ఇంతవరకు ఇదీ ... కథ.. కహానీ ఔర్ బాకీ హై!

Publish Date:Sep 30, 2022

Advertisement

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఒక ఘట్టం ముగిసింది. నామినేషన్ల ఘట్టం పూర్తయింది. ముందునుంచి నేను రేసులో ఉన్నాను అని చెప్పుకుంటూ వచ్చిన తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌’ అన్నంత  పని చేశారు. ముందుగా  ప్రకటించిన విధంగా  నామినేషన్ల గడువు చివరి  రోజు శుక్రవారం( సెప్టెంబర్ 30)  నామినేషన్‌ దాఖలు చేశారు. 

అంతే కాకుండా, పరోక్షంగానే అయినా, గాంధీలకు వ్యతిరేకంగా జీ 23 స్వరాన్ని వినిపించారు. గాంధీ కుటుంబ బయటి వ్యక్తిగా బరిలో దిగారు. నిజానికి గతంలో శరద్ పవార్, రాజేష్ పైలెట్, జితేంద్ర ప్రసాద , సోనియా గాంధీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ అధ్యక్ష పదివికి బరిలో దిగినా, ఒకటి రెండు శాతం ఓట్లు కూడా తెచ్చుకోలేక పోయారు. ఈ నేపధ్యంలో, అధిష్టానం అధికారిక అభ్యర్ధికి వ్యతిరేకంగా పోటీకి దిగుతున్నారంటే, ఒక విధంగా శశిథరూర్‌ సాహసమే చేస్తున్నారు. ఆఫ్కోర్స్, ఈ ఎన్నికల్లో అయన ఓడి పోయినా, ఆయనకు పోయేదేమీ లేదు. మహా అయితే, మళ్ళీ మరో మారు కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసే అవకాశం రాక పోవచ్చును, కానీ అదే ఆయన గెలిస్తే మాత్రం  అది కాంగ్రెస్ చరిత్రలో మైలు రాయిగా నిలిచి పోతుంది. చరిత్ర సృష్టించిన హీరో అవుతారు. 

సరే  శశిథరూర్‌ విషయం అలా ఉంటే  10 జనపథ్ (సోనియా గాంధీ నివాసం) కేంద్రంగా సాగిన అసలు కథ హాలీవుడ్  సస్పెన్స్ థిల్లర్ ను మరిపించింది. సోనియా గాంధీ ముందు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ను పికప్ చేశారు. ఆయన, ముఖ్యమంత్రి పదవి వదిలి,  ఢిల్లీ వచ్చేందుకు సిద్ధంగా లేక పోయినా, ఒప్పించి, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో దించారు. ఆ తర్వాత ఏమి జరిగిందన్నది అందరికీ తెలిసిందే. మళ్ళీ మళ్ళీ చెప్పుకోవలసిన అవసరం లేదు. గాంధీ కుటుంబానికి వీర విధేయుడు అనుకున్న గెహ్లాట్ , ఎదురు తిరిగారు. సచిన్ పైలెట్ ను రాజస్థాన్ ముఖ్యమంత్రి చేస్తే ఒప్పుకునేది లేదని షరతు విధించారు. ఎక్కడా ఎవరికీ, అనుమానం రాకుండా, ఏకంగా 90 మంది ఎమ్మెల్యేలను కూడగట్టి, మూకుమ్మడి రాజీనామా అస్త్రాన్ని సంధించారు.

అధిష్టానం ఆదేశాలను దిక్కరించారు. సరే ఆ తర్వాత సారీ చెప్పారనుకోండి అది వేరే విషయం.  కట్ చేస్తే... రెండు రోజుల  హై డ్రామా తర్వాత సోనియా గాంధీ గెహ్లాట్ ను అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పించారు. మరో  గాంధీ ఫ్యామిలీ విధేయుడు దిగ్విజయ్ సింగ్ ను తెర మీదకు తెచ్చారు. ఓ 24 గంటలు ఆయన చుట్టూనే కథ నడిచింది. దిగ్విజయ్ స్వయంగా, కాంగెస్ అధక్ష్య ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ప్రకటించారు.  శుక్రవారం  నామినేషన్ వేస్తున్నట్లు కూడా చెప్పారు.

