటు హక్కు పరిరక్షణకు ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.

 

 


[ Congress Protest, Bhatti Vikramarka, Rahul Gandhi, Vote Chori, SIR, Special Intensive Revision, Election Commission, CEC Gyanesh Kumar, CEC Resignation, TPCC, Mahesh Kumar Goud, Sridhar Babu, Ponnam Prabhakar, Azharuddin, Telangana Congress ]

By
en-us Political News

  
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంక్షేమ అధ్యాయానికి తెరలేచింది.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్‌ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్‌లో కుటుంబ కలహాలు విషాదాంతమయ్యాయి
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పంజాబ్‌లోని ప్రసిద్ధ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో శనివారం రాత్రి ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.