అంతే కాదు అంతకు నాలుగు రోజుల ముందు, అలాంటి ఆలోచన లేదని చెప్పిన దిగ్విజయ్ రాహుల్ గాంధీ యాత్ర నుంచి నేరుగా, ఢిల్లీ వచ్చి  ఎన్నికల బరిలో ‘టోపీ’ వేశారు. కానీ, ఆఖరి క్షణంలో ఆయన డ్రాప్ అయ్యారు.  ఆయన స్థానంలో లేటుగా వచ్చినా లేటెస్టుగా .. వచ్చినా .. అమ్మ ఆశీస్సులు ముఖ్యం అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్య సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే  ఆఖరి క్షణంలో వచ్చి నామినేషన్ వేశారు. దిగ్విజయ్ సింగ్ తనకు ఖర్గే పై ఉన్న ‘అపరిమిత’ గౌరవం కారణంగా పోటీ నుంచి తప్పుకుని ఖర్గే కు మద్దతు ప్రకటించారు.

నిజమే ఇక్కడ ఎక్కడా  సోనియా గాంధీ ప్రత్యక్షంగా తెర మీదకు రాలేదు కానీ, కథ మొత్తం 10 జనపథ్  కేంద్రంగానే జరిగింది. అదేమీ రహస్యం కాదు. నిజానికి,  సోనియా గాంధీ చాలా స్పష్టంగా తను న్యూట్రల్ గా ఉంటానని, ఎవరైనా అధ్యక్ష పదవికి పోటీ చేయవచ్చని శశిథరూర్‌ కు మాటిచ్చారు. కానీ, జరిగిన కథ అందుకు పూర్తి భిన్నంగా జరిగింది.  అయితే, ఇంతటితో అయిపొయినట్లేనా లేక ఇంకా కథ మిగిలే ఉందా.. అంటే .. కహానీ ఔర్ బాకీ హై అనే అంటున్నారు. అక్టోబరు 1న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబరు 8 వరకు గడువు ఉంది, అప్పటి వరకు, ఏదైనా జరగవచ్చును. ఇంతవరకు ఇదీ కథ .

By
en-us Political News

  
స్నేహితులే కదా అని నమ్మాడు.. వాళ్లు ఫోన్ చేసి పిలిస్తే ఏదో మాట్లాడుకుందామని ఇంటి నుంచి బయటకు వచ్చాడు. కానీ అదే అతడి చివరి అడుగైంది.
భారతదేశంలో కోట్లాది మంది నిత్యం వినియోగిస్తున్న డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ కారిడార్‌ అయిన మాదాపూర్‌లో ఇటీవల వెలుగుచూసిన ఓయో హోటల్ యువతి అనుమానాస్పద మృతి ఉదంతం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య కొత్తలుపులు తెరుస్తోంది.
హైదరాబాద్ మహానగరంలో వినాయక చవితి నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి.
దేశవ్యాప్తంగా ఎంతో అత్యాధునిక సౌకర్యాలు, అత్యున్నత భద్రతా ప్రమాణాలతో ప్రయాణాలకు మారుపేరుగా నిలిచిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఒక ఘటన కలకలం రేపింది.
ప్యారడైజ్‌ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. కానీ థియేటర్‌లో సినిమా చూసే ఆడియన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ సిద్ధమైంది.
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
బెంగళూరులోని కుమ్రం భీం కాదండోయ్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉంటూ తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్న కన్నడ నటుడు దర్శన్ కేసులోని ప్రధాన నిందితురాలు పవిత్రా గౌడ కోర్టులో చేసిన వ్యాఖ్యలు
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.